శుక్రవారం, జులై 10, 2020
home
ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
జాతీయ- అంతర్జాతీయ
క్రైమ్
పాలిటిక్స్
బిజినెస్‌
క్రీడలు
సినిమా

ఫీచర్ పేజీలు

ఫొటోలు
వీడియోలు
ఎన్ఆర్ఐ

ఇంకా..

E Paper
Archives
Terms & Conditions
Privacy Policy
FacebookTwitter

తాజా వార్తలు

‘అగ్రిగోల్డ్‌ భూములు కొట్టేసేందుకు యత్నించారు’

గుంటూరు: తెదేపా అధినేత చంద్రబాబు హయాంలో అగ్రిగోల్డ్‌ అవినీతి జరిగితే డిపాజిటర్లకు అప్పటి ప్రభుత్వం పైసా కూడా చెల్లించలేదని ఏపీ హోంశాఖ మంత్రి మేకతోటి సుచరిత ఆరోపించారు. గుంటూరులో ఆమె మీడియాతో మాట్లాడారు. అగ్రిగోల్డ్ భూములను కారుచౌకగా కొట్టేసేందుకు యత్నించారే తప్ప బాధితుల సమస్యలను పరిష్కరించేందుకు ప్రయత్నం చేయలేదని విమర్శించారు. అలాంటి నేతలు నేడు వైకాపా ప్రభుత్వాన్ని విమర్శించడం విడ్డూరంగా ఉందన్నారు. పాదయాత్రలో ప్రజలకు ఇచ్చిన హామీ మేరకే అగ్రిగోల్డ్‌ బాధితులకు పరిహారం చెల్లిస్తున్నామని మంత్రి స్పష్టం చేశారు. ఈ అంశంపై చంద్రబాబు దారుణంగా మాట్లాడుతున్నారని.. రాష్ట్ర డీజీపీపై ఇష్టానుసారంగా విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాతే పోలీసులకు పూర్తి స్వేచ్ఛ ఇచ్చామని.. అధికార పార్టీ నేతలు తప్పు చేసినా వదిలిపెట్టవద్దని పోలీసులకు సీఎం జగన్‌ స్పష్టంగా ఆదేశాలిచ్చారని సుచరిత చెప్పారు. తెదేపా హయాంలో పార్టీ నేతలు చెబితేనే కేసులు నమోదు చేసేవారని.. ప్రజలు పోలీసుస్టేషన్‌కి వెళ్లి ఫిర్యాదు చేసేందుకు భయపడేవారని ఆమె ఆరోపించారు.

Tags:

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లాలు

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని