శుక్రవారం, జులై 10, 2020
home
ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
జాతీయ- అంతర్జాతీయ
క్రైమ్
పాలిటిక్స్
బిజినెస్‌
క్రీడలు
సినిమా

ఫీచర్ పేజీలు

ఫొటోలు
వీడియోలు
ఎన్ఆర్ఐ

ఇంకా..

E Paper
Archives
Terms & Conditions
Privacy Policy
FacebookTwitter

తాజా వార్తలు

ఇస్లామాబాద్‌ జట్టుకు హెడ్‌కోచ్‌గా మిస్బా!

పాక్‌ బోర్డు అనుమతితోనే..

లాహోర్‌: పాకిస్థాన్‌ సూపర్‌ లీగ్‌(పీఎస్‌ఎల్‌) ఫ్రాంఛైజీ ఇస్లామాబాద్‌ యునైటెడ్‌.. తమ ప్రధాన కోచ్‌ డీన్‌జోన్స్‌ను తొలగించి, మాజీ కెప్టెన్‌ మిస్బా ఉల్‌ హక్‌ను నియమించుకుందని తెలుస్తోంది. పాకిస్థాన్‌ జాతీయ జట్టుకు ప్రధాన కోచ్‌, చీఫ్‌ సెలెక్టర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్న మిస్బా పీఎస్‌ఎల్‌లోకి రావడాన్ని ఇతర ఫ్రాంఛైజీలు వ్యతిరేకిస్తున్నాయి. పరస్పర విరుద్ధ ప్రయోజనాల నేపథ్యంలో అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నాయి. ఇదిలా ఉండగా డీన్‌జోన్స్‌ ట్విటర్‌ వేదికగా ఓ వీడియోను విడుదల చేస్తూ ఇస్లామాబాద్‌ జట్టు నుంచి తాను వైదొలగుతున్నట్లు ప్రకటించాడు.

‘ఇస్లామాబాద్‌ యునైటెడ్‌ యాజమాన్యంతో చర్చించాను. ఆ జట్టు ఈసారి కొత్త కోచ్‌ను నియమించుకోవాలని చూస్తోంది. రెండుసార్లు టైటిల్‌ విజేతగా నిలిపిన జట్టును వీడటం కాస్త నిరాశకు గురిచేసింది. గత నాలుగేళ్లు అద్భుతంగా గడిచాయి. నైపుణ్యం కలిగిన కొంతమంది యువకులు పాకిస్థాన్‌ జట్టుకు ఆడుతుండటం సంతోషకరం. ఇస్లామాబాద్‌ జట్టుకు అభినందనలు’ అని జోన్స్‌ పేర్కొన్నాడు. మరోవైపు మిస్బా నియామకాన్ని ఇస్లామాబాద్‌ జట్టు అధికారికంగా ప్రకటించలేదు. 
ఇదిలా ఉండగా మిస్బా ఒకే సంస్థ పరిధిలో వివిధ బాధ్యతలు చేపట్టడానికి పాక్‌ క్రికెట్‌ బోర్డు అంగీకరించిందని సమాచారం. పీఎస్‌ఎల్‌లో మిస్బా ఏ జట్టుతో కలిసి పనిచేసినా పీసీబీకి ఎలాంటి అభ్యంతరం లేదని.. ఈ మేరకు వారి మధ్య ఒప్పందం కుదిరినట్లు తెలుస్తోంది. అయితే, మిస్బా ఆ సమయంలో బోర్డు నుంచి ఎలాంటి రెమ్యునరేషన్‌ తీసుకునే అవకాశం లేకపోవడం గమనార్హం.

Tags:

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లాలు

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని