శుక్రవారం, జులై 10, 2020
home
ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
జాతీయ- అంతర్జాతీయ
క్రైమ్
పాలిటిక్స్
బిజినెస్‌
క్రీడలు
సినిమా

ఫీచర్ పేజీలు

ఫొటోలు
వీడియోలు
ఎన్ఆర్ఐ

ఇంకా..

E Paper
Archives
Terms & Conditions
Privacy Policy
FacebookTwitter

తాజా వార్తలు

‘ఫ్లిప్‌కార్ట్‌ వీడియో..’ కంటెంట్‌ వివరాలివే..

ప్రైమ్‌ వీడియో, నెట్‌ఫ్లిక్స్‌కు పోటీగా... 

ముంబయి: అమెజాన్‌ ప్రైమ్‌, నెట్‌ ఫ్లిక్స్‌కు పోటీగా ఫ్లిప్‌కార్ట్‌ గత ఆగస్టులో ప్రారంభించిన ‘ఫ్లిప్‌కార్ట్‌ వీడియో ఒరిజినల్స్‌’కు సంబంధించిన వివరాలను ఆ సంస్థ మంగళవారం వెల్లడించింది. మధ్య, దిగువ స్థాయి పట్టణాల వినియోగదారులే లక్ష్యంగా తాము కంటెంట్‌ను ఉచితంగా అందిస్తామని ఫ్లిప్‌కార్ట్‌ వైస్‌ ప్రెసిడెంట్ ప్రకాశ్‌ సికారియా అన్నారు. కొత్తగా ఇంటర్నెట్‌కు అలవాటుపడే వారు వీడియో స్ట్రీమింగ్‌ ద్వారానే ఈ మాధ్యమంవైపు మళ్లుతారని ఆయన అభిప్రాయపడ్డారు. తమకు ఉన్న 160 మిలియన్ల మంది ఫ్లిప్‌కార్ట్‌ వినియోగదారులతోపాటు, మొత్తం 200 మిలియన్ల మంది వినియోగదారులు తమ లక్ష్యమని చెప్పారు. వినోదభరితమైన కంటెంట్‌తో కూడిన వీడియోలు కొత్త వినియోగదారులను ఆకర్షించడంలో ప్రధాన పాత్ర పోషిస్తాయని ఆయన అన్నారు.
‘‘ఫ్లిప్‌కార్ట్‌ వీడియో ఒరిజినల్స్‌కు కంటెంట్‌ క్రియేటర్‌గా ఆస్కార్‌ విజేత గునీత్‌ మొంగా ఉంటారు. రాబోనే రోజుల్లో ఫ్లిప్‌కార్ట్‌ స్టూడియో నెక్ట్స్‌, ఫ్రేమ్స్‌, సిఖ్యా ప్రొడక్షన్స్‌ వంటి నిర్మాణ సంస్థలతో జట్టు కట్టి అన్ని భాషలు, రంగాల వారీగా నాణ్యమైన కంటెంట్‌ను అందుబాటులోకి తీసుకువస్తాం. బాలీవుడ్‌ ప్రముఖ దర్శకురాలు ఫరాఖాన్‌ నిర్వహించే ‘బ్యాక్‌ బెంచర్స్‌’ సిరీస్‌ వచ్చే నెలలో ప్రారంభమవుతుంది.’’ అని ప్రకాశ్‌ సికారియా తెలిపారు.

భారత్‌లో వీడియో స్ట్రీమింగ్‌ పరిశ్రమ వేగంగా వృద్ధి చెందుతోంది. ఏడాదికి 21.8 శాతం వృద్ధితో దూసుకెళ్తోంది. ఈ వ్యాపారం విలువ 2023 నాటికి రూ.11,977 కోట్లకు చేరుతుందని అంచనా. నెలవారీ చందా ఉండే వీడియో ఆన్‌ డిమాండ్‌ సర్వీసుల మార్కెట్‌ కూడా ఏటా సరాసరి 23.3 శాతం వృద్ధితో కొనసాగుతోంది. ప్రస్తుతం భారత్‌లో 34 వరకూ వీడియో స్ట్రీమింగ్‌ కంపెనీలు ఉన్నాయి. అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో, నెట్‌ఫ్లిక్స్‌ వంటివి అమెరికాకు చెందినవి కాగా.. జీ5, వూట్‌, ఈరోస్‌ నౌ, ఆల్ట్‌ బాలాజీ వంటివి భారత్‌కు చెందిన వాటిలో ఉన్నాయి.

Tags:

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లాలు

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని