శుక్రవారం, జులై 10, 2020
home
ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
జాతీయ- అంతర్జాతీయ
క్రైమ్
పాలిటిక్స్
బిజినెస్‌
క్రీడలు
సినిమా

ఫీచర్ పేజీలు

ఫొటోలు
వీడియోలు
ఎన్ఆర్ఐ

ఇంకా..

E Paper
Archives
Terms & Conditions
Privacy Policy
FacebookTwitter

తాజా వార్తలు

తెదేపా కార్యకర్తలే లక్ష్యంగా దాడులు:చంద్రబాబు

 

చిత్తూరు: వైకాపా అరాచకాలు తీవ్రమయ్యాయని.. రాష్ట్రంలో సామాన్యులకు భద్రత లేకుండా పోయిందని తెదేపా అధినేత చంద్రబాబు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. చిత్తూరు జిల్లా కార్యకర్తలతో మూడో రోజు సమీక్ష నిర్వహించిన చంద్రబాబు నియోజకవర్గాల వారీగా కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం అప్రజాస్వామికంగా వ్యవహరిస్తోందని.. రాష్ట్రంలో శాంతిభద్రతలు క్షీణించాయని విమర్శించారు. తెదేపా కార్యకర్తలే లక్ష్యంగా దాడులు జరుగుతున్నాయని మండిపడ్డారు. ఇష్టారీతిన వ్యవహరిస్తున్న సర్కారు పత్రికలపైనా ఆంక్షలు విధించి బెదిరించడం సరికాదని బాబు ఆక్షేపించారు. తాత రాజారెడ్డి బాటలోనే సీఎం జగన్‌ మోహన్‌ రెడ్డి నడుస్తున్నారని విమర్శించారు. ప్రత్యర్థుల ఆర్థిక మూలాలను పూర్తిగా ధ్వంసం చేస్తున్నారన్నారు.

ఏపీ ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమాన్ని ప్రవేశపెట్టాలని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం సరైంది కాదని చంద్రబాబు అన్నారు. తెలుగు భాషను కాపాడుకోలేకపోతే తెలుగు జాతి ఉనికిని కోల్పోతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ముందస్తు ఏర్పాట్లు లేకుండా ఆంగ్ల మాధ్యమం ప్రవేశపెడితే అనేక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. మీడియా వాళ్లపై తప్పుడు కేసులు బనాయించి వారి చావుకు కారణమవుతున్నారని దుయ్యబట్టారు. తిరుమల పవిత్రతకు భంగం కలిగేలా ప్రభుత్వం వ్యవహరిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. అగ్రిగోల్డ్‌ అవినీతిపై శాసనసభ సభాపతి తమ్మినేని చేసిన వ్యాఖ్యలు ఆయన బాధ్యతారహిత్యానికి నిదర్శనంగా నిలుస్తున్నాయని అన్నారు. సభాపతి స్థానంలో ఉన్న ఆయన హుందాగా నడుచుకోవాలని సూచించారు.

Tags:

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లాలు

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని