శుక్రవారం, జులై 10, 2020
home
ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
జాతీయ- అంతర్జాతీయ
క్రైమ్
పాలిటిక్స్
బిజినెస్‌
క్రీడలు
సినిమా

ఫీచర్ పేజీలు

ఫొటోలు
వీడియోలు
ఎన్ఆర్ఐ

ఇంకా..

E Paper
Archives
Terms & Conditions
Privacy Policy
FacebookTwitter

తాజా వార్తలు

హైదరాబాద్‌లో పిడుగులు పడే అవకాశం

ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలి
వాతావరణశాఖ హెచ్చరిక

హైదరాబాద్‌: జంటనగరాల్లో భారీ వర్షం కురిసింది. పలు చోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన జల్లులు పడ్డాయి. జేఎన్‌టీయూ,కూకట్‌పల్లి, ఎర్రగడ్డ, మూసాపేట, అమీర్‌పేట, ఖైరతాబాద్‌, బంజారాహిల్స్‌, జూబ్లీహిల్స్‌, మాదాపూర్‌, పంజాగుట్ట, రాజ్‌భవన్‌ రోడ్డు, కోఠి, శంషాబాద్‌ తదితర ప్రాంతాల్లో వర్షం కురిసింది. రోడ్లన్నీ జలమయమయ్యాయి. దీంతో ప్రయాణికులు, వాహనదారులు ఇబ్బందులు పడ్డారు.

నగరంలో వర్షాలతో పాటు పిడుగులు కూడా పడే అవకాశమున్నట్లు వాతావరణ శాఖ హెచ్చరించింది. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ లోకేశ్‌కుమార్‌ సూచించారు. వీలైనంత వరకు ఇళ్లు, కార్యాలయాల్లోనే ఉండాలన్నారు. నగరంలో నీటి నిల్వలు, వర్షాల వల్ల కలిగే ఇబ్బందులను తొలగించేందుకు చర్యలు చేపడుతున్నట్లు ఆయన చెప్పారు. రంగంలోకి విపత్తు నిర్వహణ, అత్యవసర బృందాలు దించామన్నారు. ఆయా బృందాలన్నీ క్షేత్రస్థాయిలో అప్రమత్తంగా ఉన్నాయని లోకేశ్‌ కుమార్‌ వివరించారు.

Tags:

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లాలు

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని