శుక్రవారం, జులై 10, 2020
home
ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
జాతీయ- అంతర్జాతీయ
క్రైమ్
పాలిటిక్స్
బిజినెస్‌
క్రీడలు
సినిమా

ఫీచర్ పేజీలు

ఫొటోలు
వీడియోలు
ఎన్ఆర్ఐ

ఇంకా..

E Paper
Archives
Terms & Conditions
Privacy Policy
FacebookTwitter

తాజా వార్తలు

ఎన్నిసార్లు చెప్పినా అబద్ధం నిజం కాదు: హరీశ్‌

హైదరాబాద్‌: కాంగ్రెస్‌, భాజపా ప్రభుత్వాలు తెలంగాణకు అన్యాయం చేశాయని ఆర్థికశాఖ మంత్రి హరీశ్‌రావు విమర్శించారు. ఎనిమిదేళ్ల కాంగ్రెస్‌ పాలనలో మధ్య మానేరు ప్రాజెక్టు నిర్మాణం కోసం ఆ పార్టీ పెట్టిన ఖర్చు రూ.107 కోట్లు కాగా.. తెరాస ప్రభుత్వం రూ.617 కోట్లు ఖర్చు పెట్టి,  పనులన్నింటినీ పూర్తి చేసిందని వివరించారు. దీన్నిబట్టి కాంగ్రెస్‌కు ఉన్న చిత్తశుద్ధి ఏంటో అర్థమవుతోందని ఎద్దేవా చేశారు. మిడ్‌మానేరు ప్రాజెక్టు పరిధిలో నిర్వాసితుల సమస్యలుంటే వాటిని సమయానుకూలంగా ప్రభుత్వం పరిష్కరిస్తుందని భరోసానిచ్చారు. ఆదివారం శాసనమండలిలో బడ్జెట్‌పై చర్చ సందర్భంగా ఆర్థిక మంత్రి హరీశ్‌రావు మాట్లాడారు.

‘‘జీవన్‌ రెడ్డి ఒకే విషయాన్ని పదే పదే చెప్తున్నారు. ఎన్నిసార్లు చెప్పినా అబద్ధం నిజం అవ్వదు. మధ్య మానేరు, ఎల్లంపల్లి ప్రాజెక్టులు తామే కట్టామని కాంగ్రెస్‌ నేతలు చెప్పుకుంటున్నారు. కానీ వారి హయాంలో కొబ్బరి కాయలు మాత్రమే కొట్టారు. తర్వాత తెరాస ప్రభుత్వం వాటిని పూర్తి చేసింది. కాళేశ్వరానికి జాతీయ హోదా కోరుతూ కేంద్రానికి మేం లేఖలు రాసిన మాట వాస్తవం. పలు సందర్భాల్లో ప్రధాని, కేంద్ర మంత్రులకు సీఎం సహా తెరాస నేతలు లేఖ రాశారు. కాళేశ్వరానికి జాతీయ హోదా కోసం పార్లమెంటులో గడ్కరీని తెరాస ఎంపీలు నిలదీశారు. ఇందుకోసం పార్లమెంటు ఎదుట ధర్నాలు కూడా చేశారు’’ అని హరీశ్‌రావు వివరించారు.

‘‘విద్యారంగంలో ముఖ్యంగా మహిళా విద్యకు ఎక్కువ ప్రాధాన్యమిస్తున్నాం. అందుకే సంక్షేమ విభాగాల కింద గురుకులాలు, రెసిడెన్షియల్‌ విద్యాసంస్థలు ప్రవేశపెట్టాం. మహిళలకు సౌకర్యంగా ఎస్సీ, ఎస్టీ మహిళా రెసిడెన్షియల్‌ డిగ్రీ కాలేజీలు తీసుకొచ్చాం. ఇవన్నీ నిర్వహించేందుకు విద్యా రంగానికి పద్దులో కొంత ఎక్కువ నిధులు కేటాయించాం. సరాసరిన మండలానికి రెండు రెసిడెన్షియల్‌ పాఠశాలలు నెలకొల్పి నాణ్యమైన విద్య అందిస్తున్నాం. వంట గ్యాస్‌ ధరలను కూడా తగ్గించాం’’ అని హరీశ్‌రావు అన్నారు.

Tags:

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లాలు

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని