శుక్రవారం, జులై 10, 2020
home
ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
జాతీయ- అంతర్జాతీయ
క్రైమ్
పాలిటిక్స్
బిజినెస్‌
క్రీడలు
సినిమా

ఫీచర్ పేజీలు

ఫొటోలు
వీడియోలు
ఎన్ఆర్ఐ

ఇంకా..

E Paper
Archives
Terms & Conditions
Privacy Policy
FacebookTwitter

తాజా వార్తలు

కృత్రిమ వెలుగులో పేసర్లను వాడుకోవాలి

దిల్లీ: డే/నైట్‌ టెస్టులో పేసర్లను ఉపయోగించుకొనేటప్పుడు రెండు జట్ల సారథులు వినూత్నంగా ఆలోచించాలని టీమిండియా మాజీ క్రికెటర్‌, ఎంపీ గౌతమ్ గంభీర్‌ అన్నాడు. ఫ్లడ్‌లైట్ల వెలుతురులో పరిస్థితులకు అనుగుణంగా బౌలింగ్‌ చేయిస్తే వారు మరింత సమర్థంగా రాణిస్తారని వెల్లడించాడు. ఈడెన్‌గార్డెన్స్‌ వేదికగా శుక్రవారం భారత్‌, బంగ్లాదేశ్ తొలి గులాబి బంతి టెస్టు ఆడుతున్న సంగతి తెలిసిందే.

‘ఫాస్ట్‌ బౌలర్లను సారథులు వినూత్నంగా వాడుకోవాలి. ఎరుపు బంతి క్రికెట్లో పేసర్లను ఉదయం వినియోగించుకుంటారు. డే/నైట్‌ మ్యాచులో వారిని మధ్యాహ్నం ఒంటి గంటకు కాకుండా ఫ్లడ్‌లైట్ల వెలుతురులో ఉపయోగించుకుంటే సమర్థంగా రాణించగలరు. ఎస్‌జీ గులాబి బంతి ఎలా ప్రవర్తిస్తుందో చూడాలని ఆసక్తికరంగా ఉంది. ఎందుకంటే నేను కూకాబుర్ర గులాబితో ఆడాను. ఎస్‌జీతో ఆడలేదు. లైట్ల వెలుతురులో మణికట్టు స్పిన్నర్‌ను ఎదుర్కోవడం చాలా కష్టం. చేతిలోంచి బంతి బయటకు వస్తున్నప్పుడు గమనించకపోతే ఆడటం సవాల్‌గా ఉంటుంది. బ్లాక్‌థీమ్‌ ఉండి, కృత్రిమ వెలుతురుకు అలవాటు పడితే మణికట్టు స్పిన్నర్లు కీలక పాత్ర పోషిస్తారు’ అని గౌతీ అన్నాడు.

Tags:

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లాలు

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని