శుక్రవారం, జులై 10, 2020
home
ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
జాతీయ- అంతర్జాతీయ
క్రైమ్
పాలిటిక్స్
బిజినెస్‌
క్రీడలు
సినిమా

ఫీచర్ పేజీలు

ఫొటోలు
వీడియోలు
ఎన్ఆర్ఐ

ఇంకా..

E Paper
Archives
Terms & Conditions
Privacy Policy
FacebookTwitter

తాజా వార్తలు

ఆ క్రికెట్‌ అంపైర్‌ ఒక పోర్న్‌స్టార్‌

ముంబయి: ఇంగ్లాండ్‌, న్యూజిలాండ్‌ టీ20 సిరీస్‌ నువ్వానేనా అన్నట్టు సాగుతోంది. నాలుగు మ్యాచ్‌లు ముగిసే సరికి రెండు జట్లు 2-2తో సమంగా ఉన్నాయి. చివరి పోరు నిర్ణయాత్మకంగా మారనుంది. కివీస్‌ విజేతగా నిలిచిన మూడో మ్యాచ్‌కు నెల్సన్‌లోని సాక్స్టన్‌ ఓవల్‌ వేదిక. దీనికి నాలుగో అంపైర్‌గా వ్యవహరించిన గర్త్‌ స్టిర్రత్‌ ఒకప్పుడు పోర్న్‌స్టార్‌ కావడం సంచలనంగా మారింది.

ప్రస్తుతం స్టిర్రత్‌ వయసు 51. విజయవంతమైన అంపైర్‌గా ఆయన మంచిపేరు తెచ్చుకున్నాడు. గతంలో ఓ మ్యాగజీన్‌లో ఆయనపై ఓ కథనం వచ్చిందని బ్రిటిష్ పత్రిక ది సన్‌ తెలిపింది. నీలి చిత్రాల్లో నటించేటప్పుడు ఆయన ‘స్టీవ్‌ పర్నెల్‌’ పేరుతో చలామణి అయ్యేవారని పేర్కొంది. న్యూజిలాండ్‌ ఆటగాళ్లకు ఆయన గతం తెలుసు. ఇదే విషయాన్ని వారు ఇంగ్లాండ్‌ ఆటగాళ్లకూ తెలియజేశారు. గతంలో పదేళ్లు ఆయన న్యూజిలాండ్‌ ప్రొఫెషనల్‌ గోల్ఫర్‌ సంఘానికి చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌గా పనిచేశారు. రహస్య గుర్తింపుతో నీలి చిత్రాల్లో నటిస్తున్నారని తెలియడంతో స్టిర్రత్‌ ఆ పదవి నుంచి ఉద్వాసనకు గురయ్యారు. ఆ తర్వాత క్రికెట్‌ అంపైర్‌గా తన కెరీర్‌ను విజయవంతంగా నిర్మించుకున్నారు. మహిళల అంతర్జాతీయ మ్యాచ్‌లు ఎన్నింటికో ఆయన అంపైరింగ్‌ చేశారు.

Tags:

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లాలు

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని