శుక్రవారం, జులై 10, 2020
home
ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
జాతీయ- అంతర్జాతీయ
క్రైమ్
పాలిటిక్స్
బిజినెస్‌
క్రీడలు
సినిమా

ఫీచర్ పేజీలు

ఫొటోలు
వీడియోలు
ఎన్ఆర్ఐ

ఇంకా..

E Paper
Archives
Terms & Conditions
Privacy Policy
FacebookTwitter

తాజా వార్తలు

విదేశాల్లో విహరిస్తున్న పూజాహెగ్డే

హైదరాబాద్‌: దక్షిణాదితోపాటు బాలీవుడ్‌లోనూ విజయవంతంగా రాణిస్తున్న ముద్దుగుమ్మ పూజా హెగ్డే. ప్రస్తుతం విహారయాత్రకు వెళ్లిన ఆమె, కొత్త ప్రదేశాలను చూస్తూ ఆస్వాదిస్తున్నారు. గత కొన్ని రోజులుగా ప్రపంచంలోని వివిధ సుందరమైన ప్రదేశాల్లో పూజా విహరిస్తున్నారు. సినిమా షెడ్యూళ్లతో బిజీగా ఉన్న తను రీఫ్రెష్‌ అవడానికి ఈ ట్రిప్‌ ఎంతో ఉపయోగపడుతోందని పూజా ఇన్‌స్టాగ్రామ్‌లో పేర్కొన్నారు. సౌదీ అరేబియా, మక్కా తదితర ప్రాంతాల్లో దిగిన ఫొటోలను షేర్‌ చేశారు. ‘అందమైన నిర్మాణాలు, రుచికరమైన ఆహారం.. ఇది ఓ మంచి ట్రిప్‌’ అని పోస్ట్‌ చేశారు. ప్రస్తుతం పూజా హెగ్డే ఫ్రాన్స్‌లో విహరిస్తోంది. ఆమె ఫొటోలు అభిమానుల్ని ఆకట్టుకుంటున్నాయి.

పూజా హెగ్డే నటించిన హిందీ సినిమా ‘హౌస్‌ఫుల్‌ 4’ ఇటీవల విడుదలై మంచి హిట్‌ అందుకుంది. ఆమెతోపాటు అక్షయ్‌ కుమార్‌, రితేష్‌ దేశ్‌ముఖ్‌, కృతి సనన్‌, కృతి కర్బందా ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమా బాక్సాఫీసు వద్ద విశేషమైన వసూళ్లు రాబడుతోంది. ఇప్పటి వరకు ఈ సినిమా రూ.150 కోట్లకుపైగా రాబట్టినట్లు విశ్లేషకులు అంచనా వేశారు. తెలుగులో అల్లు అర్జున్‌తో త్రివిక్రమ్‌ రూపొందిస్తున్న ‘అలవైకుంఠ పురములో’ ఆమె కథానాయికగా నటిస్తున్నారు. కె.రాధా కృష్ణ దర్శకత్వంలో ప్రభాస్‌ హీరోగా వస్తున్న ‘జాన్‌’ (పరిశీలనలో ఉన్న టైటిల్‌) సినిమాలోనూ పూజా నటిస్తున్నారు.


Tags:

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లాలు

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని