శుక్రవారం, జులై 10, 2020
home
ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
జాతీయ- అంతర్జాతీయ
క్రైమ్
పాలిటిక్స్
బిజినెస్‌
క్రీడలు
సినిమా

ఫీచర్ పేజీలు

ఫొటోలు
వీడియోలు
ఎన్ఆర్ఐ

ఇంకా..

E Paper
Archives
Terms & Conditions
Privacy Policy
FacebookTwitter

తాజా వార్తలు

సుప్రీం తీర్పుపై న్యాయవాదులు ఏమన్నారంటే..

దిల్లీ: వివాదాస్పద అయోధ్య కేసుపై శనివారం సుప్రీంకోర్టు తుదితీర్పు వెలువరించిన విషయం తెలిసిందే. అయోధ్య వివాదాస్పద స్థలం హిందువులదేనని, ముస్లింలకు అయోధ్యలోనే 5ఎకరాల స్థలం ప్రత్యామ్నాయంగా కేటాయించాలని సుప్రీం తెలిపింది. దీనిపై పలువురు లాయర్లు, లా బోర్డులు స్పందించాయి.

* ‘సుప్రీం తీర్పు పట్ల గౌరవం ఉంది. కానీ, మేం సంతృప్తిగా లేం. భవిష్యత్తు కార్యాచరణ ఏమిటనేది తర్వాత నిర్ణయిస్తాం. మా కమిటీ అంగీకరిస్తే దీనిపై రివ్యూ పిటిషన్‌ వేస్తాం. ఎందుకంటే ఇది మా హక్కు. సుప్రీం కోర్టు నియమాలు కూడా ఇదే మాట చెబుతున్నాయి.’ -జాఫర్‌యాబ్‌ జిలానీ, ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్‌ లాబోర్డు లాయర్‌.

*‘అయోధ్య విషయంలో సుప్రీం ఇచ్చిన తీర్పు చారిత్రకమైంది. ఈ రకంగా సుప్రీం భిన్నత్వంలో ఏకత్వం అనే సందేశాన్ని పంపింది’ -వరుణ్‌ కుమార్‌ సిన్హా, హిందూ మహాసభ న్యాయవాది.

* ‘అయోధ్యలోనే 5 ఎకరాల స్థలాన్ని ముస్లింలకు కేటాయించాల్సిందిగా సుప్రీం తీర్పు చెప్పింది. నాకు తెలిసి ఇది అందరికీ ఆమోద యోగ్యమైన తీర్పు’ - విష్ణు శంకర్‌ జైన్‌,హిందూ మహాసభ న్యాయవాది


Tags:

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లాలు

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని