శుక్రవారం, జులై 10, 2020
home
ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
జాతీయ- అంతర్జాతీయ
క్రైమ్
పాలిటిక్స్
బిజినెస్‌
క్రీడలు
సినిమా

ఫీచర్ పేజీలు

ఫొటోలు
వీడియోలు
ఎన్ఆర్ఐ

ఇంకా..

E Paper
Archives
Terms & Conditions
Privacy Policy
FacebookTwitter

తాజా వార్తలు

వరుసగా ఎనిమిదో నెల ఉత్పత్తి తగ్గింపు..!

ఇంటర్నెట్‌డెస్క్‌: దేశీయ కార్ల తయారీ దిగ్గజం మారుతీ సుజుకీ వరుసగా ఎనిమిదో నెల కూడా ఉత్పత్తిలో కోత విధించింది. ఈ సారి సెప్టెంబర్‌లో కూడా ఉత్పత్తిని 17.48శాతం తగ్గించింది. ఈ నెలలో 1,32,199 కార్లను మారుతీ ఉత్పత్తి చేసింది. గత ఏడాది ఇదే సీజన్‌లో 1,60,219 యూనిట్లను తయారు చేసింది. ఈ విషయాన్ని మారుతీ సుజుకీ ఇండియా రెగ్యూలేటరీ ఫైలింగ్‌లో పేర్కొంది. 
మినీ కాంపాక్ట్‌ సెగ్మెంట్లో కార్ల విక్రయాలు బాగా తగ్గాయి. గత ఏడాది ఈ సీజన్‌లో 1,15,576 ఆల్టో, వేగనార్‌,సెలిరియో,ఇగ్నిస్‌, స్విఫ్ట్‌, బాలినో, డిజైర్లను విక్రయించింది. కానీ, ఈ సారి వీటి విక్రయాలు 98,337కు మాత్రమే పరిమితమైంది. ఇక యుటిలిటీ వెహికల్స్‌ అయిన విటార బ్రెజా, ఎర్టిగా, ఎస్‌క్రాస్‌ విక్రయాలు 22,226 నుంచి 18,435కు తగ్గింది. సియాజ్‌ఉత్పత్తిని 4,739 నుంచి 2,350కు తగ్గించారు. ఇక లైట్‌ కమర్షియల్‌ శ్రేణిలోని సూపర్‌ క్యారీ ఉత్పత్తి కూడా 2,560 నుంచి 1,935కు తగ్గిపోయింది. మరోపక్క టాటా మోటార్స్‌ ప్యాసెంజర్‌ వాహనాల ఉత్పత్తి కూడా 63శాతం తగ్గినట్లు ప్రకటించారు. 

Tags:

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లాలు

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని