శుక్రవారం, జులై 10, 2020
home
ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
జాతీయ- అంతర్జాతీయ
క్రైమ్
పాలిటిక్స్
బిజినెస్‌
క్రీడలు
సినిమా

ఫీచర్ పేజీలు

ఫొటోలు
వీడియోలు
ఎన్ఆర్ఐ

ఇంకా..

E Paper
Archives
Terms & Conditions
Privacy Policy
FacebookTwitter

తాజా వార్తలు

గాయం నుంచి కోలుకుంటున్న హార్దిక్‌ పాండ్య

వీడియో షేర్ చేసిన ఆల్‌రౌండర్‌

లండన్‌: టీమిండియా ఆల్‌ రౌండర్ హార్దిక్‌ పాండ్యకు శస్త్ర చికిత్స జరిగిన విషయం తెలిసిందే. వెన్నులో గాయం కారణంగా అతడు ప్రస్తుతం ఆటకు దూరమయ్యాడు. గత వారం హార్దిక్‌ పాండ్యకు లండన్‌లో శస్త్రచికిత్స జరిగింది. ఈ విషయాన్ని అతడే స్వయంగా తన ఇన్‌స్టాలో పోస్ట్ చేశాడు. తాజాగా దీనికి సంబంధించి అతడు మరో పోస్ట్‌ పెట్టాడు. గాయం నుంచి కోలుకుంటున్న వీడియోను అతడు షేర్‌ చేశాడు. ‘బేబీ అడుగులు.. కానీ నా ఫిట్‌నెస్‌ కల సాకారం ఇక్కడి నుంచే మొదలవుతుంది. మీ అందరూ నాకు మద్దతుగా నిలిచినందుకు ధన్యవాదాలు’ అని చెబుతూ వీడియో పోస్ట్‌ చేశాడు.
గతేడాది ఆసియా కప్‌లో ఆడేటప్పుడు హార్దిక్‌ వెన్నుపై గాయంతో బాధపడి మధ్యలోనే టోర్నీ నుంచి నిష్క్రమించాడు. అప్పటి నుంచి కొద్దిరోజుల పాటు విశ్రాంతి తీసుకున్నాడు. తర్వాత మైదానంలోకి అడుగు పెట్టి ఐపీఎల్‌, ప్రపంచకప్‌ మ్యాచ్‌లలో ఆడాడు. మళ్లీ గాయం కావడంతో బీసీసీఐ అతడిని బ్రిటన్‌కు పంపి చికిత్స చేయిస్తోంది. పాండ్య తిరిగి జట్టులోకి చేరాలంటే కనీసం 6నెలలు విశ్రాంతి అవసరమని వైద్యులు చెప్పినట్టు సమాచారం.


Tags:

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లాలు

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని