శుక్రవారం, జులై 10, 2020
home
ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
జాతీయ- అంతర్జాతీయ
క్రైమ్
పాలిటిక్స్
బిజినెస్‌
క్రీడలు
సినిమా

ఫీచర్ పేజీలు

ఫొటోలు
వీడియోలు
ఎన్ఆర్ఐ

ఇంకా..

E Paper
Archives
Terms & Conditions
Privacy Policy
FacebookTwitter

తాజా వార్తలు

కొత్తబట్టలు వేసుకుని..దంపతుల ఆత్మహత్య

కుమారుడికి భారం కాకూడదనే..
జయశంకర్‌ భూపాలపల్లి జిల్లాలో విషాద ఘటన

మహదేవ్‌పూర్‌: ఎన్నో కష్టనష్టాలకోర్చి కుమారుడిని పెంచారు. జీవితాంతం శ్రమించి ఆ కష్టార్జితాన్ని కన్నకొడుక్కే ధారబోశారు. కొడుకు, కోడలు  సరిగా చూడనప్పటికీ సాలయ్య తన కష్టార్జితంతో ఓ ఇల్లు సైతం కట్టించాడు. వృద్ధాప్యంలో ఆలనాపాలనా చూసుకుంటాడనుకుంటే తల్లిదండ్రులే బరువైనట్లు భావించాడు ఆ కొడుకు. తల్లిదండ్రులను సరిగా చూడటం మానేశాడు. మాటలు, చేతలతో కుమారుడు హింసించడం మొదలుపెట్టాడు. ఆ వృద్ధ దంపతులు కొన్నిరోజులపాటు వాటన్నింటినీ పంటి బిగువున భరించారు.. సహించారు. చివరికి కుమారుడికి తాము భారం కాకూడదని నిర్ణయించుకుని శాశ్వతంగా తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు. ఈ విషాదకర సంఘటన జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్‌ మండలం ఎలకేశ్వరం గ్రామంలో చోటుచేసుకుంది.

గ్రామస్థులు తెలిపిన వివరాల ప్రకారం రాళ్లబండి సాలయ్య (76), రాధమ్మ (66) దంపతులకు ఒక కుమారుడు, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. గత కొంతకాలంగా వారి కుమారుడు, కోడలు తమ మాటలతో, చేతలతో హింసించేవారు. దీనిపై వృద్ధ దంపతులు మనస్తాపం చెందారు. ఇకపై కుమారుడికి భారం కాకూడదని నిర్ణయించుకుని ఇంట్లోనే పురుగుల మందు తాగి తనువు చాలించారు. చనిపోయే ముందు కొత్తబట్టలు వేసుకొని శవయాత్రకు కావలిసిన సరకు, సరంజామా తెచ్చి పెట్టుకోవడం.. మంచి ముహూర్తం చూసుకుని ఆత్మహత్య చేసుకోవడం గ్రామస్థులను కంటతడి పెట్టించింది.


Tags:

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లాలు

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని