శుక్రవారం, జులై 10, 2020
home
ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
జాతీయ- అంతర్జాతీయ
క్రైమ్
పాలిటిక్స్
బిజినెస్‌
క్రీడలు
సినిమా

ఫీచర్ పేజీలు

ఫొటోలు
వీడియోలు
ఎన్ఆర్ఐ

ఇంకా..

E Paper
Archives
Terms & Conditions
Privacy Policy
FacebookTwitter

తాజా వార్తలు

ఆర్టీసీపై మరోమారు సీఎం కేసీఆర్‌ సమీక్ష

హైదరాబాద్‌: సమ్మె కొనసాగింపు, హైకోర్టు వరుస విచారణల నేపథ్యంలో సీఎం కేసీఆర్‌ ఆర్టీసీపై మరోమారు సమీక్ష నిర్వహించారు. ప్రగతిభవన్‌లో నిర్వహించిన ఈ సమీక్ష సమావేశానికి రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌, సీఎస్‌ ఎస్కే జోషి, ప్రభుత్వ ముఖ్య సలహాదారు రాజీవ్‌శర్మ, అడ్వొకేట్‌ జనరల్‌ బీఎస్‌ ప్రసాద్‌, ఆర్టీసీ ఉన్నతాధికారులు హాజరయ్యారు. కార్మిక సంఘాల డిమాండ్లను పరిశీలించి త్వరగా పరిష్కరించాలన్న హైకోర్టు సూచన నేపథ్యంలో తదుపరి అనుసరించాల్సిన వ్యూహంపై సమావేశంలో చర్చిస్తున్నారు.

మరోవైపు 5,100 ప్రైవేట్ బస్సులకు రవాణా అనుమతుల విషయంలోనూ ముందుకెళ్లరాదన్న ఉన్నత న్యాయస్థానం ఆదేశాలపైనా సమీక్షలో చర్చిస్తున్నారు. రెండు తీర్పులకు సంబంధించిన తీర్పు ప్రతులను అధ్యయనం చేయడంతో పాటు కోర్టు ప్రస్తావించిన అంశాలపై ప్రత్యేకంగా పరిశీలిస్తున్నారు. న్యాయస్థానం ముందు ప్రభుత్వం తరపున వినిపించాల్సిన వాదనలపై సీఎం అధికారులకు దిశానిర్దేశం చేస్తున్నారు.

Tags:

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లాలు

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని