శుక్రవారం, జులై 10, 2020
home
ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
జాతీయ- అంతర్జాతీయ
క్రైమ్
పాలిటిక్స్
బిజినెస్‌
క్రీడలు
సినిమా

ఫీచర్ పేజీలు

ఫొటోలు
వీడియోలు
ఎన్ఆర్ఐ

ఇంకా..

E Paper
Archives
Terms & Conditions
Privacy Policy
FacebookTwitter

తాజా వార్తలు

గాంధీ పుట్టిన దేశంలో హింసకు చోటివ్వద్దు

ట్విటర్‌లో ప్రియాంక గాంధీ

దిల్లీ: చారిత్రక అయోధ్య తీర్పు వెలువడుతున్న నేపథ్యంలో కాంగ్రెస్‌ నాయకురాలు ప్రియాంక గాంధీ స్పందించారు. ‘దేశ అత్యున్నత న్యాయస్థానం ఎలాంటి తీర్పిచ్చినా..మనం మాత్రం సంయమనం పాటించాలి. వేల ఏళ్ల నాటి భారత సంప్రదాయమైన ఐకమత్యాన్ని ప్రదర్శించాల్సిన బాధ్యత మనదే. సామాజిక సామరస్యాన్ని, పరస్పర ప్రేమను పంచుకోవాలన్న విషయాన్ని మర్చిపోకూడదు. మహాత్మాగాంధీ పుట్టిన దేశమిది. హింసకు తావుండకూడదు. ఆయన కలలు కన్న దేశ శాంతిని కాపాడటం మన విధి’ అని ప్రియాంక ట్విటర్‌ వేదికగా పిలుపునిచ్చారు.

అయోధ్యలో రామజన్మభూమి- బాబ్రీమసీదు కేసుకు సంబంధించి ఇప్పటికే అన్ని వాదనలు పూర్తవ్వగా.. తాజాగా సీజేఐ రంజన్‌ గొగొయితో కూడిని ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం తీర్పు వెల్లడించింది. ఈ నేపథ్యంలో దేశ వ్యాప్తంగా పటిష్ఠ భద్రతను ఏర్పాటు చేశారు. పలు రాష్ట్రాల్లో ముందస్తు చర్యగా పాఠశాలలకు సెలవులు ప్రకటించారు. మరోవైపు సామాజిక మాధ్యమాల విషయంలోనూ ఆంక్షలు విధించారు.

Tags:

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లాలు

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని