శుక్రవారం, జులై 10, 2020
home
ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
జాతీయ- అంతర్జాతీయ
క్రైమ్
పాలిటిక్స్
బిజినెస్‌
క్రీడలు
సినిమా

ఫీచర్ పేజీలు

ఫొటోలు
వీడియోలు
ఎన్ఆర్ఐ

ఇంకా..

E Paper
Archives
Terms & Conditions
Privacy Policy
FacebookTwitter

తాజా వార్తలు

బెంగాల్‌ ఎవరి ముందూ తల వంచదు: మమత

కోల్‌కతా: పశ్చిమ బెంగాల్‌కు చెందిన  చిత్ర దర్శకులు దశాబ్దాలుగా ఐక్యతా సందేశాన్ని విభిన్న రీతిలో చాటుతున్నారని సీఎం మమతా బెనర్జీ ప్రశంసించారు. తమ రాష్ట్రం ఇతరుల ముందు ఎప్పటికీ తలవంచబోదన్నారు. అవార్డులు తెచ్చే చిత్రాలను రూపొందించే ఎంతోమంది దర్శకులు, అలాగే  ప్రతిష్ఠాత్మక నోబెల్‌ పురస్కారాలను పొందినవారు కూడా తమ రాష్ట్రం నుంచే వచ్చారని  మమత అన్నారు. శాస్త్రీయ, సాంస్కృతిక అభివృద్ధిలో దేశంలో తామే నంబర్‌ వన్‌ అని అన్నారు. శుక్రవారం 25వ కోల్‌కతా అంతర్జాతీయ చలన చిత్రోత్సవం సందర్భంగా ఆమె ప్రసంగించారు. ఈ కార్యక్రమానికి ప్రత్యేక ఆహ్వానితుడిగా విచ్చేసిన  ప్రముఖ నిర్మాత మహేశ్‌ భట్‌పై ప్రశంసలు కురిపించారు. ఏదైనా ఆయన నిర్మొహమాటంగా మాట్లాడతారన్నారు. ఇతరులు ఏదైనా చెప్పేందుకు భయపడినా ఆయన మాత్రం తనకు ఏది అనిపిస్తే అది నిక్కచ్చిగా చెబుతారని దీదీ ప్రశంసించారు. ఎనిమిది రోజుల పాటు కొనసాగే ఈ అంతర్జాతీయ చిత్రోత్సవంలో 76 దేశాలు పాల్గొంటున్నాయి. ఈ చిత్రోత్సవంలో 367 చిత్రాలు, 214 ఫీచర్‌ ఫిల్మ్స్‌, 153 షార్ట్‌ డాక్యుమెంటరీలు ప్రదర్శించనున్నారు. 

మాకెవరిపైనా అసూయలేదు
ఇటీవల బెంగాల్‌ పర్యటనకు విచ్చేసిన సందర్భంగా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షా తృణమూల్‌ కాంగ్రెస్‌ పాలనపై విమర్శలు చేశారు. శాస్త్రీయ, సాంస్కృతిక అభివృద్ధిలో బెంగాల్‌ వెనుకబడి ఉందని ఆయన వ్యాఖ్యానించారు. ఒకప్పుడు ఆధ్యాత్మిక, శాస్త్రీయ, సాంస్కృతిక అభివృద్ధికి ప్రసిద్ధిగాంచిన బెంగాల్‌.. నేడు బాంబుల పరిశ్రమలకు చిరునామాగా మారిందంటూ అమిత్‌ షా ఎద్దేవా చేశారు. దీనిపై మమత ఎవరి పేరునూ ప్రస్తావించకుండానే పరోక్షంగా స్పందించారు. ఇతరులపై తమకు ఎలాంటి అసూయ లేదని చెప్పారు. ప్రతి ఒక్కరితోనూ సానుకూల దృక్పథంతోనే వ్యవహరిస్తామన్నారు. జీవితకాలం పోరాడతామనీ.. ఇతరుల ముందు మాత్రం తలవంచబోమని దీదీ స్పష్టంచేశారు. 

Tags:

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లాలు

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని