శుక్రవారం, జులై 10, 2020
home
ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
జాతీయ- అంతర్జాతీయ
క్రైమ్
పాలిటిక్స్
బిజినెస్‌
క్రీడలు
సినిమా

ఫీచర్ పేజీలు

ఫొటోలు
వీడియోలు
ఎన్ఆర్ఐ

ఇంకా..

E Paper
Archives
Terms & Conditions
Privacy Policy
FacebookTwitter

తాజా వార్తలు

విదేశీ ఖైదీల కోసం భారత వ్యాపారి దాతృత్వం!

దుబాయ్‌: వారంతా ఉపాధి కోసం దుబాయ్‌కి వెళ్లి చిన్న చిన్న నేరాల్లో చిక్కుకుని జైలు పాలయ్యారు. సంవత్సరాల పాటు శిక్షను అనుభవించి, ప్రస్తుతం విడుదలై వారి సొంత దేశాలకు వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నారు. వారిలో పాకిస్థాన్‌, బంగ్లాదేశ్‌, ఉగాండా, అఫ్గానిస్థాన్‌, నైజీరియా, చైనా, ఇథియోపియా దేశాలకు చెందిన వారు ఉన్నారు. విడుదలయ్యాక స్వదేశానికి వెళ్లడానికి ప్రయాణ ఖర్చులకు వారితో డబ్బులు లేవు. ఈ సమయంలో 13 మంది ఖైదీలను వారి దేశాలకు చేర్చేందుకు విమానఖర్చులు భరిస్తానని ఓ వ్యాపారవేత్త ముందుకు వచ్చారు. ఆయనే దుబాయ్‌లోని భారతీయ వ్యాపారవేత్త జోగిందర్‌ సింగ్‌ సలారియా. 

జోగిందర్‌ సింగ్‌ సలారియా పీసీటీ పేరుతో దుబాయ్‌లో ఒక స్వచ్ఛంద సంస్థను నడుపుతున్నారు. అక్కడ తరచూ రక్తదాన శిబిరాలతో పాటు పలు స్వచ్ఛంద కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు. ఇదే సమయంలో శిక్ష పూర్తి చేసుకుని స్వదేశానికి వెళ్లాల్సిన కొందరు ఖైదీలకు సహకరించాలంటూ దుబాయ్‌ పోలీసుల నుంచి ఆయనకు ఒక జాబితా అందడంతో సహాయం చేసేందుకు ముందడుగు వేశారు. ఈ సందర్భంగా పీసీటీ స్వచ్ఛంద సంస్థ ఎండీ సలారియా మాట్లాడుతూ.. ‘ప్రతి సంవత్సరం కొన్ని స్వచ్ఛంద కార్యక్రమాలు నిర్వహిస్తుంటాం. అలా ఈ సంవత్సరం ఖైదీలు స్వదేశానికి వెళ్లేందుకు సహాయం చేస్తున్నాం. వారి వివరాలను పోలీసులు మాకు అందించారు. ఉపాధి కోసం విదేశానికి వచ్చి చిన్న చిన్న నేరాల్లో చిక్కుకుని జైలు శిక్ష అనుభవించి విడుదలవుతున్నారు. దుబాయ్‌ పోలీసులు ఇలాంటి కార్యక్రమాలకు బాగా సహకరిస్తారు’ అని వెల్లడించారు. ఇప్పటికే ఇతడు పాకిస్థాన్‌లోని సింధ్‌ ప్రావిన్స్‌లో చేతి పంపులు కూడా ఏర్పాటు చేయించారు. 

ఆగ్రాలోనూ మోతీలాల్‌ యాదవ్‌ అనే ఒక వ్యాపారవేత్త 17 మంది ఖైదీలను విడిపించేందుకు ముందుకు వచ్చారు. చిన్న నేరాల్లో ఇరుక్కుని గడువు దాటినా శిక్ష అనుభవిస్తున్న వారిని తన 73వ జన్మదినం సందర్భంగా వారు విడుదలయ్యేలా డబ్బులు ఖర్చు చేసేందుకు ముందుకు వచ్చినట్లు తెలిపారు. 

Tags:

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లాలు

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని