శుక్రవారం, జులై 10, 2020
home
ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
జాతీయ- అంతర్జాతీయ
క్రైమ్
పాలిటిక్స్
బిజినెస్‌
క్రీడలు
సినిమా

ఫీచర్ పేజీలు

ఫొటోలు
వీడియోలు
ఎన్ఆర్ఐ

ఇంకా..

E Paper
Archives
Terms & Conditions
Privacy Policy
FacebookTwitter

తాజా వార్తలు

ఏలూరు సబ్‌జైలుకు చింతమనేని తరలింపు

ఏలూరు: తెదేపా నేత, దెందులూరు మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌ను పోలీసులు ఏలూరు ఎక్సైజ్‌ న్యాయస్థానంలో హాజరుపరిచారు. ఏలూరు ప్రభుత్వ వైద్యశాలలో చింతమనేనికి వైద్యపరీక్షలు నిర్వహించిన అనంతరం పోలీసులు ఆయన్ను కోర్టుకు తీసుకెళ్లారు. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులో విచారణ చేపట్టిన న్యాయస్థానం.. చింతమనేనికి ఈనెల 25 వరకు రిమాండ్‌ విధించింది. న్యాయస్థానం రిమాండ్‌ విధించడంతో పోలీసులు ఆయన్ను ఏలూరు సబ్‌జైలుకు తరలించారు. చింతమనేనిపై పదిరోజుల క్రితం పోలీసులు ఏడు కేసులు నమోదు చేశారు. ఆయన అజ్ఞాతంలోకి వెళ్లిపోవడంతో అరెస్టు చేయలేదు. ఈరోజు ఉదయం దెందులూరు సమీపంలోని చింతమనేని స్వగ్రామం దుగ్గిరాలలో ఆయన్ను అరెస్టు చేశారు.

Tags:

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లాలు

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని