గురువారం, జులై 16, 2020
home
ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
జాతీయ- అంతర్జాతీయ
క్రైమ్
పాలిటిక్స్
బిజినెస్‌
క్రీడలు
సినిమా

ఫీచర్ పేజీలు

ఫొటోలు
వీడియోలు
ఎన్ఆర్ఐ

ఇంకా..

E Paper
Archives
Terms & Conditions
Privacy Policy
FacebookTwitter

తాజా వార్తలు

నేను, మలైకా ఓపెన్‌ అవ్వడానికి కారణమదే

ఇంట్లో వాళ్లు చెప్పడం మానేశారు: అర్జున్‌ కపూర్‌

ముంబయి: బాలీవుడ్‌ నటుడు అర్జున్‌ కపూర్‌ వయసులో తనకంటే 12 ఏళ్లు పెద్దదైన మలైకా అరోరాతో కొంత కాలం నుంచి ప్రేమలో ఉన్నారనే విషయం తెలిసిందే. కొన్ని రోజుల పాటు సీక్రెట్‌గా ప్రేమలో ఉన్న ఈ జంట ఇటీవల చాలా సందర్భాల్లో సోషల్‌మీడియాలో పెట్టే ఫొటోలు, పోస్ట్‌లతో తాము ప్రేమలో ఉన్న విషయాన్ని పబ్లిక్‌గానే తెలియచేస్తున్నారు. ఇదిలా ఉండగా తాజాగా అర్జున్‌ కపూర్‌ ఓ ఆంగ్ల పత్రికతో సరదాగా ముచ్చటించారు. ఇందులో భాగంగా తన వ్యక్తిగత విషయాలను గురించి తెలియచేశారు.

సెలబ్రెటీలు చాలావరకూ తమ రిలేషన్స్‌ గురించి త్వరగా బయటపెట్టారు. కానీ మీరు, మలైకా మాత్రం పబ్లిక్‌గానే మీ రిలేషన్‌షిప్‌ను తెలియచేస్తున్నారు. ఎందుకని అని విలేకరి అర్జున్‌ను అడగగా.. ‘మీడియా, నెటిజన్లు వాళ్లు మాకు గౌరవం ఇచ్చినంత వరకూ మేము కూడా వాళ్లకు గౌరవం ఇచ్చాం. కొన్నిరోజుల తర్వాత మా ఇద్దరి బంధం గురించి అసత్యంగా వార్తలు వస్తోన్న తరుణంలో మేము కూడా పబ్లిక్‌గానే మా రిలేషన్‌ గురించి చెప్పాలని ఫిక్స్‌ అయ్యాం. అందుకే పబ్లిక్‌గానే కనిపిస్తున్నాం.’ అని తెలిపారు.

మీ గురించి ఇలాంటి వార్తలు వస్తోన్న సమయంలో త్వరగా పెళ్లి చేసుకోమని కుటుంబసభ్యులు ఒత్తిడి చేయడం లేదా అని ప్రశ్నించగా.. ‘లేదు. నేను ఏదైనా కరెక్ట్‌ టైంకి కరెక్ట్‌ పనిచేస్తానని మా వాళ్లకు బాగా తెలుసు. అందుకే వాళ్లు కూడా ఒకానొక సమయం నుంచి నాకు చెప్పడం మానేశారు. మా ఇంట్లో వాళ్లని ఇబ్బందిపెట్టే ఏ పని నేను చేయను. కచ్చితమైన సమయానికి తప్పకుండా పెళ్లి చేసుకుంటా’ అని అర్జున్‌ పేర్కొన్నారు.

Tags:

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లాలు

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని