శుక్రవారం, జులై 10, 2020
home
ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
జాతీయ- అంతర్జాతీయ
క్రైమ్
పాలిటిక్స్
బిజినెస్‌
క్రీడలు
సినిమా

ఫీచర్ పేజీలు

ఫొటోలు
వీడియోలు
ఎన్ఆర్ఐ

ఇంకా..

E Paper
Archives
Terms & Conditions
Privacy Policy
FacebookTwitter

తాజా వార్తలు

అది నిజం కాదు..ఇది అసలైన ఫొటో..


కాన్పూర్‌: రైళ్లలో పాటలు పాడుకుంటూ యాచన చేసే రాను మండల్‌ను ఓ ప్రయాణికుడు వీడియో చిత్రీకరించి యూట్యూబ్‌లో పెట్టడంతో రాత్రికి రాత్రే సెలబ్రిటీ అయిపోయింది. అయితే అప్పటి నుంచి ఆమె ఏదో విధంగా వార్తల్లో నిలుస్తూనే ఉన్నారు. ఒకానొక సందర్భంలో నేను సెలబ్రిటీని అంటూ ఒక అభిమానిని తోసివేయడం కూడా వార్తల్లోకెక్కింది. తాజాగా కొద్ది రోజుల క్రితం కూడా మేకప్‌ ఓవర్‌గా వేసుకుంది అంటూ సోషల్‌ మీడియాలో ట్రోల్‌ అయ్యింది. ఆ ఓవర్‌ మేకప్‌ ఫొటోపై పలువురు నెటిజన్లు మండల్‌ను కాకుండా ఆమెకు మేకప్‌ వేసిన వ్యక్తిపై విమర్శలు చేశారు. దీంతో ఆమెకు మేకప్‌ వేసిన బ్యూటీషియన్‌ సంధ్య ఎట్టకేలకు స్పందించారు. అది అసలైన ఫొటో కాదు. ఎవరో కావాలనే అలా చేశారంటూ సోషల్‌ మీడియాలో పేర్కొన్నారు. అసలు ఆమె మేకప్‌ చేసిన చిత్రాన్ని జత చేస్తూ నకిలీ చిత్రాన్ని కూడా కలిపి ఉంచారు. ఫొటోను ఇలా మార్ఫింగ్‌ చేసిన వారిపై ఆమె విరుచుకుపడ్డారు. మరోసారి ఇలాంటివి జరిగితే పోలీసులకు ఫిర్యాదు చేయాల్సి వస్తుందంటూ ఆమె హెచ్చరించారు. 

Tags:

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లాలు

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని