గురువారం, ఆగస్టు 06, 2020
home
ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
జాతీయ- అంతర్జాతీయ
క్రైమ్
పాలిటిక్స్
బిజినెస్‌
క్రీడలు
సినిమా

ఫీచర్ పేజీలు

ఫొటోలు
వీడియోలు
ఎన్ఆర్ఐ

ఇంకా..

E Paper
Archives
Terms & Conditions
Privacy Policy
FacebookTwitter

తాజా వార్తలు

కొవిడ్‌ ఔషధం ధర 27% తగ్గించిన గ్లెన్‌మార్క్‌

ముంబయి: ఫాబిఫ్లూ బ్రాండ్‌పేరుతో కొవిడ్‌-19 చికిత్సకు ఉపయోగిస్తున్న ఫవిపిరవిర్‌ ఔషధం ధరలు తగ్గిస్తున్నామని గ్లెన్‌మార్క్‌ ఫార్మాసూటికల్స్‌ ప్రకటించింది. ఒక్కో గోలికి దాదాపుగా 27% వరకు ధర తగ్గించామని తెలిపింది. ఫలితంగా రూ.103 బదులు రూ.75కే వినియోగదారులకు తమ ఔషధం అందుబాటులోకి వస్తుందని వెల్లడించింది. స్వల్ప, మోతాదు కరోనా లక్షణాలున్న బాధితులకు దీనిని వినియోగిస్తున్నారు.

ధరను తగ్గించిన విషయాన్ని రెగ్యులేటరీ ఫైలింగ్‌లో గ్లెన్‌మార్క్‌ వివరించింది. ‘భారత్‌లోని గ్లెన్‌మార్క్‌ కేంద్రాల్లో అత్యుత్తమ పద్ధతుల్లో ఔషధాలను తయారు చేస్తుండటంతో ధర తగ్గించేందుకు వీలు కలిగింది. ఇప్పుడా ప్రయోజనాలను దేశంలోని బాధితులకు బదిలీ చేస్తున్నాం’ అని ఆ సంస్థ తెలిపింది.

‘ఇతర దేశాల్లో విక్రయిస్తున్న ఫవిపిరవిర్‌తో పోలిస్తే భారత్‌లోనే అతి తక్కువ ధరకు ఫాబిఫ్లూను విక్రయిస్తున్నట్టు మా అంతర్గత అధ్యయనాల ద్వారా తెలిసింది. ఇప్పుడు ఇంకా ధర తగ్గడంతో కరోనా బాధితులకు విస్తృతంగా అందుబాటులోకి వస్తుందని భావిస్తున్నాం. ఫాబిఫ్లూపై మేమిప్పుడు పోస్ట్‌ మార్కెటింగ్‌ సర్వీలియన్స్‌ అధ్యయనం చేపట్టబోతున్నాం. 1000 మందిపై పరిశోధన చేయనున్నాం. ఔషధం పనితీరు, సామర్థ్యాన్ని తెలుసుకోనున్నాం’ అని ఆ సంస్థ సీనియర్‌ ఉపాధ్యక్షుడు అలోక్‌మాలిక్‌ తెలిపారు.

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లాలు

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని