శుక్రవారం, జులై 10, 2020
home
ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
జాతీయ- అంతర్జాతీయ
క్రైమ్
పాలిటిక్స్
బిజినెస్‌
క్రీడలు
సినిమా

ఫీచర్ పేజీలు

ఫొటోలు
వీడియోలు
ఎన్ఆర్ఐ

ఇంకా..

E Paper
Archives
Terms & Conditions
Privacy Policy
FacebookTwitter

తాజా వార్తలు

ఎంతో అవమానంగా ఫీలయ్యా: బెంగాల్‌ గవర్నర్‌

కోల్‌కతా: పశ్చిమబెంగాల్‌ గవర్నర్‌ జగదీప్‌ ధన్కర్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇటీవల కోల్‌కతాలో జరిగిన దుర్గా పూజలో తనకు తీవ్ర అవమానం జరిగిందని ఆవేదన వ్యక్తంచేశారు. ఇది తనను తీవ్ర ఆవేదనకు, కలతకు గురిచేసిందన్నారు. తనను ప్రధాన వేదిక వద్ద కూర్చోబెట్టలేదని.. అలాగే, నాలుగు గంటల పాటు ఆ కార్యక్రమంలో తాను కూర్చున్నప్పటికీ కనీసం ఒక్క సెకను కాలం పాటు కూడా టీవీలో కూడా కనబడనీయకుండా చేశారని ఆయన ఆరోపించారు. తనకు జరిగిన ఈ అవమానానికి కారణమేంటి అనేది మాత్రం ఆయన స్పష్టంగా పేర్కొనలేదు. ముఖ్యమంత్రి, మంత్రులు, పలువురు ప్రముఖులు హాజరైన ఈ వేడుకలో గవర్నర్‌ను ప్రధాన వేదిక వద్ద ఓ మూలన కూర్చోబెట్టారనీ.. దీంతో ఆయన కనీసం ఆ వేడుకను సరిగా చూడలేకపోయారని సమాచారం. ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ వేడుకలో కూర్చొనేందుకు చేసిన ఏర్పాట్లపై గవర్నర్‌ తీవ్ర అసంతృప్తి వ్యక్తంచేశారు. ‘‘దీన్ని నేను చాలా అవమానంగా భావించా. తీవ్రంగా కలత చెందా. ఇది నా ఒక్కడికి జరిగిన అవమానం కాదు.. యావత్‌ బెంగాల్‌ ప్రజలది. ఇలాంటి అవమానాల్ని ప్రజలు ఎప్పటికీ జీర్ణించుకోలేరు. నేను బెంగాల్‌ ప్రజల సేవకుడిని. ఇలాంటి ఘటనలేవీ నా రాజ్యాంగ విధుల్ని నిర్వర్తించకుండా అడ్డుకోలేవు. గాయపడిన హృదయంతో మాట్లాడుతున్నా’’ అని అన్నారు.  

‘‘దాదాపు నాలుగు గంటల కన్నా ఎక్కువ సమయం నేను అక్కడ కూర్చున్నా. కానీ మీడియా నన్ను చూపించలేదు. ఇలాంటిది ఘటన ఎప్పుడూ విననది. ఎక్కడా ఇలా జరిగి ఉండదు. ఇది ఎమర్జెన్సీని తలపించేలా ఉందని కొందరు నాతో అంటున్నారు. రాష్ట్ర ప్రథమ పౌరుడినైన నన్ను ఒక్క సెకెన్‌ కూడా టీవీలో చూపించలేదు. నాకు జరిగిన ఈ అవమానాన్ని రాష్ట్రంలోని ఏ ఒక్క పౌరుడూ ఆమోదించరు. నా జీవితంలోనే ఇదో బాధాకరమైన ఘటన’’ అని గవర్నర్‌ మీడియాతో అన్నారు.

Tags:

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లాలు

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని