శుక్రవారం, జులై 10, 2020
home
ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
జాతీయ- అంతర్జాతీయ
క్రైమ్
పాలిటిక్స్
బిజినెస్‌
క్రీడలు
సినిమా

ఫీచర్ పేజీలు

ఫొటోలు
వీడియోలు
ఎన్ఆర్ఐ

ఇంకా..

E Paper
Archives
Terms & Conditions
Privacy Policy
FacebookTwitter

తాజా వార్తలు

పింక్‌టెస్టుపై బంగ్లా సారథి అనూహ్య స్పందన

కోల్‌కతా: టీమిండియాతో చారిత్రక గులాబి టెస్టుకు సన్నద్ధం అయ్యేందుకు సన్నాహక మ్యాచ్‌ ఆడే అవకాశం దొరకలేదని బంగ్లాదేశ్ సారథి మొమినల్ హఖ్‌ అంటున్నాడు. పర్యటనకు బయల్దేరే రెండు రోజుల ముందే తమకీ విషయం తెలిసిందన్నాడు. బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్‌ గంగూలీ ఆగమేఘాల మీద బంగ్లా క్రికెట్‌ బోర్డును ఒప్పించిన సంగతి తెలిసిందే.

‘సన్నాహక మ్యాచ్‌ ఆడే అవకాశం దొరకలేదు. బోర్డు గులాబి బంతిపై నిర్ణయం తీసుకున్నప్పుడు మేమేం చేయలేకపోయాం. మానసికంగా సిద్ధమవ్వడమే మాకున్న మార్గం. గులాబి బంతితో టెస్టు మ్యాచ్‌ ఆడాలంటే ముందుగా ప్రాక్టీస్‌ మ్యాచుల్ని కచ్చితంగా ఆడాలి. జట్టులో ప్రతి ఒక్కరికీ గులాబి కొత్తే. ఐతే మాకు మంచి నెట్‌ ప్రాక్టీస్ లభించింది. ఆ అనుభవాన్ని ఉపయోగించుకుంటాం. తొలి గులాబి మ్యాచ్‌ ఆడేందుకు ఆసక్తిగా ఉన్నాం’ అని మొమినల్‌ అన్నాడు. 2013లో బంగ్లాదేశ్‌ దేశవాళీలో గులాబి బంతితో ఆడింది. అందులో ప్రస్తుత ఆటగాళ్లెవరూ లేకపోవడం గమనార్హం.

‘సదీర్ఘ ఫార్మాట్‌లో మానసికంగా బలంగా, సహనంగా ఉండటం అవసరం. తొలి టెస్టులో సెషన్ల వారీగా ఆడాలన్నది మా ప్రణాళిక. గతం నుంచి మేం నేర్చుకుంటాం. తొలి ఇన్నింగ్స్‌లో మేం కొన్ని పొరపాట్లు చేశాం. టాప్‌ ఆర్డర్‌లో భాగస్వామ్యాలు లేవు. మెరుగైన షాట్లు ఆడలేదు. ఆ తప్పులను సరిదిద్దుకుంటామన్న నమ్మకం ఉంది. బంగ్లాదేశ్‌  ప్రధాని షేక్‌ హసీనా మ్యాచ్‌ రావడం వల్ల మాపై ఎలాంటి ప్రభావం ఉండదు. మేమంతా ప్రొఫెషనల్‌ ఆటగాళ్లం. మ్యాచ్‌పై మాకు ఆసక్తిగా ఉంది. జట్టు ప్రణాళిక ప్రకారం ఆడతాం’ అని  మొమినల్‌ వెల్లడించాడు.

Tags:

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లాలు

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని