ప్రధానాంశాలు

Published : 06/05/2021 16:29 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
Covid Vaccine వేసుకున్న గబ్బర్‌

ఇంటర్నెట్‌ డెస్క్‌: టీమ్‌ఇండియా ఓపెనర్‌, దిల్లీ క్యాపిటల్స్‌ ఆటగాడు శిఖర్‌ ధావన్‌ కొవిడ్‌-19 టీకా  వేయించుకున్నాడు. కరోనా సంక్షోభంలో ముందుండి పోరాడుతున్న యోధులకు ధన్యవాదాలు తెలియజేశాడు. వీలైనంత త్వరగా ప్రజలు వ్యాక్సిన్‌ వేయించుకొని వైరస్‌ను ఓడించాలని సూచించాడు. ఈ మేరకు అతడో ట్వీట్‌ చేశాడు.

నిరవధికంగా వాయిదా పడ్డ ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌లో శిఖర్‌ ధావన్‌ అదరగొట్టాడు. దిల్లీ క్యాపిటల్స్‌కు అద్భుత విజయాలు అందించాడు. లీగ్‌ ఆరంభం నుంచీ అతడు మంచి ఫామ్‌లోనే ఉండటం గమనార్హం. మొత్తం 8 మ్యాచులు ఆడిన దిల్లీ 6 విజయాలతో 12 పాయింట్లతో పట్టికలో అగ్రస్థానంలో నిలిచిన సంగతి తెలిసిందే. ఇందులో గబ్బరే కీలకంగా నిలిచాడు. 54.28 సగటు, 134.27 స్ట్రైక్‌రేట్‌తో 380 పరుగులు చేశాడు. 3 అర్ధశతకాలు, 43 బౌండరీలు, 8 సిక్సర్లు దంచాడు.

కొవిడ్‌ టీకా వేయించుకున్న తర్వాత గబ్బర్‌ స్పందించాడు. ‘వాక్సినేషన్‌ పూర్తైంది. త్యాగాలు చేస్తూ, అంకితభావంతో ముందు వరుసలో పోరాడుతున్న యోధులకు కేవలం ధన్యవాదాలు మాత్రమే చాలవు. ఏ మాత్రం వెనుకాడకుండా సాధ్యమైనంత త్వరగా మీరంతా టీకా వేయించుకోండి. వైరస్‌ను ఓడించేందుకు అది సాయపడుతుంది’ అని ట్వీటాడు.


1390241037281419266

ఇవీ చదవండి

Tags :

మరిన్ని

తాజా వార్తలు

మరిన్ని
బిజినెస్‌
మరిన్ని
సినిమా
మరిన్ని

చిత్ర వార్తలు

© 1999 - 2021 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers
For Editorial Feedback - eMail: infonet@eenadu.net