శుక్రవారం, జులై 10, 2020
home
ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
జాతీయ- అంతర్జాతీయ
క్రైమ్
పాలిటిక్స్
బిజినెస్‌
క్రీడలు
సినిమా

ఫీచర్ పేజీలు

ఫొటోలు
వీడియోలు
ఎన్ఆర్ఐ

ఇంకా..

E Paper
Archives
Terms & Conditions
Privacy Policy
FacebookTwitter

తాజా వార్తలు

పంత్‌ వల్లే నా భార్యకు ఫాలోవర్స్‌: పైన్‌

సిడ్నీ: టీమిండియా వికెట్‌కీపర్‌ రిషభ్‌ పంత్‌ ఫొటోని పోస్ట్ చేసినందుకే తన భార్య బోనీకి ఇన్‌స్టాగ్రామ్‌లో ఫాలోవర్స్‌ భారీగా పెరిగారని ఆస్ట్రేలియా టెస్టు జట్టు సారథి టిమ్‌ పైన్‌ అన్నాడు. గత ఏడాది ఆస్ట్రేలియా పర్యటనలో పంత్‌-పైన్‌ మధ్య జరిగిన సంభాషణ వైరల్‌గా మారిన సంగతి తెలిసిందే. మూడో టెస్టులో పంత్‌ బ్యాటింగ్‌ చేస్తున్నప్పుడు ‘‘నీకు పిల్లల్ని ఆడించడం వచ్చా? నా భార్యతో కలిసి సినిమాకు వెళ్తా. కాస్త నా పిల్లల్ని చూసుకో’’ అని పైన్ కవ్వించాడు. దీనికి పంత్‌ కూడా దీటుగానే బదులిచ్చాడు. ‘‘నువ్వు కేవలం తాత్కాలిక కెప్టెన్‌వే’’ అని సమాధానమిచ్చాడు. అయితే మ్యాచ్ అనంతరం పంత్‌.. పైన్‌ పిల్లల్ని ఆడించడం అప్పట్లో ట్రెండింగ్‌గా మారింది. ఈ ఫొటోను బోనీ ‘అత్యుత్తమ బేబీ సిట్టర్‌’ అని క్యాప్షన్‌తో తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేసింది. పైన్‌ పిల్లల్లో ఒకరిని పంత్‌ ఎత్తుకోగా, మరొకరిని బోనీ ఎత్తుకున్న ఫోటో సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొట్టింది. దీంతో నెటిజన్లు బోనీని ఇన్‌స్టాగ్రామ్‌లో భారీ సంఖ్యలో ఫాలో అయ్యారు. 

అయితే అప్పటి జ్ఞాపకాలను టిమ్‌ పైన్‌ స్థానిక మీడియాతో పంచుకున్నాడు. ‘‘బోనీని భారీ సంఖ్యలో భారతీయులు ఇన్‌స్టాగ్రామ్‌లో ఫాలో అయ్యారు. ఆమె వార్తల్లోకెక్కడంతో కాస్త భయపడింది. మ్యాచ్‌లో వికెట్లు పడకపోవడంతో మాకు విసుగు వచ్చింది. దీంతో అతడి ఏకాగ్రత దెబ్బ తీయాలనుకున్నాం. అలా చేస్తే పేవలమైన షాట్‌ ఆడి ఔట్‌ అవుతాడని భావించాం. కానీ అతడు అద్భుతమైన ఆటగాడు. అతడికి ఎంతో ప్రతిభ ఉంది’’ అని పైన్‌ తెలిపాడు. 2018-19 ఆసీస్‌ పర్యటనలో భారత్‌ చారిత్రక విజయం సాధించిన సంగతి తెలిసిందే. నాలుగు టెస్టుల సిరీస్‌ను కోహ్లీసేన 2-1తో కైవసం చేసుకుంది.

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లాలు

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని