శుక్రవారం, జులై 10, 2020
home
ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
జాతీయ- అంతర్జాతీయ
క్రైమ్
పాలిటిక్స్
బిజినెస్‌
క్రీడలు
సినిమా

ఫీచర్ పేజీలు

ఫొటోలు
వీడియోలు
ఎన్ఆర్ఐ

ఇంకా..

E Paper
Archives
Terms & Conditions
Privacy Policy
FacebookTwitter

తాజా వార్తలు

యాత్రికుల ఫీజు విషయంలో పాక్‌ యూటర్న్‌

ఇస్లామాబాద్‌: కర్తార్‌పూర్‌ సందర్శనకు తొలిరోజు వచ్చే యాత్రికుల నుంచి ఎలాంటి ఫీజూ వసూలు చేయబోమని ప్రకటించిన పాక్‌.. ఈ విషయంలో యూటర్న్‌ తీసుకుంది. తొలిరోజు సందర్శనకు వచ్చేవారు సైతం 20 డాలర్లు ప్రవేశ రుసుముగా చెల్లించాలని పేర్కొంది. గురునానక్‌ 550వ జయంతి సందర్భంగా వచ్చే యాత్రికుల నుంచి తొలిరోజు ఎలాంటి ఫీజూ వసూలు చేయబోమని, పాస్‌పోర్టు అవసరం లేదని ఆ దేశ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌ ప్రకటించిన సంగతి తెలిసిందే. పాస్‌పోర్టు తప్పనిసరి అని ఇప్పటికే ప్రకటించిన ఆ దేశం.. ఇప్పుడు తొలిరోజు ఫీజును కూడా తప్పనిసరి చేసింది. భారత భూభాగంలో నవంబర్‌ 9న గురుదాస్‌పూర్‌లో కారిడార్‌ను ప్రధాని ప్రారంభించనున్నారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం అక్కడ కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తున్నారు.

కర్తార్‌పూర్‌ ఒప్పందంపై గత నెలలో భారత్‌-పాకిస్థాన్‌ ప్రతినిధులు సంతకం చేశారు. గురునానక్‌ తన చివరి 18 ఏళ్ల జీవితాన్ని గురుద్వారా దర్బార్‌ సాహిబ్‌లోనే గడిపారు. ఇది పాకిస్థాన్‌లోని పంజాబ్‌ ప్రావిన్సులో ఉన్న నరోవల్‌ జిల్లాలో ఉంది. అంతర్జాతీయ సరిహద్దుకు కేవలం నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇక్కడకు వచ్చే యాత్రికుల నుంచి 20 డాలర్ల చొప్పున ప్రవేశ రుసుము వసూలు చేయాలని పాక్‌ నిర్ణయించింది.

Tags:

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లాలు

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని