శుక్రవారం, జులై 10, 2020
home
ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
జాతీయ- అంతర్జాతీయ
క్రైమ్
పాలిటిక్స్
బిజినెస్‌
క్రీడలు
సినిమా

ఫీచర్ పేజీలు

ఫొటోలు
వీడియోలు
ఎన్ఆర్ఐ

ఇంకా..

E Paper
Archives
Terms & Conditions
Privacy Policy
FacebookTwitter

తాజా వార్తలు

గూగుల్‌ సరికొత్త ఉత్పత్తుల వివరాలివే...

గూగుల్‌ పిక్సల్‌ 4, ఎక్స్‌ఎల్‌ ఫోన్లు విడుదల

న్యూయార్క్‌: అంతర్జాల దిగ్గజం గూగుల్‌ సంస్థ మంగళవారం సరికొత్త ఉత్పత్తులను ఆవిష్కరించింది. పిక్సల్‌ 4, పిక్సల్‌ 4 ఎక్స్‌ఎల్‌, పిక్సల్‌బుక్‌ గో, పిక్సల్‌ బడ్స్‌ వంటి ఉత్పత్తులను విడుదల చేసింది. వీటి ఆవిష్కరణకు సంబంధించిన కార్యక్రమాన్ని ‘‘మేడ్‌ బై గూగుల్‌ '19’’ పేరుతో న్యూయార్క్‌లో నిర్వహించింది. గూగుల్‌ నుంచి రాబోతున్న ఉత్పత్తులపై కొన్ని నెలలుగా ఊహాగానాలు షికారు చేసిన నేపథ్యంలో తాజా కార్యక్రమంతో గూగుల్‌ ఉత్పత్తులు, వాటి ఫీచర్లు, ధరల వివరాలపై స్పష్టత వచ్చింది. వాటి వివరాలివీ...

గూగుల్‌ పిక్సల్‌ 4, ఎక్స్‌ఎల్‌
బోలెడన్ని ఏఐ (కృత్రిమ మేథ) ఫీచర్లతో పిక్సల్‌ 4, ఎక్స్‌ఎల్‌ ఫోన్లను తయారు చేశారు. చేతుల ద్వారా సంజ్ఞలు చూపుతూ ఫోన్‌ను నియంత్రించేందుకు మోషన్‌ సెన్సర్‌ ఉంది. నలుపు, తెలుపు, నారింజ రంగుల్లో ఈ ఫోన్లు లభించనున్నాయి. అంతేకాక రాడార్‌ సెన్సార్‌ కూడా వీటి సొంతం. డేటా భద్రత కోసం గూగుల్‌కు చెందిన ‘టైటాన్‌ ఎం’ సెక్యూరిటీ చిప్‌ను అమర్చారు. ధర సుమారు 799 డాలర్లు (సుమారు రూ.57 వేలు), పిక్సల్‌ 4 ఎక్స్‌ఎల్‌ ధర 899 డాలర్లు (సుమారు రూ.64 వేలు)గా ఉండనుంది. మూడేళ్లపాటు సాఫ్ట్‌వేర్‌, సెక్యూరిటీ అప్‌డేట్‌ హామీ ఇవ్వనున్నారు. అమెరికాలో ఇవాల్టి నుంచే బుకింగ్‌ ప్రారంభం కానుండగా, అక్టోబరు 24 నుంచి షిప్పింగ్‌ చేయనున్నారు. భారత్‌లో ఈ ఫోన్‌ను ఎప్పుడు విడుదల చేస్తారన్న అంశంపై స్పష్టత లేదు.
* పిక్సల్‌ 4 ఎక్స్‌ఎల్‌కు 6.3 అంగుళాల తెర (పిక్సల్ ‌4కు 5.7 అంగుళాల తెర)
* స్నాప్‌డ్రాగన్‌ 855 ఎస్‌ఓసీ ప్రాసెసర్‌
* 6జీబీ ర్యామ్‌
* 16 ఎంపీ ప్రైమరీ, 12.2 ఎంపీ సెకండరీ కెమెరాలు
* ఆండ్రాయిడ్‌ 10 ఓఎస్‌ 
* 2,800 ఎంఏహెచ్‌ (పిక్సల్‌ 4), 3,700 ఎంఏహెచ్‌ (పిక్సల్‌ 4 ఎక్స్‌ఎల్‌) బ్యాటరీ సామర్థ్యం

పిక్సల్‌ బుక్‌ గో

 

మొదటిసారి గూగుల్‌ ల్యాప్‌టాప్‌ను తక్కువ ధరలో ప్రవేశపెట్టింది. 13.3 అంగుళాల తాకే తెర ఉండే ఈ ల్యాప్‌ట్యాప్‌ ధర 649 డాలర్ల నుంచి 1,399 డాలర్ల మధ్య ఉంది.
* 8వ జనరేషన్‌ ఇంటెల్‌ కోర్‌ ప్రాసెసర్‌ ఎం3, ఐ5, ఐ7 వేరియంట్లలో లభ్యం
* 8జీబీ/16 జీబీ ర్యామ్‌
* 64జీబీ/126జీబీ/256జీబీ ఎస్‌ఎస్‌డీ
* 0.5 అంగుళాల మందం
* 12 గంటల పాటు వాడుకొనేలా బ్యాటరీ సామర్థ్యం

పిక్సల్‌ బడ్స్‌

ఆపిల్‌ ఎయిర్‌పాడ్స్‌తో పోలిస్తే మరింత నాజూకైన డిజైన్‌తో పిక్సల్‌ బడ్స్‌ ఆకట్టుకుంటున్నాయి. బ్లూటూత్‌ 5.0 చిప్‌ను ఇందులో వాడారు. ఇంట్లో ఉన్నప్పుడు ఫోన్‌కు ఇయర్‌ బడ్స్‌కు మధ్యలో మూడు గదులు ఉన్నా బ్లూటూత్‌ కనెక్టివిటీ చక్కగా ఉంటుందని గూగుల్‌ ప్రకటించింది. అయితే ఇవి వచ్చే ఏడాది మార్కెట్లోకి రానున్నట్లు సంస్థ ప్రకటించింది. ధర 179 డాలర్లు.

Tags:

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లాలు

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని