శుక్రవారం, జులై 10, 2020
home
ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
జాతీయ- అంతర్జాతీయ
క్రైమ్
పాలిటిక్స్
బిజినెస్‌
క్రీడలు
సినిమా

ఫీచర్ పేజీలు

ఫొటోలు
వీడియోలు
ఎన్ఆర్ఐ

ఇంకా..

E Paper
Archives
Terms & Conditions
Privacy Policy
FacebookTwitter

తాజా వార్తలు

కొల్హాపూర్‌ ఎక్స్‌ప్రెస్‌ బోగీలో పొగలు

తెగిన ఓహెచ్‌ఈ తీగ

కేసముద్రం : మహబూబాబాద్‌ జిల్లా కేసముద్రం-ఇంటికన్నె రైల్వేస్టేషన్ల మధ్య ఓహెచ్‌ఈ (ఓవర్‌ హెడ్‌ ఎక్విప్‌మెంట్‌)తీగ తెగి పోవడంతో మణుగూరు నుంచి కొల్హాపూర్‌ వెళ్లే కొల్హాపూర్‌ ఎక్స్‌ప్రెస్‌ నిలిచిపోయింది. గురువారం రాత్రి 9.40 గంటలకు కేసముద్రం రైల్వేస్టేషన్‌ నుంచి బయలుదేరిన కొల్హాపూర్‌ ఎక్స్‌ప్రెస్‌ ఇంటికన్నె రైల్వేస్టేషన్‌ సమీపిస్తుండగా ఇంజిన్‌పై యాంటెనా, ఓహెచ్‌ఈ తీగకు అనుసంధానంగా ఉన్న జంపర్‌ తెగిపోయి రైలు బోగీకి తగిలింది. దీంతో ఒక్కసారిగా మంటలు, పొగలు బోగీలోకి కమ్ముకోవడంతో ప్రయాణికులు భయపడ్డారు. కదులుతున్న రైలు నుంచి కొందరు ప్రయాణికులు దూకేందుకు ప్రయత్నం చేయగా అప్రమత్తమైన యువకులు వారిని అడ్డుకొని చైౖన్‌ లాగారు. నిలిచిన రైలు నుంచి ప్రయాణికులు ఆర్తనాదాలు చేస్తూ పరుగులు పెట్టారు. ప్రాణాపాయం లేకపోవడంతో సిబ్బంది ఊపిరి పీల్చుకున్నారు. ఖాజీపేట జంక్షన్‌ నుంచి డీజిల్‌ ఇంజిన్‌ను రప్పించి కొల్హాపూర్‌ ఎక్స్‌ప్రెస్‌కు తగిలించడంతో రాత్రి 1.15 గంటలకు రైలు కదిలింది.

Tags:

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లాలు

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని