శుక్రవారం, జులై 10, 2020
home
ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
జాతీయ- అంతర్జాతీయ
క్రైమ్
పాలిటిక్స్
బిజినెస్‌
క్రీడలు
సినిమా

ఫీచర్ పేజీలు

ఫొటోలు
వీడియోలు
ఎన్ఆర్ఐ

ఇంకా..

E Paper
Archives
Terms & Conditions
Privacy Policy
FacebookTwitter

తాజా వార్తలు

పనిమనిషికి బిజినెస్‌ కార్డ్‌..!

పుణె: తన యజమానురాలు డిజైన్‌ చేసిన ఓ బిజినెస్‌ కార్డు ఆ పనిమనిషికి అవకాశాలు వెల్లువెత్తేలా చేశాయి. పని పోయిందన్న బెంగ మాట అటుంచితే.. వస్తున్న అవకాశాల్లో దేన్ని ఉపయోగించుకోవాలో తెలియని పరిస్థితి ఆమెకు నెలకొంది. ఇంతకీ ఏమైందంటే..  పుణెలో నివసించే ధనశ్రీ షిండే ఓ రోజు ఆఫీసు నుంచి తిరిగి వచ్చినపుడు ఆమె ఇంట్లో పని చేసే గీతా కాలే విచారంగా కనిపించింది. ఏమైందని అడిగితే తాను పని కోల్పోయానని, దాని వల్ల ఆదాయం తగ్గిందని చెప్పుకొచ్చింది. బ్రాండింగ్, మార్కెటింగ్ రంగంలో సీనియర్‌ మేనేజర్‌గా పనిచేస్తున్న ధనశ్రీ తన అనుభవంతో గీతకు సాయం చేయాలనుకుంది. ఆమెకి వచ్చిన ఒక మెరుపులాంటి ఆలోచనతో గీతకు ఒక బిజినెస్‌ కార్డ్‌ తయారుచేసింది. ‘‘గీతా కాలే, ఘర్‌ కామ్‌ మౌషీ ఇన్‌ బావ్దాన్‌’’ (గీతా కాలే, ఇంటి పని సహాయకురాలు, బావ్దాన్‌) అని రాసి ఉన్న వంద కార్డులను ముద్రించింది. ఆ కార్డుమీద ఏ పనికి గీత ఎంత మొత్తం తీసుకుంటుందో అందులో పేర్కొంది. తమ సొసైటీ వాచ్‌మెన్‌ సాయంతో ఆ కార్డులను తమ చుట్టుపక్కల పంచింది. 

గీత, ధనశ్రీల కథను అస్మితా జవడేకర్‌ అనే మహిళ తన ఫేస్‌బుక్‌ ఖాతాలో షేర్‌చేసింది. ఇక ఆ కార్డు ఒక్కరోజులోనే ఇంటర్నెట్‌లో సంచలనం సృష్టించింది. ‘ఇది సూపర్‌ ఐడియా’, ‘చాలా అర్థవంతంగా ఉంది’, ‘అద్బుతమైన ఆలోచన’.. అంటూ కామెంట్లు వెల్లువెత్తాయి. పని ఇస్తామంటూ దేశం నలుమూలల నుంచి వస్తున్న కాల్స్‌తో గీతా కాలే ఫోను విరామం లేకుండా మోగుతూనే ఉందట!

Tags:

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లాలు

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని