శుక్రవారం, జులై 10, 2020
home
ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
జాతీయ- అంతర్జాతీయ
క్రైమ్
పాలిటిక్స్
బిజినెస్‌
క్రీడలు
సినిమా

ఫీచర్ పేజీలు

ఫొటోలు
వీడియోలు
ఎన్ఆర్ఐ

ఇంకా..

E Paper
Archives
Terms & Conditions
Privacy Policy
FacebookTwitter

తాజా వార్తలు

అయోధ్య తీర్పు ఎవరికీ విజయం కాదు: మోదీ

దిల్లీ: అయోధ్య భూవివాదంపై శనివారం ఉదయం సుప్రీంకోర్టు తీర్పు వెలువరించనున్న నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ తాజాగా ట్విటర్‌ ద్వారా స్పందించారు. ‘అయోధ్య కేసులో సుప్రీంకోర్టు తీర్పు ఎవరికీ విజయం కాదు. అలా అని ఓటమి కాదు. ఈ తీర్పు భారతదేశ శాంతి, ఐక్యత, సద్భావన, గొప్ప సంప్రదాయాన్ని మరింత బలోపేతం చేయాలి. దేశ ప్రజలంతా శాంతి, సద్భావనతో మెలగాలని కోరుకుంటున్నాను. న్యాయవ్యవస్థ పట్ల  గౌరవాన్ని కాపాడేందుకు సమాజంలోని అన్ని సామాజిక - సాంస్కృతిక సంస్థలు కృషి చేస్తున్నాయి. గతంలో సామరస్యపూర్వక, సానుకూల వాతావరణాన్ని సృష్టించడానికి చేసిన ప్రయత్నాలను అన్ని పార్టీలు స్వాగతించాయి.  కోర్టు తీర్పు తర్వాత సమాజంలో శాంతి నెలకొనేలా యావత్‌ దేశం అంతా కలసిమెలసి నిలబడదామని’ మోదీ పిలుపునిచ్చారు.


Tags:

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లాలు

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని