శనివారం, ఏప్రిల్ 04, 2020
home
ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
జాతీయ- అంతర్జాతీయ
క్రైమ్
పాలిటిక్స్
బిజినెస్‌
క్రీడలు
సినిమా

ఫీచర్ పేజీలు

ఫొటోలు
వీడియోలు
ఎన్ఆర్ఐ

ఇంకా..

E Paper
Archives
Terms & Conditions
Privacy Policy
FacebookTwitter

తాజా వార్తలు

రిలయన్స్‌ పెట్రోల్‌ పంపుల్లో విక్రయాల జోరు

న్యూదిల్లీ: దేశీయ చమురు రంగ దిగ్గజం రిలయన్స్‌ చమురు రిటైల్‌ మార్కెట్లో కూడా తన హవా కొనసాగిస్తోంది. రిలయన్స్‌కు చెందిన దాదాపు 1,400 పెట్రోల్‌ పంపుల్లో విక్రయాలు డిసెంబర్‌ 31నాటికి రెండంకెల వృద్ధిరేటును సాధించాయి. డీజిల్‌ విక్రయాల్లో 11శాతం వృద్ధిని.. పెట్రోల్‌ విక్రయాల్లో 15శాతం వృద్ధిని నమోదు చేసినట్లు కంపెనీ వెల్లడించింది. ప్రస్తుతం చమురు రిటైల్‌ పరిశ్రమ వృద్ధిరేటు డీజిల్‌లో 0.2శాతం, పెట్రోల్‌లో 7.1శాతంగా ఉన్నాయి. దీంతో పోలిస్తే రిలయన్స్‌ భారీ వృద్ధిరేటును సాధించినట్లే లెక్క. 
‘‘నాణ్యమైన ఉత్పత్తులు, ఉన్న ఆస్తులను పూర్తిస్థాయిలో వినియోగించుకోవడంతో మంచి రాబడులను సాధించాము. పెట్రోల్‌ కార్ల విక్రయాలు పెరగడం, రోడ్లు మెరుగుపడటం, గ్రామీణ ప్రాంతాల్లో అనుసంధానత పెరడంతో పెట్రోల్‌ డిమాండ్‌ను పెంచాయి. ముఖ్యంగా భారీ సంఖ్యలో వాహనాలు ఉన్న కస్టమర్ల సంఖ్య పెరగడంతో వృద్ధిరేటు సాధ్యమైంది. ’’ అని రిలయన్స్‌ పెరిగింది. 
ప్రస్తుతం రిలయన్స్‌ పెట్రో రీటైల్‌ రెవెన్యూ 5శాతం పెరిగి రూ.3,725 కోట్లకు చేరింది. దాదాపు 538మిలియన్‌ లీటర్ల  ఇంధనాన్ని విక్రయించింది. ప్రస్తుతం రిలయన్స్‌ వద్ద 1,394 పెట్రోల్‌ పంపులు ఉన్నాయి. వీటిల్లో 518 పంపులను కంపెనీ సొంతంగా నిర్వహిస్తుంటే.. మిగిలినవి డీలర్‌షిప్‌ల కింద ఉన్నాయి. 

 

Tags:
కామెంట్స్‌
కామెంట్‌ చేయండి!

లాగిన్ ద్వారా నమోదు చేయండి

మీ వివరాలు తో నమోదు చేయండి

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లాలు

ఎక్కువ మంది చదివినవి (Most Read)