శుక్రవారం, జులై 10, 2020
home
ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
జాతీయ- అంతర్జాతీయ
క్రైమ్
పాలిటిక్స్
బిజినెస్‌
క్రీడలు
సినిమా

ఫీచర్ పేజీలు

ఫొటోలు
వీడియోలు
ఎన్ఆర్ఐ

ఇంకా..

E Paper
Archives
Terms & Conditions
Privacy Policy
FacebookTwitter

తాజా వార్తలు

బైక్‌పై సీఎం:ఒంటరిగా 122కి.మీ రైడ్‌

దిల్లీ: అరుణాచల్‌ప్రదేశ్‌లో పర్యాటక రంగాన్ని ప్రోత్సహించి అభివృద్ధి చేసేందుకు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి పెమాఖండూ తాజాగా వినూత్న ప్రయత్నం చేశారు. రాష్ట్రంలో పర్యాటక రంగాన్ని ప్రోత్సహించే దిశగా స్వయంగా ఆయనే బైక్‌పై ఒంటరిగా 122 కిలోమీటర్లు ప్రయాణం చేసి అందరినీ ఆశ్చర్యానికి గురిచేశారు. ఈ మేరకు ఆయన ట్విటర్‌ ద్వారా తన ప్రయాణానికి సంబంధించిన విషయాలు వెల్లడించారు. 

అరుణాచల్‌ప్రదేశ్‌లోని పాసిఘాట్‌ ప్రాంతం బైక్‌రైడింగ్‌, సాహస క్రీడలకు ప్రసిద్ధి. ఈ ప్రాంతానికి పర్యాటకుల్ని ఆకర్షించి ప్రోత్సహించేందుకు ఆయన స్వయంగా రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ 650 ద్విచక్రవాహనంపై పర్యటనకు బయలుదేరారు. ఒకటీ, రెండు కాదు ఏకంగా 122 కిలోమీటర్లు బైక్‌పై ఒంటరిగా ప్రయాణించారు. తన బైక్‌ ప్రయాణానికి సంబంధించి వీడియో పోస్ట్‌ చేస్తూ.. పర్యాటకాన్ని ప్రోత్సహించే దిశగా ప్రయాణం అని పేర్కొన్నారు. బైక్‌ రైడింగ్‌, సాహస క్రీడలకు ఇది మంచి ప్రదేశం అని పేర్కొన్నారు. తన ప్రయాణాన్ని అక్టోబర్ 13న ఉదయం 8గంటలకు యుంగ్‌కియాంగ్‌ నుంచి ప్రారంభించగా, పాసిఘాట్‌ విమానాశ్రయానికి 10.30 గంటలకు చేరుకున్నానని చెప్పారు. 

పెమాఖండూ ఇలాంటి సాహసాలు చేయడం ఇదే మొదటిసారేం కాదు. గతంలోనూ పలుసార్లు బైక్‌ రైడ్‌ చేస్తూ కనిపించారు. గతేడాది బాలీవుడ్‌ నటుడు సల్మాన్‌ఖాన్‌తో పాటు సైకిల్‌ తొక్కిన విషయం తెలిసిందే. పర్యాటకాన్ని ప్రోత్సహించేందుకు సామాజిక మాధ్యమాలను ఆయన బాగా ఉపయోగిస్తుంటారు. 

 

 

 


Tags:

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లాలు

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని