శుక్రవారం, జులై 10, 2020
home
ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
జాతీయ- అంతర్జాతీయ
క్రైమ్
పాలిటిక్స్
బిజినెస్‌
క్రీడలు
సినిమా

ఫీచర్ పేజీలు

ఫొటోలు
వీడియోలు
ఎన్ఆర్ఐ

ఇంకా..

E Paper
Archives
Terms & Conditions
Privacy Policy
FacebookTwitter

తాజా వార్తలు

ధోనీ ఆడాలనుకుంటే.. అది అతడి ఇష్టం!

పుణె: టీమిండియా మాజీ కెప్టెన్‌ మహేంద్రసింగ్‌ ధోనీ జట్టుకు అందుబాటులో ఉండటమనేది అతడు తిరిగి క్రికెట్‌ ఆడతాడా లేదా అనే విషయంపై ఆధారపడి ఉంటుందని ప్రధాన కోచ్‌ రవిశాస్త్రి అన్నాడు. ఇంగ్లాండ్‌లో వన్డే ప్రపంచ కప్‌ తర్వాత వెస్టిండీస్‌, దక్షిణాఫ్రికా సిరీస్‌లకు అందుబాటులో లేని వికెట్‌ కీపర్‌ ఇప్పుడు మరిన్ని రోజులు ఆటకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నాడు. దీంతో వచ్చే నెలలో జరిగే బంగ్లాదేశ్‌ సిరీస్‌కు సైతం ధోనీ అందుబాటులో ఉండకపోవచ్చు. అయితే డిసెంబర్‌లో విండీస్‌తో జరిగే సిరీస్‌లో పాల్గొంటాడని తెలుస్తోంది. కాగా ఈ మాజీ కెప్టెన్‌ తిరిగి ఎప్పుడు ఆడాలనుకునే విషయంపై అతడే నిర్ణయం తీసుకోవాలని, అలాగే భవిష్యత్‌ ప్రణాళికపైనా సెలక్టర్లకు సమాచారం ఇవ్వాలని శాస్త్రి బుధవారం మీడియాతో మాట్లాడుతూ పేర్కొన్నాడు.  

ప్రపంచకప్‌ పూర్తయ్యాక తాను ధోనీని కలవలేదని, మొదట అతడు క్రికెట్‌ ఆడాలని, ఆపై ఎదైతే అది జరుగుతుందని శాస్త్రి అన్నాడు. మెగా ఈవెంట్‌ తర్వాత ధోనీ ఆడటం మొదలు పెట్టలేదనే తాను భావిస్తున్నానన్నారు. ఒకవేళ ధోనీ అలా చేస్తే కచ్చితంగా సెలక్టర్లకు సమాచారం ఇచ్చేవాడని తెలిపాడు. అతడికి తిరిగి జట్టులోకి రావాలనిపిస్తే.. అది ధోనీ ఇష్టమని కోచ్‌ స్పష్టం చేశాడు. అలాగే టెస్టుల్లో రిషభ్‌ పంత్‌ని కాదని వృద్ధిమాన్‌ సాహాని తిరిగి ఎంపిక చేయడానికి గల కారణాన్ని రవిశాస్త్రి వివరించాడు. గతేడాది జనవరిలో బెంగాల్‌ కీపర్‌ గాయపడడం వల్లే పంత్‌కు అవకాశం వచ్చిందని, ప్రపంచంలో సాహా అత్యుత్తమ వికెట్‌ కీపర్‌ అని మెచ్చుకున్నాడు. సాహా కీపింగ్‌ సామర్థ్యం అసమానమని పేర్కొన్న శాస్త్రి.. పంత్‌ నైపుణ్యంగల బ్యాట్స్‌మన్‌ అని కీర్తించాడు. యువ కీపర్‌ ఇంగ్లాండ్‌, ఆస్ట్రేలియా పర్యటనల్లో శతకాలు చేసినా అతడింకా యువ క్రికెటరే అయినందున అతడి కీపింగ్‌ నిరూపించుకోడానికి చాలా సమయముందని టీమిండియా కోచ్‌ చెప్పుకొచ్చాడు. 

Tags:

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లాలు

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని