శుక్రవారం, జులై 10, 2020
home
ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
జాతీయ- అంతర్జాతీయ
క్రైమ్
పాలిటిక్స్
బిజినెస్‌
క్రీడలు
సినిమా

ఫీచర్ పేజీలు

ఫొటోలు
వీడియోలు
ఎన్ఆర్ఐ

ఇంకా..

E Paper
Archives
Terms & Conditions
Privacy Policy
FacebookTwitter

తాజా వార్తలు

సియాచిన్‌పై నోరు పారేసుకున్న పాక్‌..

ఇస్లామాబాద్‌‌: ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన యుద్ధ క్షేత్రం సియాచిన్‌పై పాకిస్థాన్‌ వివాదాస్పద వ్యాఖ్యలు చేసింది. సియాచిన్‌ అనేది వివాదాస్పద ప్రాంతమని, అందులో భారత్‌ పర్యాటకుల సందర్శనల కోసం తెరవకూడదని పాకిస్థాన్ పేర్కొంది. సియాచిన్‌లో భారత్‌ పర్యాటకాన్ని చేపట్టడంపై మీడియా అడిగిన ప్రశ్నకు పాకిస్థాన్‌ విదేశాంగ శాఖ ప్రతినిధి ముహమ్మద్‌ ఫైజల్‌ స్పందిస్తూ.. ‘ అది వివాదాస్పద ప్రాంతం. అలాంటి ప్రాంతంలో భారత్‌ పర్యాటకాన్ని ఎలా ప్రారంభిస్తుంది. అయినప్పటికీ ఈ విషయంలో తాము భారత్‌ నుంచి ఎలాంటి మంచిని ఆశించడం లేదు’ అని వెల్లడించారు. . 

ఇటీవల భారత ప్రభుత్వం సియాచిన్‌ ప్రాంతంలో పర్యాటకుల సందర్శనలను అనుమతిస్తూ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. అందులో భాగంగా సియాచిన్‌ బేస్‌ క్యాంప్‌ నుంచి కుమార్‌ పోస్ట్‌ వరకు పర్యాటకులు వెళ్లేందుకు అనుమతించింది. ఈ మేరకు అక్టోబర్‌ 21న పర్యాటకులకు అనుమతినిచ్చే కార్యక్రమాన్ని రక్షణ శాఖామంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌, సైనికాధిపతి బిపిన్‌ రావత్‌తో కలిసి ప్రారంభించారు. 

Tags:

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లాలు

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని