శుక్రవారం, జులై 10, 2020
home
ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
జాతీయ- అంతర్జాతీయ
క్రైమ్
పాలిటిక్స్
బిజినెస్‌
క్రీడలు
సినిమా

ఫీచర్ పేజీలు

ఫొటోలు
వీడియోలు
ఎన్ఆర్ఐ

ఇంకా..

E Paper
Archives
Terms & Conditions
Privacy Policy
FacebookTwitter

తాజా వార్తలు

చైనాతో ఒప్పందానికి అంగీకరించలేదు: ట్రంప్‌

వాషింగ్టన్‌: అమెరికా-చైనా మధ్య వాణిజ్య యుద్ధానికి ఇక తెరపడిందన్న ఆశలకు అగ్రరాజ్యం అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ గండికొట్టారు. చైనా ఉత్పత్తులపై సుంకాలు ఎత్తివేసే దిశగా ఎలాంటి ఒప్పందం కుదరలేదని ప్రకటించి బాంబు పేల్చినంత పనిచేశారు. అమెరికాతో తొలి దశ ఒప్పందం కుదిరిందని.. తద్వారా దశలవారీగా ఒకరి వస్తువులపై ఒకరు సుంకాలు వెనక్కి తీసుకోనున్నామని చైనా ప్రకటించిన విషయం తెలిసిందే. తాజాగా దీన్ని ట్రంప్‌ కొట్టిపారేశారు. ‘‘సుంకాల పెంపు నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని వారు(చైనా) కోరుకున్నారు. అయితే పూర్తిస్థాయి సుంకాల ఎత్తివేతపై మాత్రం వారు చర్చించలేదు. ఎందుకంటే నేను చేయనని వారికి తెలుసు. నేను మాత్రం ఇంకా ఎలాంటి ఒప్పందానికి అంగీకారం తెలపలేదు’’ అని శ్వేతసౌధంలో శుక్రవారం విలేకరులతో మాట్లాడుతూ ట్రంప్‌ వ్యాఖ్యానించారు. చైనా ఆర్థిక వ్యవస్థ తీవ్ర ఒడుదొడుకులు ఎదుర్కొంటోందని.. అందుకే ఒప్పందానికి ఉబలాటపడుతోందన్నారు.

అదనంగా విధించిన సుంకాలను దశలవారీగా వెనక్కి తీసుకునేందుకు అమెరికా అంగీకరించిందని.. తుది ఒప్పందం దిశగా అడుగులు పడుతున్నాయని ఇటీవల చైనా వాణిజ్యశాఖ అధికార ప్రతినిధి గావో ఫెంగ్‌ ప్రకటించిన విషయం తెలిసిందే. గత కొన్ని రోజులుగా ఇరు దేశాలకు చెందిన ప్రతినిధులు నిర్మాణాత్మక చర్చలు జరుపుతున్నారని.. ఇరు దేశాల మధ్య వ్యక్తమైన ఆందోళనలపై చర్చించామన్నారు. దీంతో అమెరికా-చైనా మధ్య నెలకొన్న వాణిజ్య యుద్ధానికి తెరపడినట్లేనని అంతా భావించారు. కానీ, ట్రంప్‌ తాజా ప్రకటనతో తిరిగి ఆందోళన వ్యక్తమవుతోంది. చైనా ప్రకటనతో ఆసియా సహా అంతర్జాతీయ మార్కెట్లు భారీగా పుంజుకున్న విషయం తెలిసిందే. కానీ, తాజా పరిణామాల నేపథ్యంలో మార్కెట్లు తిరిగి ఎలా స్పందించనున్నాయో చూడాలి!

Tags:

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లాలు

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని