శుక్రవారం, జులై 10, 2020
home
ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
జాతీయ- అంతర్జాతీయ
క్రైమ్
పాలిటిక్స్
బిజినెస్‌
క్రీడలు
సినిమా

ఫీచర్ పేజీలు

ఫొటోలు
వీడియోలు
ఎన్ఆర్ఐ

ఇంకా..

E Paper
Archives
Terms & Conditions
Privacy Policy
FacebookTwitter

తాజా వార్తలు

ఆ రికార్డు.. చెక్కుచెదరలేదు!

రెండేళ్లు దాటినా..

హైదరాబాద్‌: తెలుగు చిత్ర పరిశ్రమ ఖ్యాతిని ప్రపంచ వ్యాప్తంగా మరింత పెంచిన ప్రతిష్ఠాత్మక చిత్రం ‘బాహుబలి: ది కన్‌క్లూజన్‌’. ప్రభాస్‌, రానా, అనుష్క, తమన్నా ప్రధాన పాత్రల్లో దర్శకధీరుడు ఎస్‌.ఎస్‌. రాజమౌళి తెరకెక్కించిన ఈ సినిమా 2017 ఏప్రిల్‌లో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సినీ ప్రముఖులు, విమర్శకుల ప్రశంసలతోపాటు బాక్సాఫీసు వద్ద వసూళ్ల వర్షం కురిపించి.. కొత్త రికార్డులు సృష్టించింది. ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా రూ.1,800 కోట్లు రాబట్టినట్లు సినీ విశ్లేషకులు అంచనా వేశారు. కాగా ఈ చిత్రం విడుదలై రెండేళ్లవుతున్నా.. దాని రికార్డును ఏ హిందీ సినిమా చెరపలేకపోయిందని సినీ విశ్లేషకుడు తరణ్‌ ఆదర్శ్‌ పేర్కొన్నారు. ‘బాహుబలి 2’ పది రోజుల్లో దేశవ్యాప్తంగా రూ.300 కోట్లు రాబట్టిందని (కేవలం హిందీ భాషలో మాత్రమే) నేటికీ ఆ రికార్డు అలానే ఉందని అన్నారు.

ఈ సందర్భంగా హిందీలో ఏ సినిమా.. ఎన్ని కోట్లు వసూలు చేసిందనే జాబితాను షేర్‌ చేశారు. 2019లో విడుదలైన హిందీ సినిమాలు ‘వార్‌’ ఏడు రోజుల్లో, ‘కబీర్‌ సింగ్‌’ 13 రోజుల్లో, ‘భారత్‌’ రూ.14 రోజుల్లో, ‘ఉరి’ 28 రోజుల్లో, ‘మిషన్‌ మంగళ్‌’ 29 రోజుల్లో దేశవ్యాప్తంగా రూ.200 కోట్లు వసూలు చేశాయని అన్నారు. అదేవిధంగా వివిధ సంవత్సరాల్లో హిట్లుగా నిలిచిన హిందీ సినిమాలు ‘సంజు’ ఏడు రోజుల్లో, ‘టైగర్‌ జిందా హై’ ఏడు రోజుల్లో, ‘సుల్తాన్‌’ ఏడు రోజుల్లో, ‘దంగల్‌’ ఎనిమిది రోజుల్లో, ‘పీకే’ ఎనిమిది రోజుల్లో, ‘బజరంగీ భాయ్‌జాన్‌’ తొమ్మిది రోజుల్లో దేశవ్యాప్తంగా రూ.200 కోట్ల క్లబ్‌లో అడుగుపెట్టాయని తెలిపారు.

Tags:

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లాలు

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని