శుక్రవారం, జులై 10, 2020
home
ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
జాతీయ- అంతర్జాతీయ
క్రైమ్
పాలిటిక్స్
బిజినెస్‌
క్రీడలు
సినిమా

ఫీచర్ పేజీలు

ఫొటోలు
వీడియోలు
ఎన్ఆర్ఐ

ఇంకా..

E Paper
Archives
Terms & Conditions
Privacy Policy
FacebookTwitter

తాజా వార్తలు

దిల్లీకి అశ్విన్‌: కెప్టెన్సీ రేసులో కేఎల్‌ రాహుల్‌

సీనియర్‌ ఆటగాడి బదిలీ ప్రక్రియ సంపూర్ణం

దిల్లీ: టీమిండియా సీనియర్‌ స్పిన్నర్‌ రవిచంద్రన్‌ అశ్విన్‌ ఐపీఎల్‌లో దిల్లీ క్యాపిటల్స్‌లో చేరాడు. కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌ నుంచి అతడి బదిలీ ప్రక్రియ పూర్తైంది. ఇందులో భాగంగా ఎడమచేతి వాటం ఆటగాడు సుచిత్‌, అదనంగా రూ.1.5 కోట్లను పంజాబ్‌కు దిల్లీ ఇచ్చింది. 2018 వేలంలో యాష్‌ను రూ.7.6 కోట్లకు పంజాబ్‌ కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. రెండేళ్లు సారథ్యం వహించినప్పటికీ ఆ జట్టుకు ట్రోఫీ అందించడంలో ఈ సీనియర్‌ స్పిన్నర్‌ విఫలమయ్యాడు.

‘అశ్విన్‌ అత్యంత సీనియర్‌ స్పిన్నర్‌, విలువైన ఆటగాడు. భారత్‌ తరఫున, ఐపీఎల్‌లో అతడికి తిరుగులేని రికార్డులు ఉన్నాయి. ఐపీఎల్‌ టైటిల్‌పై కన్నేసిన మాకు అశ్విన్‌ చేరిక అమిత  ప్రయోజనం చేకూరుస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు’ అని దిల్లీ క్యాపిటల్స్‌ సహ యజమాని పార్థ్‌ జిందాల్‌ అన్నారు. ‘తాను భాగమైన ప్రతి జట్టుకూ అశ్విన్‌ విలువ చేకూరుస్తాడు. దిల్లీ క్యాపిటల్స్‌లో చేరిన అతడికి ఎలాంటి మార్పు ఉండదు. మా సొంత మైదానం మందకొడిగా ఉంటుంది. స్పిన్నర్లకు సహకరిస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు. ఆ పిచ్‌పై తన తెలివైన బౌలింగ్‌తో అశ్విన్‌ పెను ప్రభావం చూపగలడు’ అని దిల్లీ ప్రధాన కోచ్‌ రికీ పాంటింగ్‌ అన్నాడు.

యాష్ ఇప్పటి వరకు 68 టెస్టుల్లో 357 వికెట్లు, 111 వన్డేల్లో 150 వికెట్లు తీశాడు. ఐపీఎల్‌లో అతడికి మంచి రికార్డు ఉంది. 139 మ్యాచుల్లో 6.79 ఎకానమీతో 125 వికెట్లు తీశాడు. చెన్నై విజేతగా అవతరించిన 2010, 2011లో అశ్విన్‌ కీలక పాత్ర పోషించాడు. కింగ్స్‌ పంజాబ్‌ కెప్టెన్‌గా రెండేళ్లు పనిచేసినా ప్లేఆఫ్‌కు చేర్చడంలో విఫలమయ్యాడు. అతడు దిల్లీకి బదిలీ అవ్వడంతో కేఎల్‌ రాహుల్‌ కెప్టెన్సీ రేసులో ముందంజలో ఉన్నాడు. ఐపీఎల్‌ బదిలీ గవాక్షం నవంబర్‌ 14తో ముగుస్తుంది.

Tags:

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లాలు

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని