శుక్రవారం, జులై 10, 2020
home
ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
జాతీయ- అంతర్జాతీయ
క్రైమ్
పాలిటిక్స్
బిజినెస్‌
క్రీడలు
సినిమా

ఫీచర్ పేజీలు

ఫొటోలు
వీడియోలు
ఎన్ఆర్ఐ

ఇంకా..

E Paper
Archives
Terms & Conditions
Privacy Policy
FacebookTwitter

తాజా వార్తలు

భారత్‌కు మూడీస్‌ మరోసారి షాక్‌

దిల్లీ: ‘మూడీస్‌ ఇన్వెస్టర్స్‌ సర్సీస్‌’ భారత్‌ రేటింగ్‌ అవుట్‌లుక్‌ను తగ్గించింది. ఇప్పటి వరకు ‘స్టేబుల్‌’గా ఉన్న ఆర్థిక వ్యవస్థని ప్రస్తుతం ‘నెగటివ్‌’కి చేర్చింది. గతంతో పోలిస్తే ఆర్థిక వృద్ధి మరింత క్షీణించే ప్రమాదం ఉందని తెలిపింది. ఆర్థిక, సంస్థాగత బలహీనతల్ని పరిష్కరించడంలో మూడీస్‌ అంచనా వేసిన దానికంటే ప్రభుత్వం నెమ్మదిగా స్పందిస్తోందని సంస్థ అభిప్రాయపడింది. ఇదిలాగే కొనసాగితే ఇప్పటికే తీవ్ర స్థాయికి చేరుకున్న అప్పుల భారం మరింత పెరిగే అవకాశం ఉందని తెలిపింది. ప్రభుత్వం తీసుకునే చర్యలు వృద్ధి రేటు మందగమన సమస్యను పరిష్కరించేలా ఉండాలని స్పష్టం చేసింది. అలాగే గ్రామీణ ఆర్థిక వ్యవస్థలో నెలకొన్న ఒడుదొడుకులను, మందగించిన ఉద్యోగ కల్పన, బ్యాంకింగేతర రంగాల్లో నెలకొన్న సంక్షోభాన్ని అధిగమించేలా ప్రభుత్వ చర్యలు ఉండాల్సిన అవసరం ఉందని సూచించింది. వాణిజ్య పెట్టుబడులు పెంచే, వృద్ధిని మరింత వేగంగా పరుగులు పెట్టించే సంస్కరణల అవకాశాలు తగ్గిపోయాయని మూడీస్‌ అభిప్రాయపడింది. 

మెరుగ్గానే ఉన్నాం..
మూడీస్‌ రేటింగ్‌పై కేంద్ర ఆర్థిక శాఖ స్పందించింది. దేశ ఆర్థిక పునాదులు బలంగానే ఉన్నాయని స్పష్టం చేసింది. ద్రవ్యోల్బణం అదుపులో ఉందని తెలిపింది. స్వల్ప, మధ్యకాలిక వృద్ధికి భారత్‌లో మెరుగైన అవకాశాలు ఉన్నాయని పేర్కొంది. అంతర్జాతీయంగా నెలకొన్న మందగమనాన్ని దృష్టిలో పెట్టుకొని భారత్‌ అనేక చర్యలు చేపట్టిందని తెలిపింది. దీంతో భారత్‌కు పెట్టుబడులు తరలే అవకాశాలు పెరిగాయని.. ప్రపంచ దేశాలతో పోలిస్తే భారత్‌ స్థితి మెరుగ్గానే ఉందని వెల్లడించింది. భారత వృద్ధి రేటు 2019లో 6.1శాతానికి, 2020లో 7శాతానికి పెరిగే అవకాశం ఉందన్న ఇటీవలి ఐఎంఎఫ్‌ నివేదికను ఆర్థిక శాఖ ఈ సందర్భంగా ఉటంకించింది.  


Tags:

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లాలు

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని