శుక్రవారం, జులై 10, 2020
home
ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
జాతీయ- అంతర్జాతీయ
క్రైమ్
పాలిటిక్స్
బిజినెస్‌
క్రీడలు
సినిమా

ఫీచర్ పేజీలు

ఫొటోలు
వీడియోలు
ఎన్ఆర్ఐ

ఇంకా..

E Paper
Archives
Terms & Conditions
Privacy Policy
FacebookTwitter

తాజా వార్తలు

అరె.. గుడి కాదా..? మరుగుదొడ్డా..!

హమీర్‌పూర్ (ఉత్తర్‌ ప్రదేశ్‌)‌: మనలోని నమ్మకమే దైవం అంటారు. అది నిజమేనని అనిపించే ఒక విచిత్ర సంఘటన ఉత్తర్‌ప్రదేశ్ హమీర్‌పూర్ జిల్లాలోని మౌదాహా గ్రామంలో చోటుచేసుకుంది. ఈ గ్రామ ప్రజలు ఒక సంవత్సరం పాటు భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహించిన నిర్మాణం, గుడి కాదు మరుగుదొడ్డి అని తెలిసి, తర్వాత ఆశ్చర్యపోయారు. దానికి తాళం వేసి ఉండటంతో లోపల దేవుడి విగ్రహం ఉందనుకొని పూజలు చేశారు. 

‘మా గ్రామంలోని సామాజిక ఆరోగ్య కేంద్రం ఆవరణలో ఈ నిర్మాణం ఉంది. దానికి కాషాయరంగు వేసి ఉండటమే కాకుండా, ఆకారం కూడా గుడిలాగే ఉంటుంది. దీంతో అందరూ అది గుడి అనుకొని అక్కడ పూజలు చేయటం ప్రారంభించారు. ఇటీవల ఒక ప్రభుత్వ అధికారి వచ్చి చెప్పడంతో అసలు విషయం తెలిసింది’ అని రాకేష్‌ చందేల్‌ అనే స్థానికుడు తెలియచేశాడు.

నగర పాలిక పరిషత్‌ ఏడాది కిందట నిర్మించిన ఈ ప్రజా మరుగుదొడ్డికి కాంట్రాక్టర్‌ కాషాయరంగు వేయడంతో ప్రజలందరూ కొత్తగా గుడి కట్టారని పొరబడ్డారట. ఇదే కాకుండా స్వచ్ఛభారత్‌ పథకంలో భాగంగా ఉత్తర్‌ప్రదేశ్ లోని  ప్రాంతాల్లో నిర్మించిన టాయిలెట్లు చాలా వరకు కాషాయరంగులోనే ఉన్నాయి. ఈ ఉదంతంతో నాలుక కరుచుకున్న అధికారులు మౌదాహాలోని ఈ టాయిలెట్‌ను గులాబీ రంగులోకి మార్చారు!

Tags:

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లాలు

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని