శుక్రవారం, జులై 10, 2020
home
ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
జాతీయ- అంతర్జాతీయ
క్రైమ్
పాలిటిక్స్
బిజినెస్‌
క్రీడలు
సినిమా

ఫీచర్ పేజీలు

ఫొటోలు
వీడియోలు
ఎన్ఆర్ఐ

ఇంకా..

E Paper
Archives
Terms & Conditions
Privacy Policy
FacebookTwitter

తాజా వార్తలు

శాంసంగ్‌ డివైజ్‌ల్లో ఆగిపోనున్న నెట్‌ఫ్లిక్స్‌

ఇంటర్నెట్‌ డెస్క్‌: ప్రముఖ వీడియో స్ట్రీమింగ్‌ సంస్థ నెట్‌ఫ్లిక్స్ శాంసంగ్‌ యూజర్స్‌కి షాకిచ్చింది. డిసెంబరు 1 నుంచి కొన్ని శాంసంగ్‌ టీవీ మోడల్స్‌లో నెట్‌ఫ్లిక్స్‌ సేవలు నిలిచిపోనున్నాయి. ఈ మేరకు శాంసంగ్‌ ఒక ప్రకటన చేసింది. వివిధ సాంకేతిక కారణాలతో డిసెంబరు 1 నుంచి శాంసంగ్‌ పాతతరం స్మార్ట్‌ టీవీల్లో నెట్‌ఫ్లిక్స్‌ పనిచేయదు. 2010-11లో తయారైన కొన్ని మోడల్స్‌ టీవీల్లో నెట్‌ఫ్లిక్స్‌ ఆగిపోనుంది. టీవీల స్క్రీన్‌ సైజ్‌ పక్కన సీ, డీ అనే అక్షరాలు ఉండే టీవీలకు మాత్రమే సేవలు నిలిచిపోతాయి. గేమింగ్‌ కన్సోల్, స్ట్రీమింగ్‌ మీడియా ప్లేయర్‌, సెట్‌టాప్‌ బాక్స్‌ ఉన్నవారు పాత టీవీలలో నెట్‌ఫ్లిక్స్‌ను వీక్షించే అవకాశం ఉంది.  

శాంసంగ్‌తో పాటు రోకూ డివైజ్‌లలోనూ నెట్‌ఫ్లిక్స్ సేవలు ఆగిపోనున్నట్లు నెట్‌ఫ్లిక్స్‌ ప్రకటించింది. Roku 2050X, Roku 2100X, Roku 2000C, Roku HD Player, Roku SD Player, Roku XR Player and Roku XD Player మోడళ్లలో నెట్‌ఫ్లిక్స్‌ పని చేయదు. ఈ విషయాన్ని నోటిఫికేషన్స్ ద్వారా వినియోగదారులకు తెలియజేశారు. పాస్‌వర్డ్‌ షేరింగ్‌ను మరింత పరిమితం చేయడంపై దృష్టిసారించినున్నట్లుగా గత నెలలో నెట్‌ఫ్లిక్స్‌ ప్రకటించిన విషయం తెలిసిందే. ఇప్పుడు పాత టీవీల్లో సేవలను నిలిపేస్తున్నట్లు తెలిపింది. 

Tags:

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లాలు

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని