శుక్రవారం, జులై 10, 2020
home
ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
జాతీయ- అంతర్జాతీయ
క్రైమ్
పాలిటిక్స్
బిజినెస్‌
క్రీడలు
సినిమా

ఫీచర్ పేజీలు

ఫొటోలు
వీడియోలు
ఎన్ఆర్ఐ

ఇంకా..

E Paper
Archives
Terms & Conditions
Privacy Policy
FacebookTwitter

తాజా వార్తలు

రోహిత్‌శర్మను వదిలేయండి: కోహ్లీ

అతడి మీద దృష్టిపెట్టకండి

పుణె: టీమిండియా ఓపెనర్‌ రోహిత్‌శర్మ తదుపరి మ్యాచ్‌లో ఎలా ఆడతాడనే విషయాన్ని వదిలేయాలని, అతడి మీద దృష్టి పెట్టొద్దని కెప్టెన్‌ విరాట్‌కోహ్లీ మీడియాని, విమర్శకులను కోరాడు. రెండో టెస్టుకు ముందు బుధవారం పుణెలో నిర్వహించిన మీడియా సమావేశంలో కెప్టెన్‌ మాట్లాడుతూ పై విధంగా పేర్కొన్నాడు. దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి టెస్టులో హిట్‌మ్యాన్‌ రోహిత్‌ సుదీర్ఘ ఫార్మాట్‌లో తొలిసారి ఓపెనింగ్‌ చేసిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా అందివచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్న అతడు రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ(176), (127) శతకాలు బాది జట్టుకు భారీ స్కోర్‌ అందించాడు. కాగా టెస్టుల్లో ఓపెనర్‌గా దిగిన తొలి మ్యాచ్‌లోనే రెండు శతకాలు బాదిన ఏకైక క్రికెటర్‌గా చరిత్ర సృష్టించాడు. 

‘రోహిత్‌శర్మ తొలి టెస్టులో అద్భుతంగా ఆడాడు, టాప్‌ఆర్డర్‌లో అతడి బ్యాటింగ్‌ను ఆస్వాదించనీయాలి. వన్డేల్లో చెలరేగినట్లే టెస్టుల్లోనూ రాణించాలి. సుదీర్ఘ ఫార్మాట్‌లో ఓపెనర్‌ ఏం చేస్తాడనే విషయంపై దృష్టిసారించొద్దు, ప్రస్తుతం అతడు బాగా ఆడుతున్నాడు. అయితే హిట్‌మ్యాన్‌ విశాఖలో చాలా ప్రశాంతంగా కనిపించాడు, ఇన్నేళ్ల అనుభవం మొత్తం ఇప్పుడు బయటకు వచ్చింది, ఇది జట్టుకెంతో ఉపయోగం. రెండో ఇన్నింగ్స్‌లో హిట్‌మ్యాన్‌ ఆటను గమనిస్తే, అతడు ఆటను ఎలా ముందుకు తీసుకెళ్లాడనే విషయం అర్థమౌతుంది. రోహిత్‌ ఇలాగే చెలరేగితే.. ప్రత్యర్థి బ్యాట్స్‌మెన్‌ను ఆలౌట్ చేసేందుకు మా బౌలర్లకు సుమారు రెండు గంటల సమయం కలిసొస్తుంది. అలాగే టీమిండియా ఇప్పుడున్న పరిస్థితుల కన్నా మెరుగైన విజయాలు సాధిస్తుంది. తన ఆట పట్ల మా జట్టంతా సంతోషంగా ఉంది’ అని పేర్కొన్నాడు. 

అనంతరం టీమిండియా కాంబినేషన్‌ గురించి మాట్లాడుతూ స్వదేశంలో రవిచంద్రన్‌ అశ్విన్‌, జడేజాలనే కొనసాగిస్తామని, అన్నిటికన్నా ముఖ్యం తమ జట్టు వీలైనన్ని విజయాలు సాధించడమేనని కోహ్లీ చెప్పాడు. భారత జట్టులో ఎవరు కూడా వ్యక్తిగత ప్రయోజనాల కోసం ఆలోచించరని, ప్రతీ ఒక్కరు జట్టు విజయానికి కృషిచేస్తారని అన్నాడు. కుల్‌దీప్‌ కూడా అలాగే ఆలోచిస్తాడని, స్వదేశంలో టెస్టులు ఆడేటప్పుడు అశ్విన్‌, జడేజాలకే ప్రాధాన్యమిస్తామనే విషయాన్ని అర్థం చేసుకుంటాడని చెప్పాడు. ఆ స్పిన్నర్లిద్దరూ అవసరమైతే బ్యాటింగ్‌ చేయగలరని, అందుకే సమతూకమైన జట్టుతో ముందుకు సాగుతున్నామని కెప్టెన్‌ స్పష్టంచేశాడు.

Tags:

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లాలు

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని