గురువారం, జులై 16, 2020
home
ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
జాతీయ- అంతర్జాతీయ
క్రైమ్
పాలిటిక్స్
బిజినెస్‌
క్రీడలు
సినిమా

ఫీచర్ పేజీలు

ఫొటోలు
వీడియోలు
ఎన్ఆర్ఐ

ఇంకా..

E Paper
Archives
Terms & Conditions
Privacy Policy
FacebookTwitter

తాజా వార్తలు

కోహ్లీసేనకు పరీక్ష పెట్టిన ఆసీస్‌ పేసర్లు

255కే ఆలౌటైన భారత్‌

ముంబయి: సొంతగడ్డపై ఏకపక్ష విజయాలతో జైత్రయాత్ర సాగిస్తున్న టీమిండియాకు చాన్నాళ్ల తర్వాత కఠిన పరీక్ష ఎదురైంది. ఆస్ట్రేలియాతో జరుగుతున్న తొలి వన్డేలో భారత్‌ 49.1 ఓవర్లలో 255 పరుగులు చేసి ఆలౌటైంది. మిచెల్‌ స్టార్క్‌ (3), కమిన్స్‌ (2), రిచర్డ్‌సన్‌ (2) విజృంభించి కోహ్లీసేన బ్యాటింగ్‌ పటిమను పరీక్షించారు. టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన భారత్‌ ఆదిలోనే ఓపెనర్‌ రోహిత్‌ శర్మ (10) వికెట్‌ కోల్పోయింది. వన్‌డౌన్‌లో వచ్చిన కేఎల్‌ రాహుల్‌ (47; 61 బంతుల్లో 4x4), ఓపెనర్‌ శిఖర్‌ ధావన్‌(74; 91 బంతుల్లో 9x4, 1x6)కు చక్కటి సహకారం అందించాడు. ఇద్దరూ రెండో వికెట్‌కు శతక భాగస్వామ్యం (121) జోడించారు.

ధావన్‌ తనదైన శైలిలో బౌండరీలు బాదగా రాహుల్‌ కాస్త నెమ్మదిగా ఆడాడు. ఈ క్రమంలో స్కోరు వేగం పుంజుకుంటున్న తరుణంలో ఇద్దరూ 6 పరుగుల వ్యవధిలో ఔటయ్యారు. తర్వాత కోహ్లీ (16), శ్రేయస్‌ (4) విఫలమవడంతో భారత్‌ 33 ఓవర్లకు 164/5తో కష్టాల్లో పడింది. ఈ క్రమంలో రిషభ్‌ పంత్‌ (28), రవీంద్ర జడేజా (25) ఆపద్భాందవుల పాత్ర పోషించి ఆరో వికెట్‌కు కీలకమైన 49 పరుగులు జోడించారు. చివర్లో శార్దూల్‌ ఠాకుర్‌(13), మహ్మద్‌ షమి(10), కుల్‌దీప్‌ యాదవ్‌(17) తమ వంతు బ్యాటింగ్‌ చేసి టీమిండియాను 255 పరుగులకు చేరవేశారు. భారత పేసర్లు ఏం చేస్తారు చూడాలి.

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లాలు

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని