గురువారం, ఆగస్టు 06, 2020
home
ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
జాతీయ- అంతర్జాతీయ
క్రైమ్
పాలిటిక్స్
బిజినెస్‌
క్రీడలు
సినిమా

ఫీచర్ పేజీలు

ఫొటోలు
వీడియోలు
ఎన్ఆర్ఐ

ఇంకా..

E Paper
Archives
Terms & Conditions
Privacy Policy
FacebookTwitter

తాజా వార్తలు

సచివాలయం కూల్చివేతపై స్టే పొడిగింపు

హైదరాబాద్‌: తెలంగాణ సచివాలయం కూల్చివేతపై ఈ నెల 15 వరకు స్టే పొడిగిస్తూ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. కూల్చివేత పనులు నిలిపివేయాలని కోరుతూ పి.ఎల్‌.విశ్వేశ్వరరావు హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేసిన విషయం తెలిసిందే. దీనిపై గతంలో విచారణ ధర్మాసనం పూర్తి వివరాలతో కౌంటర్‌ దాఖలు చేయాల్సిందిగా ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ ఇవాల్టి వరకు పనులు నిలిపివేయాలని ఆదేశించింది. తిరిగి దీనిపై విచారణ చేపట్టిన ధర్మాసనం స్టే పొడిగిస్తూ తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. సచివాలయం కూల్చివేతపై జూన్‌ 30న ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని ఏజీ హైకోర్టుకు వివరించారు. మంత్రివర్గ ప్రతిని సమర్పించకుంటే ఎలా విచారణ చేపట్టాలని హైకోర్టు ప్రశ్నించింది. మంత్రివర్గ నిర్ణయంపై కనీసం ప్రెస్‌నోట్‌ కూడా ఇవ్వలేదని వ్యాఖ్యానించింది. మంత్రివర్గ నిర్ణయ ప్రతిని సాయంత్రంలోపు సమర్పిస్తామని కోర్టు ఏజీ తెలిపారు. మంత్రివర్గ నిర్ణయాన్ని షీల్డు కవర్‌లో సమర్పించాలని హైకోర్టు ఆదేశించింది. ప్రభుత్వకౌంటర్‌పై అభ్యంతరాలుంటే రేపటిలోగా సమర్పించాలని పిటిషనర్లను కోరింది. తదుపరి విచారణను ఈ నెల 15కి వాయిదా వేసింది.

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లాలు

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని