శుక్రవారం, జులై 10, 2020
home
ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
జాతీయ- అంతర్జాతీయ
క్రైమ్
పాలిటిక్స్
బిజినెస్‌
క్రీడలు
సినిమా

ఫీచర్ పేజీలు

ఫొటోలు
వీడియోలు
ఎన్ఆర్ఐ

ఇంకా..

E Paper
Archives
Terms & Conditions
Privacy Policy
FacebookTwitter

తాజా వార్తలు

భారత్‌లో కర్ణాటక జట్టు అరుదైన రికార్డు

ప్రపంచ క్రికెట్‌లో రెండో స్థానం 

విశాఖపట్నం: పొరుగు రాష్ట్రం కర్ణాటక జట్టు భారత క్రికెట్‌లో అరుదైన రికార్డు నెలకొల్పింది. వరుసగా 15 టీ20లు గెలిచి చరిత్ర సృష్టించింది. సయద్‌ ముస్తక్‌ అలీ ట్రోఫీలో భాగంగా శుక్రవారం గ్రూప్‌ ఏ విభాగంలో కర్ణాటక, ఉత్తరాఖండ్‌ జట్లు టీ20 మ్యాచ్‌ ఆడాయి. తొలుత బ్యాటింగ్‌ చేసిన ఉత్తరాఖండ్‌ 113 పరుగులు చేయగా, కెప్టెన్‌ తన్మయ్‌ శ్రీవాస్తవ 39 పరుగులతో టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు. అనంతరం కర్ణాటక 15.4 ఓవర్లలో లక్ష్యాన్ని ఛేదించింది. ఓపెనర్‌ రోహన్‌ కదమ్‌(67), మరో బ్యాట్స్‌మన్‌ దేవ్‌దత్‌ పడిక్కల్‌(53) అర్ధశతకాలతో చెలరేగడంతో కర్ణాటక రికార్డు విజయాన్ని సొంతం చేసుకుంది.

ఈ విజయంతో కర్ణాటక.. భారత్‌లో వరుసగా అత్యధిక టీ20లు గెలిచిన జట్టుగా అవతరించడంతో పాటు ప్రపంచ క్రికెట్‌ జాబితాలో రెండో స్థానంలో నిలిచింది. న్యూజిలాండ్‌ జట్టు ఒటాగో ఇదివరకే 15 విజయాలతో కొనసాగుతున్న నేపథ్యంలో ఇరు జట్లు సమానంగా ఉన్నాయి. వీటి కన్నా ముందు పాకిస్థాన్‌ సియల్‌కోట్‌ స్టాలియన్స్‌ వరుసగా 25 టీ20లు గెలిచి అగ్రస్థానాన్ని కైవసం చేసుకుంది. పాకిస్థాన్‌ నేషనల్‌ టీ20కప్ సందర్భంగా 2006-2010 మధ్య కాలంలో ఈ ఘనత సాధించింది.

Tags:

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లాలు

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని