శుక్రవారం, జులై 10, 2020
home
ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
జాతీయ- అంతర్జాతీయ
క్రైమ్
పాలిటిక్స్
బిజినెస్‌
క్రీడలు
సినిమా

ఫీచర్ పేజీలు

ఫొటోలు
వీడియోలు
ఎన్ఆర్ఐ

ఇంకా..

E Paper
Archives
Terms & Conditions
Privacy Policy
FacebookTwitter

తాజా వార్తలు

స్మిత్‌ కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టాలి: పాంటింగ్‌

సిడ్నీ: ఆస్ట్రేలియా కెప్టెన్‌గా స్టీవ్‌స్మిత్‌ మళ్లీ బాధ్యతలు చేపడితే చూడాలని ఉందని ఆ జట్టు మాజీ సారథి రికీ పాంటింగ్‌ అభిప్రాయపడ్డాడు. ప్రస్తుత సారథి టిమ్‌పైన్‌ బ్యాటింగ్‌లో విఫలమౌతుండగా జట్టులో అతడి స్థానంపై ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఈ సందర్భంగా స్టీవ్‌స్మిత్‌ తిరిగి సారథ్య బాధ్యతలు అందుకోవాలనే అక్కడి అభిమానులు భావిస్తున్నారు. ఈ విషయంపై పాంటింగ్‌ ఓ మీడియాతో మాట్లాడుతూ ‘టిమ్‌పైన్‌ ఎన్నిరోజులు కొనసాగుతాడో అతడి ఇష్టం. కెప్టెన్సీ విషయం పక్కనపెడితే అతడో అత్యుత్తమ వికెట్‌కీపర్‌. ఒకవేళ అతను కెప్టెన్‌గా తప్పుకుంటే ఆ స్థానంలో స్మిత్‌ని చూడాలని ఉంది. ఆసీస్‌ జట్టుకు అతడే సరైన నాయకుడు’ అని వివరించాడు.

గతేడాది బాల్‌ టాంపరింగ్‌ వివాదంలో చిక్కుకున్న స్టీవ్‌స్మిత్‌ ఏడాది పాటు ఆటకు దూరమైన సంగతి తెలిసిందే. అయితే, అతడిపై విధించిన కెప్టెన్సీ నిషేధం ఇంకా అమల్లో ఉంది. వచ్చే మార్చిలో ఈ శిక్ష కూడా పూర్తవుతుంది. కాగా ఇంగ్లాండ్‌లో జరిగిన వన్డే ప్రపంచకప్‌లో అతడు తిరిగి అంతర్జాతీయ క్రికెట్‌లోకి అడుగుపెట్టి ఆకట్టుకున్నాడు. అనంతరం యాషెస్‌ సిరీస్‌లో అద్భుతంగా ఆడి 2-2తో సిరీస్‌ను సమం చేశాడు. దీంతో స్టీవ్‌స్మిత్‌ జట్టు పగ్గాలు అందుకుంటే బాగుంటుందని ఆసీస్‌ అభిమానులతో పాటు పాంటింగ్‌ కోరుతున్నాడు. 

ఈ విషయంపై క్రికెట్‌ ఆస్ట్రేలియా తుదినిర్ణయం తీసుకోవాలని, ఒకవేళ స్మిత్‌ జట్టు పగ్గాలు చేపడితే.. అది అతడి బ్యాటింగ్‌పై ప్రభావం చూపదని పాంటింగ్‌ అన్నాడు. అలాగే జట్టుకు మరిన్ని విజయాలు అందిస్తాడని చెప్పాడు. ఇదే విషయంపై ప్రస్తుత సారథి టిమ్‌పైన్‌ మాట్లాడుతూ.. ఆసీస్‌ కెప్టెన్‌గా తన బాధ్యతల్ని ఆస్వాదిస్తున్నానని చెప్పాడు. అయితే, ఏదో ఒకరోజు స్టీవ్‌స్మిత్‌ తిరిగి సారథిగా రావాలని కోరుకుంటున్నట్లు తెలిపాడు. అలా స్మిత్‌ జట్టు పగ్గాలు అందుకుంటే తాను పూర్తి మద్దతు తెలుపుతానని చెప్పాడు. 

Tags:

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లాలు

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని