శుక్రవారం, జులై 10, 2020
home
ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
జాతీయ- అంతర్జాతీయ
క్రైమ్
పాలిటిక్స్
బిజినెస్‌
క్రీడలు
సినిమా

ఫీచర్ పేజీలు

ఫొటోలు
వీడియోలు
ఎన్ఆర్ఐ

ఇంకా..

E Paper
Archives
Terms & Conditions
Privacy Policy
FacebookTwitter

తాజా వార్తలు

‘అంత సంపన్నుడు.. ఇంత తక్కువ విరాళమా’

దిల్లీ: ఆస్ట్రేలియా కార్చిచ్చు బాధితులకు సహాయం అందించేందుకు అమెజాన్‌ వ్యవస్థాపకుడు, సీఈవో జెఫ్‌ బెజెస్‌ ప్రకటించిన విరాళంపై సోషల్‌మీడియా వేదికగా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ‘అంత పెద్ద సంపన్నుడై ఉండి.. ఇంత తక్కువ విరాళం అందిస్తారా?’ అంటూ నెటిజన్లు ఆయనను తప్పుబడుతున్నారు. 

ఆస్ట్రేలియా కార్చిచ్చుపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన జెఫ్‌ బెజోస్‌.. బాధితుల సహాయార్థం 1 మిలియన్‌ ఆస్ట్రేలియన్‌ డాలర్ల(అమెరికా కరెన్సీలో ఇది దాదాపు 6,90,000 డాలర్లకు సమానం) విరాళం ఇస్తున్నట్లు రెండు రోజుల క్రితం ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా ప్రకటించారు. ఈ పోస్ట్‌ పెట్టిన కొద్ది సేపటికే నెట్టింట్లో ఆయనపై విమర్శలు వెల్లువెత్తాయి. ‘ఆయనకు ఇది కేవలం 3 నిమిషాల సంపాదన.. ప్రపంచంలోనే అత్యంత సంపన్నుడు మాత్రమే కాదు, అత్యంత పసినారి కూడా.. నిజంగా ఆయన నుంచి స్ఫూర్తి పొందాల్సిందే..’ అంటూ నెటిజన్లు వ్యంగ్యంగా కామెంట్లు పెడుతున్నారు. ఇతర సంపన్నులు ఇచ్చిన విరాళాలతో పోలుస్తూ బెజోన్‌ను దుయ్యబట్టారు. 

కార్చిచ్చు బాధితుల కోసం ఫేస్‌బుక్‌ ఇప్పటికే 1.25 మిలియన్‌ డాలర్ల ఆర్థిక సాయం ప్రకటించింది. మెటాలికా అనే సంస్థ 7,50,000 డాలర్లు, ప్రముఖ టీవీ నటి కెయిలీ జెన్నర్‌ 1 మిలియన్ డాలర్లు, హాలీవుడ్‌ సింగర్‌ ఎల్టాన్‌ జాన్‌ 1 మిలియన్‌ డాలర్ల విరాళం ప్రకటించారు. ఈ నేపథ్యంలో బెజెస్‌ వీరికంటే తక్కువ విరాళాన్ని ప్రకటించడం విమర్శలకు దారితీసింది.

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లాలు

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని