అద్భుతాలు
-
రికార్డులను ‘ఈదేసింది’!మనం ఆపకుండా అరగంట నడిచినా, పరుగెత్తినా అలసిపోతాం.. నీటిని చూస్తే భయపడిపోతాం.. కానీ, ఆటిజం(బుద్ధి మాంధ్యం)తో బాధపడే ఓ బాలిక ఈతలో రికార్డులు కొల్లగొట్టేస్తోంది. అందరితో శెభాష్ అని అనిపించుకుంటోంది. ఆ విశేషాలు తెలుసుకుందాం..!!
-
ఆకాశమంత ఎత్తు...అక్కడో అందాల సరస్సు!సముద్ర మట్టానికి కొన్ని వేల మీటర్ల ఎత్తు అంటే.. దాదాపు మేఘాలను తాకేంత ఎత్తు! అంత ఎగువన ఓ సరస్సు ఉంది. కానీ దాని గురించి బయటి ప్రపంచానికి కొన్ని సంవత్సరాల క్రితమే తెలిసింది. ఇంతకీ అది ఎక్కడ ఉంది. దాని విశేషాలేంటో తెలుసుకుందామా!
-
‘మందాయ్’తో వన్యప్రాణులకు హాయ్.. హాయ్!అనగనగా ఓ అడవి.. ఆ అడవి మధ్యలోంచి ఓ రోడ్డు. ఓ జింక పిల్ల రోడ్డు దాటుతోంది.. ఓ పే..ద్ద లారీ చాలా వేగంగా వస్తోంది
-
లైకా.. అనే నేను!హాయ్.. నా పేరు లైకా. నేనో కుక్కను. మామూలు కుక్కనైతే కాను. అంతరిక్షంలోకి వెళ్లిన మొదటిప్రాణిని నేనే. నా గురించి తెలుసుకోవాలని ఉందా?!
-
ఎంత చిన్న పార్కో!కాకులు దూరని కారడవి, చీమలు దూరని చిట్టడవి గురించి వినే ఉంటారు. కానీ.. పాదం కూడా మోపలేని పార్కు విషయం విన్నారా?! ఇలాంటి ఉద్యానవనాలు కూడా ఉంటాయా? అనే అనుమానం
-
బొమ్మ ఎమోజీలతో భలే భలే..!!పిల్లలూ.. స్నేహితులతో మాట్లాడాలన్నా, బంధువులను పలకరించాలన్నా ఇప్పుడంతా ఫోన్లో చాటింగ్ ద్వారానే కదా! ఆ చాటింగ్‌లోనూ అక్షరాల కన్నా రకరకాల గుర్తులే(సింబల్స్) అధికంగా వినియోగిస్తాం. వాటినే సాంకేతికంగా ఎమోజీలు అని పిలుస్తుంటాం. నవ్వుకో ఎమోజీ, నమస్కారానికో ఎమోజీ, నచ్చినా ఎమోజీ, నచ్చకపోయినా ఎమోజీ..
-
హోటల్ చల్లగా.. ఆహారం వేడిగా.!పిల్లలూ.. మంచుతో నిర్మించే ఇళ్లను ఇగ్లూలు అని, వాటిలో నివసించే వారిని ఎస్కిమోలు అంటారని చదువుకొనే ఉంటారు. అయితే, ఇటువంటి కట్టడాలు యూరప్ దేశాల్లోనే ఎక్కువగా కనిపిస్తుంటాయి. ఇప్పుడు మన దగ్గర తొలి ‘ఇగ్లూ కేఫ్’ను ప్రారంభించారు. అది పర్యాటకులకు సరికొత్త అనుభూతిని ఇస్తోంది. ఇంతకీ ఆ కేఫ్ ఎక్కడో, దాని విశేషాలేంటో తెలుసుకుందామా..!!
-
రోబో సాయం..ఇంట్లోనే వ్యవసాయం!మనం తినే ఆహారాన్ని సొంతంగా పండించుకోవాలని చాలామందికి ఉంటుంది. కానీ, స్థలం కొరత, అవగాహన లేకపోవడం తదితర కారణాలతో కూరగాయలు, బియ్యం అన్నీ బయటి నుంచే కొని తెచ్చుకోవాల్సిన పరిస్థితి. ఈ సమస్యకు ఓ కుర్రాడు పరిష్కారం ఆలోచించాడు. అదే ‘ఆటో ఫార్మ్’. ఆ విశేషాలు తెలుసుకుందామా..!!
-
‘హిమాలయాలు’ కరుగుతున్నాయి!హిమాలయ పర్వతాలు తెలుసు కదా.. అక్కడ సాధారణం కన్నా ఎక్కువగా మంచు కరుగుతోందంట. ఏటా 5 బిలియన్ల దుమ్ము కణాలు కొత్తగా భూమి మీదకు చేరుతున్నాయంట. అవి హిమాలయాల్లోని మంచును కరిగిస్తున్నాయని శాస్త్రవేత్తలు తేల్చారు.
-
ఇది కృత్రిమ దీవి!దీవులు.. అదే ఐలాండ్స్ అనగానే గుర్తొచ్చేవి మన దగ్గర అండమాన్ నికోబార్.. విదేశాల్లో మాల్దీవులు. అంతే కదా? ప్రస్తుతం మాల్దీవులు పర్యావరణ కాలుష్యంతో అనేక సమస్యలు
-
గిరగిరా.. గింగిరాలు తిరిగి..మీరు ఎప్పుడైనా మ్యాజిక్ షోకు వెళ్లారా?! పోనీ టీవీలో అయినా చూశారా? అందులో ఎక్కువగా మ్యాజిక్‌లు పేకముక్కలతో చేస్తుంటారు కదా! ముఖ్యంగా ప్లేయింగ్ కార్డ్‌ను గాల్లోనే గిరగిరా గింగిరాలు తిరిగేలా చేస్తారు. అదెలా చేస్తారో.. మనం ఈ రోజు నేర్చుకుందామా?
-
ఖాళీ చేతిలో నాణెం!హాయ్ ఫ్రెండ్స్.. మీకు మ్యాజిక్ ద్వారా.. గాల్లో నాణేలు సృష్టించడం వచ్చా! ‘రాదు.. వస్తే బాగుండు! ఎంచక్కా.. ఎన్నంటే అన్ని కాయిన్స్ మన చేతుల్లోకి తెచ్చుకోవచ్ఛు బోలెడన్ని ఐస్‌క్రీంలు, చాక్లెట్లు కొనుక్కొని తినొచ్చు!’ అనుకుంటున్నారేమో? కానీ నిజంగా గాల్లో నుంచి మన చేతుల్లోకి కాయిన్లు రావు.
-
ఓహో.. గులాబి మామా!లాక్డౌన్... మనందరిలానే చిన్నూ కూడా ఇంట్లోనే ఉన్నాడు.మామయ్యతో కలిసి వార్తలు చూస్తున్నాడు..ఈరోజు పింక్ మూన్ కనిపిస్తుందని విన్నాడు...గులాబీ చందమామా! అని ఆశ్చర్యపోయాడు... చిన్నూకి బోలెడన్ని సందేహాలు వచ్చేశాయ్... ఇంకేముంది. పక్కనే ఉన్న మామాయ్యని అడిగితే చెప్పేశాడు. అవేంటో మనమూ తెలుసుకుందామా!
-
చిటికెలో చక్కని టెడ్డీబేర్!టెడ్డీబేర్ బొమ్మ భలే ముద్దుగా ఉంటుంది కదూ! మరి మనం ఇంట్లోనే చిటికెలో ఎలా తయారు చేసుకుందామో తెలుసుకుందామా. దీనికోసం ఓ డస్టర్, అయిదు రబ్బరు బ్యాండ్లు, కొంచెం జిగురు, ఓ రంగు దారం, టెడ్డీబేర్‌కు అతికించడానికి పాత బొమ్మల నుంచి సేకరించిన కళ్లు తీసుకోండి. ఓ వేళ లేకపోయినా ఫర్వాలేదు. పెన్నుతోనూ గీసుకోవచ్చు. కాగితాన్ని గుండ్రంగా కత్తిరించుకుని...
-
బుజ్జి.. బుజ్జి.. మరుగుజ్జు పర్వతాలుకనుచూపు మేరంతా ఎడారి.. మధ్యలో మేకుల్లా పొడుచుకొచ్చిన చిన్న చిన్న పర్వతాల వంటి ఆకారాలు.. అయినా.. ఎడారిలో పర్వతాలేంటి? విచిత్రం కాకపోతే! అని ఆశ్చర్యపోతున్నారా? అయితే ఇంకెందుకాలస్యం చదివేయండి మరి!
-
మెరుపుల వెండి.. కబుర్లు వినండి!వెండిని చూసుంటారు... దాంతో తయారైన ఆభరణాలు వేసుకుని ఉంటారు... మరి దాని వల్ల ఇంకేమైనా లాభాలున్నాయా? అసలది ఎన్ని రకాలుగా ఉంటుంది? ఈ విషయాలేమైనా తెలుసా? తెలియకపోతే చదివేయండి గబగబా!
-
సైన్స్.. తుఝే సలాం..సైన్సు మన జీవితంలో ఓ ముఖ్య భాగం. మనం వాడుకునే చిన్న యంత్రాల నుంచి విద్యుత్తు బల్బు, అంతరిక్ష పరిశోధనల వరకు సైన్సు, సాంకేతిక శాస్త్రం మనకు అందించిన బహుమతులే. మన దేశ శాస్త్రవేత్తలు ఎన్నో అద్భుత పరిశోధనలు చేసి చరిత్రలో గొప్ప ముద్రలు వేసుకున్నారు. జాతీయ సైన్స్ దినోత్సవం సందర్భంగా ఆ సంగతులేంటో తెలుసుకుందామా?!
-
ఎత్తయిన రికార్డు ఎక్కేసింది!ఎవరీ చిన్నారి?
పేరు కామ్యా కార్తికేయన్. వయసు పన్నెండేళ్లు. ఉండేది ముంబయిలో.
మరి మన పేజీలోకి ఎందుకొచ్చింది?
చిన్న వయసులోనే ఎన్నో ఎత్తయిన పర్వతాలను అధిరోహిస్తూ ప్రశంసలు అందుకుంటోంది.
-
చిత్ర విచిత్రాల నక్షత్ర కోటఅనగనగా ఒక కోట... అదీ సాదాసీదా కోట కాదు... చిత్రమైన నక్షత్ర కోట... పైనుంచి చూస్తే అచ్చం స్టార్ ఆకారంలో కనిపిస్తుందిది... ఇంకా ఇక్కడ ఏమేం వింతలున్నాయో తెలుసుకోవాలనుందా? ఇంకెందుకాలస్యం చదివేయండి మరి...
-
పిట్టలా? పువ్వులా?రంగు రంగుల పువ్వుల్ని చూస్తుంటాం...
ఎన్నో వన్నెల పక్షుల్నీ చూస్తుంటాం...
మరి పక్షుల్లాంటి పువ్వుల్ని చూశారా?
వాటి సంగతులు విన్నారా?
ఆ విశేషాలేంటో చదివేయండి మరి! ఏంటో ఎండిపోయిన కొమ్మ మీద జంట పక్షులు కొంటెగా చూస్తున్నట్లు ఉన్నాయి కదూ! నిజానికి ఇవి పిట్టలు కావు. అలా కనిపిస్తున్న పువ్వులు. తెలుపు, గులాబీ రంగుల్లో ఉన్న చిన్న పక్షుల్లా కనిపిస్తాయివి....
-
అయ్.. బాబోయ్ ఎంత పొడవో!ఏంటి అలా చూస్తున్నారు? చూసి చూసి మీ మెడలు నొప్పి పుట్టాల్సిందే! ఎందుకంటే నేను ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన చెట్టును! నా గురించి మరిన్ని వివరాలు కావాలా?! ఇంకెందుకాలస్యం.. చదివేయండి మరి!
-
దొరికేశాయ్ కొత్తకొత్త జీవులు!ఏంటి మమ్మల్ని వింతగా చూస్తున్నారు.. కొత్తగా ఉన్నామనా?... మా అయిదుగురినే ఇలా చూస్తున్నారు... ఇక మొత్తం 71 జీవులం వస్తే ఏంటీ మీ పరిస్థితి! ఇంతకీ మేం ఎవరం? అసలు ఈ 71 ఏంటనా? మీ సందేహం.. ఇంకెందుకాలస్యం చదివేయండి మరి!
-
కంటికి.. పంటికి.. ఒంటికి..మీరు ఎగ్జిబిషన్లలో, బొమ్మల దుకాణాల్లో, ఆన్లైన్లోనో ఎక్కడో ఓ చోట.. ఎప్పుడో ఓ సారి లేజర్ గన్ కొనుక్కొని ఆడుకునే ఉంటారు కదా! అప్పుడు మీరు మాములు టార్చ్‌లైట్‌కు లేజర్ లైట్‌కు తేడా గమనించి ఉంటారు! మాములు లైట్ నుంచి వచ్చే వెలుగు అన్ని వైపులకూ వెళుతుంది. లేజర్ లైట్ మాత్రం చెల్లాచెదురు కాదు. అందులోని కాంతి నేరుగా ప్రయాణిస్తుంది.
-
దరికొచ్చిన అంతరిక్షం!హాయ్ ఫ్రెండ్స్.. బాగున్నారా? నేను ఎవరని చూస్తున్నారా? నేనండీ బస్సును.. బస్సంటే మాములు బస్సును కాదు! ఎన్నెన్నో అంతరిక్ష విశేషాలు.. మోసుకు వస్తున్న దాన్ని. ప్రస్తుతానికి వరంగల్‌కు వచ్చాను.. మీరంతా ఇక్కడికి రాలేరు కదా.. అందుకే మీ కోసం నేనే ఇలా వచ్చా... మరి ఆ విశేషాలేంటో తెలుసుకుంటారా..?!
-
ఆల్చిప్ప..అయ్ బాబోయ్.. ఎంతో గొప్ప!హలో ఫ్రెండ్స్.. బాగున్నారా..నేను మీ ఆల్చిప్పను.. మీ ముత్యపు చిప్పను! మిమ్మల్ని పలకరిద్దామని...పనిలో పనిగా నా విశేషాలు కొన్ని మీకు చెప్పిపోదామని ఇలా వచ్చాను..నన్ను పేరుకు ఆల్చిప్ప అంటారు... కానీ మళ్లీ నాలో కొన్ని వందల రకాలున్నాయి.
-
దాహమా!? ఏమిటది..?మనం నీళ్లు తాగకుండా ఒక్కరోజైనా ఉండలేం... కానీ కొన్ని జీవులున్నాయి... ‘ఆ తెలుసు... ఒంటె గురించేగా’ అనుకుంటున్నారా?అదే కాకుండా ఇంకా ఉన్నాయ్... వారాలకు వారాలు నీళ్లు తాగవు... ఒకటైతే జీవితాంతం మంచినీళ్లు ముట్టుకోదు... ఇంతకీ అవేంటీ? ఎలా బతికేస్తాయి? చెప్పేయడానికి అవే వచ్చేశాయ్!
-
పర్పుల్ కొండపై పచ్చల దండ!తూర్పు చైనాలో నాన్జింగ్ అనే ఓ నగరం ఉంది. దీనికి ఆరు కిలోమీటర్ల దూరంలో అందమైన జోంగ్షాన్ పర్వతం. దానిపై ఎన్నో ఆకర్షణలు ఉన్నాయి. వాటిలో ప్రత్యేకమైంది ఏంటో తెలుసా? మీలింగ్ ప్యాలెస్. ఎందుకంటే చుట్టూ హారంగా పెరిగిన చెట్ల మధ్యలో.. లాకెట్‌లా ఈ భవనం భలేగా కనిపిస్తుంది. రుతువులు మారినప్పుడు కొన్ని చెట్ల ఆకుల రంగులూ మారతాయి! అలా ఈ భవన పరిసరాలు ఓసారి పచ్చలహారంగా..
-
B ఫర్ బలం!‘‘ఒకటి, రెండు, మూడు... ఏంటవి? అనుకుంటున్నారా? ఇవే మా పేర్లు. అవును... మాకు విటమిన్ బి1, బి2, బి3, బి5, బి6, బి7, బి9, బి12.. ఇలా బోలెడు పేర్లు పెట్టేసుకున్నారాయె. అందుకే అలా చెప్పాం. అయినా ఇప్పుడు అర్థమై ఉంటుందే మీ ముందుకు వచ్చింది బి విటమిన్లని. మా కబుర్లు చెప్పాలని కట్టకట్టుకొని వచ్చేశాం...
-
దుర్గం కాదిది స్వర్గం!హాయ్ ఫ్రెండ్స్! ఎలా ఉన్నారు? నేను మీ చిన్నూనొచ్చేశా. మొన్న సెలవుల్లో సరదాగా చాలా ఊళ్లు చుట్టేశా. బోలెడన్ని కోటలు చూసేశా. అబ్బ! ఎంత బాగున్నాయో! ఆ ముచ్చట్లు మీతో పంచుకోవాలనే ఇలా వచ్చేశా. ఆ కోటల్లో నాకు బాగా నచ్చింది రాజస్థాన్‌లో చిత్తోర్‌గఢ్‌లో ఉన్న పే...ద్ద కోట. ఈరోజుకు దాని ముచ్చట్లు చెప్పేస్తా. మరి వినేస్తారా?....
-
వాలు కళ్ల వయ్యారి... వేల కళ్ల సింగారి!మన పురాణాల్లో... మూడు కళ్లున్న శివుడి గురించీ... వెయ్యి కన్నులున్న ఇంద్రుడి సంగతీ వినే ఉంటారు...
మరి తెలుసా? మూడు కళ్ల సరీసృపం... ఐదు కళ్ల కీటకం... వేయి కళ్ల జీవి... ఆశ్చర్యంగా ఉందా? వివరాలు చదివేయండి!
-
ఇది కట్టడాల 'మాయ'!హల్లో నేస్తాలూ! చిన్నూనొచ్చేశా! ఈసారి ఎక్కడికి వెళ్లొచ్చాననుకుంటున్నారూ...? చిచెన్ ఇట్జాకు... పేరు ఎప్పుడూ విననట్టున్నా... ఇక్కడున్న కట్టడం బొమ్మ చూస్తే మీరూ గుర్తుపట్టేస్తారు. ఎందుకంటే ఇది కొత్త ప్రపంచ వింతల్లో ఒకటి. నా టూర్ కబుర్లు మొదలెట్టెయ్యనా మరి?
-
సాహసాలు.. సరదాలాటలు!కబడ్డీ. ఖోఖో. వాలీబాల్. క్రికెట్... అంటూ రకరకాల ఆటలు ఆడేస్తాం... కానీ కొన్ని ఆటలున్నాయి... వాటిల్లో ఒకటి ఒళ్లు గగుర్పొడిచేలా ఉంటే... మరోటి మనల్ని ఆశ్చర్యపరుస్తుంది... ఇంకోటి భలే థ్రిల్లింగ్‌గా అనిపిస్తుంది... ఇంతకీ ఆ ఆటలేంటో? వాటి ముచ్చటేంటో?....
-
ఇంద్ర ధనస్సుకు ఒక్కటే రంగుఇంద్రధనుస్సంటే ఏడు రంగులు... అదే మనందరికీ తెలుసు... మరి ఓ చిత్రమైన హరివల్లుంది... అది ఈ మధ్య ఒక్క వర్ణంతోనే కనిపించింది... దాన్ని చూసి అంతా ఆశ్చర్యపోయారు... అలాంటి తమాషా విషయం మనం తెలుసుకోకపోతే ఎలా?
-
‘చూడరాని ఊరు’ చూసొద్దాం!చూడరని ఊరు చూసోద్దాం! హాయ్ ఫ్రెండ్స్... నేను మీ చిన్నూని... మొన్నీ మధ్య బిజింగ్ వెళ్లొచ్చా... అక్కడో అద్భూతమైన రాజా నిలయం చూశా... పేరు ఫర్ బిడెన్ సిటీ... దానిసంగతులు విని తెగ ఆశ్చర్యపోయా అవేంటో చెప్పడానికే ఇలా వచ్చా! ఈ ఫర్బిడెన్ సిటీ అనే పేరు గమ్మత్తుగా ఉంది కదూ! అంటే నిషిద్ధనగరమని అర్థం. అప్పట్లో సామాన్య ప్రజల్ని లోపలికి అనుమతించేవారు కాదట. అందుకే ఆ పేరు. అయితే ఇప్పుడు ఎవరైనా ఎంచక్కా వెళ్లి చూసి రావచ్చు...
-
వీటికి ఎన్ని గుండెలు?మనకో గుండె... దానిలో నాలుగు గదులు... అన్ని జీవులకీ ఇలానే ఉంటాయనుకుంటే పప్పులో కాలేసినట్లే. ఒకటి కన్నా ఎక్కువ గుండెలున్న జీవులు కొన్ని ఉన్నాయి. అవే ఇవాళ ఇలా మన పేజీలోకొచ్చేశాయి. సెఫలోపొడా కుటుంబానికి చెందిన జీవుల్లో ఆక్టోపస్ ఒకటి. దీనికి మూడు గుండెలుంటాయి. నీలం రంగు రక్తం ఉంటుంది....
-
సాగర తీరాలు... ఎన్నెన్నో వర్ణాలు!ఎప్పుడైనా సముద్ర తీరానికి వెళ్లారా? అక్కడ ఇసుక ఏ రంగులో ఉంది? కాస్త తెల్లగానో... లేకపోతే గోధుమరంగులోనొ అంటారా? మనం మన దగ్గర ఎక్కువగా ఇలాంటి వాటినే చూస్తుంటాం. కానీ, ప్రపంచం మొత్తంలో రంగు రంగుల బీచ్‌లు బోలెడున్నాయి... ఊదా, పచ్చ, ఎరుపు, తెలుపు, నలుపు, పసుపు...ఇలాగన్నమాట! వాటిలో కొన్నింటి గురించి చదివేద్దాం రండి మరి...
-
పోటీలో నెగ్గింది.. భవనమయ్యింది!ఆస్ట్రేలియా అనగానే సిడ్నీ గుర్తొచ్చేస్తుంది...సిడ్నీ అనగానే అక్కడి ఒపేరా హౌస్ జ్ఞాపకమొచ్చేస్తుంది... మరి నేను ఇప్పుడు అక్కడికే వెళ్లొచ్చా...ఆ కబుర్లను మీ కోసం ఇక్కడికి మోసుకొచ్చా...నేనెవరూ...? మీ చిన్నూ!
-
ఇది క్లిక్ క్లిక్‌ల వంతెన!హల్లో నేస్తాలూ!
నేను చిన్నూనొచ్చేశా...ఈసారి అమెరికాలోని కాలిఫోర్నియా వెళ్లొచ్ఛా..
అక్కడ గోల్డెన్గేట్ బ్రిడ్జ్ చూసొచ్ఛా.. వండర్ ఆఫ్ మోడ్రన్ వరల్డ్‌గా దానికి పేరు...దాని విశేషాలు మీ కోసం మోస్కొచ్చా! గోల్డెన్ గేట్ బ్రిడ్జ్.. ఈ పేరు వినగానే చాలా మందికి తెలిసిపోయి ఉంటుంది. ఇది అమెరికాలోని కాలిఫోర్నియా రాష్ట్రంలో ఉంది. పసిఫిక్ మహా సముద్రంలో శాన్ఫ్రాన్సిస్కో, మెరైన్ కౌంటీలను కలుపుతూ ఉంటుంది. వంతెన మీద నుంచి వెళుతున్నప్పుడు...
-
దేవదారుని కాదు... అశోకానీ కాదు!హాయ్ ఫ్రెండ్స్... నన్ను చూసే ఉంటారుగా...కానీ నా కబుర్లు మాత్రం మీకంతగా తెలియదనుకుంటా... ఏకంగా నా పేరునే తప్పుగా పిలుస్తారు... అందుకే నా విశేషాలు చెప్పాలని ఇలా వచ్ఛా.. ఆలస్యం దేనికి? చదివేయండి మరి! నన్ను మీరంతా అశోక వృక్షమని అనుకుంటారు. కానీ అశోక చెట్టు అనేది వేరేది ఉంది. నిజానికి నా పేరు నరమామిడి. ఇంకా పొలియాల్థియా లాంగీఫోలియా అనీ పిలుస్తారు....
-
ఆణిముత్యంపరిస్థితులు ఎలా ఉన్నా మనం మనలా ఉండగలగడమే మన మనో ధైర్యానికి ని...
-
రైల్లో వెళుతూ...గాల్లో తేలుతూ!ఆ రైలు ఎక్కితే రోలర్‌కోస్టర్ ఎక్కినట్టే... రయ్యిమంటూ పైకి దూసుకుపోతుంది... ఎంతో ఎత్తులో వెళ్లిపోతుంది... ఏటవాలుగా ప్రయాణించేస్తుంది... ఓ వింత అనుభూతినిస్తుంది... రైలేంటీ? రైడ్‌లా మారడం ఏంటీ? చదివేస్తే మీకే తెలుస్తుంది!....
-
గాడ్జిల్లాలతో తిరిగాయ్... మనతో చేరాయ్!ఈ రోజు దోమది...అర్థం కాలేదా?
ఇవాళ ‘వరల్డ్ మస్కిటో డే’...అసలు దీనికీ ఓ రోజు ఎందుకు? ఆడ దోమలే మనల్ని కుడతాయెందుకు?
కార్బన్ డయాక్సైడ్ వీటికి ఇష్టమట. అదెందుకు?
ఇంకా బోలెడు సంగతులు...ఇవిగో! మనం ఆంగ్లంలో దోమల్ని మస్కిటోస్ అని పిలుస్తాం కదా. అది స్పానిష్ పదం. ఆ మాటకు అర్థం ‘ఎగిరే చిన్నజీవి’ అని. వీటిని కొన్ని దేశాల్లో మోజీస్ అనీ పిలుస్తుంటారు....
-
మనుషులు చేసిన దీవులు!అనగనగా కొన్ని సరస్సులు.. వాటిలో ఒద్దికగా సర్దినట్లు దీవులు.. మళ్లీ వాటిల్లో పచ్చటి పొలాలు.. వెరసి ఆ ప్రాంతం ఓ కొత్త లోకం.. దాని విశేషాలే ఇవి! అబ్బ! ఈ చిత్రాలు చూస్తుంటేనే భలేగా అనిపిస్తోంది కదూ! ఇంటికో దీవి. దీవికో రేవు అన్నట్లు ఈ ప్రాంతం ఎంత చక్కదనంతో ఉందో! చూడముచ్చటైన ఈ చోటు నెదర్లాండ్స్లోది. ఈ దేశంలో యుట్రెక్ట్ ప్రావిన్సు మొత్తం ఇలా బోలెడు సరస్సులతో నిండి ఉంటుంది. చిత్రమేమంటే ఈ సరస్సులు ఒకదానితో....
-
ఆణిముత్యంప్రయత్నం ఎప్పటికీ వృథా కాదు, వైఫల్యం శాశ్వతం,...
-
ఇసుక తిన్నెలు...నడుస్తాయిక్కడ!చూపు చేరినంత దూరం ఇసుకే...
ఎక్కడో ఓ చిన్న పొద..
అక్కడక్కడా ఓ ఒయాసిస్...
ఇలా కనిపించి అలా మాయమయ్యే ఏరు...
అప్పటికప్పుడే రూపం మార్చేసుకునే ఇసుక తిన్నెలు...
ఏంటివన్నీ అంటే సహారా ఎడారి సంగతులు!
ప్రపంచంలోనే అతి పెద్ద ఇసుక ఎడారి అనగానే సహారానే
గుర్తొస్తుంది. అంతకు మించి దాని గురించి పెద్దగా తెలియదు మనకు. ఆసక్తికరమైన
విషయాలు ఇక్కడెన్నో.
అవేంటో చదివేద్దామా మరి!...
-
ఊరంతా గవ్వల్...గవ్వల్ !చుట్టూ నీరు ఉన్న భూభాగాన్ని ద్వీపం అంటాం కదా.. అలాంటి చోటు మొత్తం గవ్వలతో నిండి ఉంటే... భలే ఉంటుంది కదా! ఆ విశేషాలే ఇవి! ఓ ఊరుంది. పేరు జోల్ ఫెడిత్. దానికి ఆనుకునే ఓ బుల్లి ద్వీపం ఉంది. అది ఆ ఊరిదే. అందుకే దాన్ని ఫెడిత్ ఐలాండ్ పేరుతో పిలుస్తుంటారు. దీనికో చిత్రమైన చరిత్ర ఉంది. అదేంటంటే...
-
ఈల వేసి టైం చెప్తుంది !ఆవిరి పొగలు కక్కుతుంది... భలేగా ఈలలూ వేస్తుంది... కానీ అది ప్రెషర్ కుక్కర్ కాదు... ఓ గడియారం... అదేంటో? దాని ముచ్చట్లేంటో ? చదివేద్దామా ! గడియారాలు దేంతో పనిచేస్తాయి? బ్యాటరీలతోనేగా అనేస్తారు. కానీ ఓ దగ్గర దానికి భిన్నం. అందుకే అదే ఓ పర్యటక ప్రాంతం. అసలు దాని ప్రత్యేకత ఏంటబ్బా?
-
వయ్యారి వారధి !ఎంతో ఎత్తులో ఉండే వారధి... వంపులవంపుల వంతెన... విడిపోయే బ్రిడ్జ్... ఇలా చాలా రకాల వంతెనలుంటాయి... కానీ ఓ దగ్గర భలే చిత్రంగా ఉంది... ఎలాగుందో? ఎక్కడుందో? చదివేస్తే పోలా?!
అటో నగరం ఇటో నగరం. మధ్యలో నదీ ప్రవాహం. మరి ఇటు నుంచి అటు వెళ్లాలంటే ఎలా? అందుకే దానిపై ఓ వంతెన కట్టారు. ఎంచక్కా పాదచారులు నడుచుకుంటూ వెళతారు. సైకిళ్లు, చిన్న వాహనాలు రయ్యిమంటూ తిరిగేస్తాయి. ఇంతవరకు బాగానే ఉంది.
-
ఎదిగే ఏడు రంగులు!ఇక్కడున్న నా ఫొటోల్ని చూసి ఇదేంటీ ఇంద్రధనుస్సు ఈ చెట్టుపై పడిందా ఏంటీ? లేదంటే ఎవరైనా దీనిపై రంగులద్దారా? ఇలా మెరిసే రంగులతో కనిపిస్తోంది అనుకుంటున్నారు కదూ... అసలు రూపమే ఇంత... ఇదే నా ప్రత్యేకత... ఇంతకీ నేనెవరో తెలుసా? అదేనండీ ఏ చెట్టునో? నా సంగతులేంటో చెబుతా వినండి!
యూకలిప్టస్ పేరు విన్నారా? అదే... మీకు దగ్గు, జలుబు, జ్వరం వస్తే అమ్మ ఆ యూకలిప్టస్ నూనెను మందులా రాస్తుంది. హా...
-
టమాటా పుట్టిందిక్కడే!ఏంటివి?ఆండిస్ పర్వతాలు.వీటి గొప్పేంటో?ప్రపంచంలోనే అతి పొడవైన పర్వత శ్రేణి ఇదే. అంటే ఇక్కడ పర్వతాలు గొలుసుకట్టుగా చాలా పొడుగుంటాయన్నమాట.ఎంత పొడవు?ఏడు వేల కిలో మీటర్లు. వెడల్పులో అయితే 200 నుంచి 700 కిలోమీటర్ల మేర ఈ పర్వతాలు విస్తరించి ఉన్నాయి.ఎన్ని దేశాల్లో?మొత్తం ఏడు దేశాల్లో, దక్షిణ అమెరికా ఖండమంతా విస్తరించి ఉన్నాయివి. ఆ దేశాలు ఏంటంటే వెనిజులా, కొలంబియా, ఈక్వెడార్, పెరూ, బొలీవియా, చిలీ, అర్జెంటీనా...
-
రేవులో లేని ఓడరేవు!కొండలపై కొటలుండటం చూశాం..తోటలుండటం చూశాం..
ఎక్కడైనా ఓడరేవులుండటం చూశామా?
అలాంటిదే ఓ దగ్గరుంది... దాని విశేషాలే ఇవి! ఓ చోట సముద్రంలో అంతెత్తున, నిట్టనిలువుగా ఓ కొండుంది... దాని మీద ఏ గుడో, బడో ఉందనుకుంటున్నారేమో..? అక్కడున్నది అచ్చంగా ఓడరేవు మరి!...
-
అంతకు మందు... ఆ తర్వాత!రంగురంగుల సీతాకోకచిలుకలంటే మనకు భలే ఇష్టం... అవన్నీ గొంగళి పురుగుల నుంచి వస్తాయనే అనుకుంటాం... మనం చూసే ముళ్లతో ఉండే గొంగళి పురుగులే కాదు... వాటిలోనూ చాలా రకాలుంటాయి... కొన్ని అందంగా, కొన్ని చిత్రంగా ఉంటాయి... అవి గూడు కట్టుకుంటే కొన్ని సీతాకోకచిలుకలవుతాయి...
-
జిమ్మిక్కుల మేజిక్కు!‘అబ్రకదబ్ర... అబ్రకదబ్ర’... ఇదిగోండి క్షణంలో మాయం... అంటూ మేజిక్ చేస్తుంటే భలేగా ఉంటుంది కదూ... ఈరోజు సరదాగా మనమూ మేజిక్ చేసి స్నేహితుల్ని ఆశ్చర్యపరుద్దామా?ఎందుకంటే ఇవాళ మేజిక్ డే!
-
దాగుడుమూతల దండాకోర్!ఇసుకలో కలిసిపోతుందొకటి... పరిసరాల రంగులోకి మారిపోతుంది మరొకటి.... పువ్వులో పువ్వయిపోతుంది ఇంకోటి... ఇవ్వన్నీ రూపులు మార్చే వింత జీవులు... మరి వాటి కబుర్లేంటో తెలుసుకోకపోతే ఎలా?
-
చరిత్ర చెబుతాయ్ శిలాజాలు!మానవుడు పుట్టక ముందే భూమిపై సంచరించాయి రాకాసి బల్లులు (డైనోసార్లు). వాటి గురించీ, మరెన్నో పూర్వకాలపు జీవుల గురించీ మనకు ఎలా తెలిసింది? దానికి సమాధానమే ‘శిలాజాలు’. ఆ కబుర్లను చక్కటి బొమ్మలతో కళ్లకు కట్టినట్టు చెప్పే ఓ పుస్తకం గురించి తెలుసుకుందాం.
భూమిపై మొదటి నుంచీ మనిషి లేడు.
-
మాయా సరోవరం!ప్రపంచంలోని సరస్సుల్లో లోతైంది...అంతేనా ? అతిపెద్ద మంచినీటి సరస్సుల్లో ఒకటి ... అంతేనా? ఇంకా దాని గొప్పలు చాలానే ఉన్నాయి... అదే లేక్ బైకాల్... ఇంతకీ దాని సంగతులేంటి?ఎత్తయిన పర్వతాలు, కొండల మధ్య ఇంచుమించు 636 కిలోమీటర్ల పొడవు, 20 నుంచి 80 కిలోమీటర్ల వెడల్పుతో ఉంటుందిది...
-
ఇవేం పిట్టలండీ బాబూ!కొంచెం రూపులో.... కాస్త రంగులో... ఇంకొంచెం సైజులో... మరికొంచెం తీరులో... పక్షుల్ని ఇట్టే గుర్తుపట్టేస్తాం... కానీ కొన్ని చాలా ప్రత్యేకకం... వింత ఆకారాలతో ‘ఇవి పక్షులా!?’ అన్నట్టు ఉంటాయి... నమ్మకపోతే మీరే చూడండి!...
-
ఈ నగరాలు దాగున్నాయ్!నగరమంటే రణగొణ ధ్వనులు... పరుగులు తీసే మనుషులు... చుట్టూ బోలెడు దుకాణాలు... ఇవే మన కళ్ల ముందు కదలాడతాయి... మరివేం లేని నగరాలు కొన్ని ఉన్నాయి... ఇంకా చెప్పాలంటే అసలిక్కడ మనుషులే ఉండరు... ఈ గమ్మత్తయిన నగరాలేంటో తెలియాలంటే... ఇది చదివేయండి!....
-
బంతిలా మారేదొకటి.. బాణమేసేదొకటి!వింత చేపలున్నాయి... కొన్ని చూడ్డానికి విచిత్రంగా ఉంటాయి... ఇంకొన్ని చేతల్లో చిత్రం అనిపిస్తాయి... ఇవే అవి! రెక్కల మధ్యలో ఒదిగి పోయినట్లు కనిపిస్తున్న దీని పేరు పెటరోయిస్. ఆకారాన్ని బట్టే దీన్ని లయన్ ఫిష్ అనీ అంటుంటారు. అట్లాంటిక్, కరేబియన్, మధ్యదరా సముద్రాల్లో కనిపిస్తుంటుందిది.
-
శిలలపై శిల్పాలు చెక్కినారూ!ప్రపంచంలో అతి పెద్ద దేవాలయం అంకోర్ వాట్. యునెస్కో ప్రపంచ వారసత్వ కట్టడాల్లోనూ ఒకటి. 2007లో ఇది ప్రపంచ కొత్త ఏడు వింతల జాబితాలో స్థానం దక్కించుకుంది. 402 ఎకరాల విస్తీర్ణంలో ఉంది. దీని చుట్టూ ఉండే ప్రహారీ గోడే మూడున్నర కిలోమీటర్లకుపైగా ఉంటుంది. దీన్ని బట్టి ఇదెంత పెద్దదో అర్థం చేసుకోవచ్చు.
-
కొండ మీద కోట... కోట చుట్టూ గోడ!హాయ్ ఫ్రెండ్స్.... నేను మీ చిన్నూని... తెలుసా? ఈసారి నేను ప్రపంచంలోనే రెండో అతిపెద్ద గోడ దగ్గరికి వెళ్లొచ్చా...గ్రేట్ వాల్ ఆఫ్ చైనా తెలుసు...కానీ ఇదేం గోడబ్బా? అని అనుకుంటున్నారు కదూ.. మరేమో అది మన దేశంలోనే ఉంది.. దీన్నే గ్రేట్ వాల్ ఆఫ్ ఇండియా అంటారు...
-
పియానో... పుట్టిందిక్కడే!మహానగరం: ఫ్లోరెన్స్. దేశం: ఇటలీ. జనాభా: మూడు లక్షల 80వేలకు పైన. విస్తీర్ణం: 102.32 చదరపు కిలోమీటర్లు. క్రీస్తు పూర్వం 59లోనే ఈ నగరం నిర్మితమైంది. అప్పట్లో ఫ్లుయెంటి, ఫ్లోరెంటియా అనే రెండు నదుల మధ్యలో దీన్ని ఏర్పాటు చేసుకున్నారు. వాటి పేర్ల మీదనే దీనికి ఫ్లోరెన్స్ అనే పేరొచ్చిందట.రినైసెన్స్ ఆర్ట్‌కి ఇది ప్రసిద్ధి. ఈ కళకు సంబంధించి ప్రపంచంలోనే అతి పెద్ద గ్యాలరీ ఒకటి ఇక్కడుంది. వుఫుజి గ్యాలరీగా పిలుస్తారు దాన్ని....
-
చుట్టాల దీవి!అక్కడ ప్రభుత్వం ఉండదు... ప్రజలే ఉంటారు! అదో దీవి... అంతా సరస్సుతోనే నిండి ఉంటుంది! మరి జనం ఉండేదెక్కడ? వాళ్లు చేసేది ఏంటి?ఈ గమ్మత్తయిన దీవిలో మొత్తం సరస్సే. ఆ సరస్సుకి సముద్రానికీ మధ్యలో పగడపు దిబ్బల వల్ల ఏర్పడిన ఎత్తయిన ప్రాంతం ఉంటుంది. దాని మీదే అక్కడక్కడా భూభాగమూ ఉంటుంది. అక్కడే కొంత మంది జనం నివసిస్తుంటారు. పైగా వాళ్లంతా చుట్టాలే.
-
'ఇంకా' ఇళ్లే!నేస్తాలూ! చిన్నూనొచ్చేశా! పిచ్చు కబుర్లు తెచ్చేశా... అదేంటీ అలా తప్పుతప్పుగా అంటున్నావనుకుంటున్నారా?అదేంలేదు.. నేనిప్పుడు తెచ్చింది మచుపిచ్చు కబుర్లు మరి. మొన్ననే అక్కడికి వెళ్లొచ్చా. దాని విశేషాలు మీ కోసం మోస్కొచ్చా! * ఈ భవనాల మధ్యలో ఓ రాయల్ ఎస్టేట్, ఇంకా రహస్య సభా ప్రాంగణం ఉన్నట్లు చెబుతారు. * యునెస్కో 1983లో దీన్ని ప్రపంచ వారసత్వ కట్టడంగా గుర్తించింది.
-
బాహు బల్లులు!పే......ద్ద భవనమంత ఎత్తుండే డైనోల కథలు వినడమంటే మనకు ఎంతో ఇష్టం... పొ..డ..వై..న తోకతో అవి నడుస్తున్న సినిమాల్ని చూస్తే సరదాగా ఉంటుంది... అవి ఇప్పుడు లేకున్నా... వాటి ముచ్చట్లన్నా భలే ఆసక్తి... అందుకే కొన్ని డైనోసార్లు మన పేజీలోకి వచ్చేశాయి... కొన్ని మిలియన్ ఏళ్లక్రితం నేలపై తిరుగాడిన ఈ జీవులు ఏం చెబుతాయో ఏమో!?......
-
ఓహో.. గులాబీల నగరమా!నగరం: బ్లూంఫౌంటేన్ దేశం: దక్షిణ ఆఫ్రికా విస్తీర్ణం: 236 చదరపు కిలోమీటర్లు జనాభా: దాదాపు రెండున్నర లక్షలు * బ్లూంఫౌంటేన్... దక్షిణ ఆఫ్రికా జ్యుడిషియల్ రాజధాని. ఈ దేశానికున్న మూడు రాజధాని నగరాల్లో ఇదీ ఒకటి. * ఈ నగర ప్రజలు ఎక్కువగా ఆంగ్లం, ఆఫ్రికాన్స్ భాషలు మాట్లాడుతుంటారు. * దేశంలో ఆరో అతిపెద్ద నగరం.* ఈ నగరానికి మంగ్వాంగ్, చిరుతల ప్రాంతం అని రకరకాల పేర్లున్నాయి....
-
వీరు కదిలితే.. వారికి వేణ్ణీళ్లు!నీటిని ఎలా వేడి చేస్తాం? ‘ఏముంది? గీజర్‌లోనో లేదంటే పొయ్యి మీద పెట్టో’ అనేస్తాం.. మరేమో ఓ చోటు మాత్రం ఇందుకు భిన్నం... ఎందుకంటే?నీరు వేడవ్వడానికి వేడి అవసరం కదా. అది ఇటు కరెంటు నుంచైనా రావాలి. అటు పొయ్యి మంట నుంచైనా అందాలి. కానీ ఓ దగ్గర మాత్రం మనుషుల కదలికల నుంచి వస్తోంది. వారి నుంచి వచ్చే ఉష్ణమే నీటిని వేడి చేసేస్తోంది...
-
భలే గాలిమేడ!హాయ్ ఫ్రెండ్స్... ఎలా ఉన్నారు?తెలుసా? ఈసారి నేను గాలిమేడల్ని చూసొచ్చా... ఆ... అంటూ నోరెళ్లబెట్టారు కదూ.. బడాయి కాకపోతే గాలిమేడల్ని చూడ్డమేంటీ అంటారా? వివరాలు చదివితే మీకే తెలుస్తుంది!....
-
ఈ కొండల రుచే వేరన్పా!చిన్న కొండల్లా ఉంటాయ్... చూసేందుకు చిత్రంగా కనిపిస్తాయ్... అవి మట్టివీ కాదు... పోనీ రాతివీ కాదు... ఇంక దేంతో ఏర్పడతాయబ్బా?చిత్రమైన ఆకారంలో చిన్న చిన్న కొండలున్నాయి. తెల్లగా మెరిసిపోతుంటాయి. వాటి మధ్యలో రంగురంగుల పొరలు చారల్లా కనిపిస్తుంటాయి. చూస్తే మంచే ఇలా రంగులు మారిందా? అనిపిస్తుంది కానీ.. ఇదస్సలు మనమనుకున్నదేదీ కాదు....
-
ఈఫిల్ టవర్‌ను వద్దన్నారు!ఈఫిల్ కథ! పారిస్ అనగానే గుర్తొచ్చే ఈఫిల్ టవర్‌ని ముందు ఇక్కడే నిర్మిద్దామనుకున్నారు. దాని రూపకర్త, ఆర్కిటెక్ట్ గుస్తావ ఐఫిల్ తన ప్రాజెక్టు గురించి చెబితే స్పెయిన్‌వారు అందుకు అంగీకరించలేదు. ఇది చాలా పొడవుగా ఉండటం వల్ల తమ సిటీ అందం మరింత పెరగడానికి ఉపయోగపడదని భావించారు. అలా ప్రఖ్యాత ఈఫిల్ టవర్ ఇక్కడ లేకుండా పోయింది...
-
ఈఫిల్ టవర్లు వరుస కట్టాయ్!అంతెత్తునుండే ఈఫిల్ టవర్ అంటే మనకు భలే ఇష్టం... మరి అలాంటివి ఒక్కచోటే బోలెడు కనిపిస్తే... అబ్బ చూసేందుకు భలే ముచ్చటగా ఉండదూ! ఆ దృశ్యాన్ని చూడాలంటే మనం వియత్నాం వెళ్లాల్సిందే... రండి మరి బయలుదేరేద్దాం! అసలే సముద్రం...
-
ఆ అల్లరి పిల్లాడే ఎక్స్‌రేని కనిపెట్టాడు!విలియం రాంట్జన్ ఎయిర్‌పోర్టుకి వెళితే బ్యాగులన్నీ స్కాన్ చేస్తారు... పెద్ద పెద్ద షాపింగ్ మాళ్లు, థియేటర్లు, రైల్వే స్టేషన్లలోనూ పై నుంచి కింది దాకా స్కానింగ్ చేసేస్తారు...
ఏదన్నా దెబ్బ తగిలితే ఎముక ఎలా ఉందో ఎక్స్‌రే తీస్తారు... ఓ శాస్త్రవేత్తనే లేకపోతే ఇవన్నీ సాధ్యమయ్యేవే కాదు... ఆయన ఎవరు? ఆయన పరిశోధనేంటి?
-
సందర్శకుల స్వర్గం!నగరం: నీస్
దేశం: ఫ్రాన్స్
విస్తీర్ణం: 71.92 చదరపు కిలోమీటర్లు
జనాభా: దాదాపు మూడున్నర లక్షలు
* దీనికి నీస్ లా బెల్లే అనే ముద్దు పేరు కూడా ఉంది. ‘నీస్ అందమైనది’ అని దీనర్థం.
* ఐరోపాలోని పురాతనమైన నగరాల్లో ఇదీ ఒకటి. క్రీస్తుపూర్వం 350లోనే గ్రీకులు ఇక్కడ ఆవాసాలు ఏర్పర్చుకున్నారు.
* ఇక్కడి ప్రకృతి సోయగాల్ని చూడ్డానికి ఎక్కడెక్కడి నుంచో పర్యటకులు వస్తుంటారు. వీరి సంఖ్య ఏటా ఇంచుమించు 40 లక్షలు. అంతేకాదూ... వేల ఏళ్ల క్రితమే ఇక్కడికి పర్యటకుల రాక మొదలయ్యింది...
-
చలచల్లని ఎడారులు!ఎడారంటే మండే ఎండ... అంతెత్తునుండే ఇసుక దిబ్బలు... వేడి ఉష్ణోగ్రతలు... మూళ్ళ మొక్కలు... ఇవేగా మనకు గుర్తొచ్చేది... ఇందుకు భిన్నమైన ఎడారులూ ఉన్నాయి... అవేంటో, ఆ వివరాలేంటో చూద్దాం రండి. వేసవి కాలం వచ్చేసింది... ఎండలు మండిపోతున్నాయి... మనకే ఇలా ఉంటే ఇంక ఎడారుల్లో సంగతి ఎలా ఉంటుందో ఏమో అని మనమనుకోవచ్చు. అయితే మన ఊహలకు భిన్నమైన ఎడారులూ చాలానే ఉన్నాయి. వాటిలో వేసవిలోనూ ఇప్పుడు మన దగ్గర ఉన్నదాని కంటే చల్లగానే ఉంటుంది. అయితే ఎప్పుడో ఓసారి ఈ ఎడారుల్లో రికార్డు ఉష్ణోగ్రతలు నమోదవుతుంటాయి గానీ ఇప్పుడు మనం చెప్పుకొనేవన్నీ సరాసరి ఉష్ణోగ్రతలే.
-
పాత రోత కాదు... కొత్త వింతే!నేస్తాలూ! చిన్నూనొచ్చేశా! ఈసారి ఈజిప్టు వెళ్లొచ్చా... ఓ ప్రపంచ వింతని చూసొచ్చా... అదేనండీ... గ్రేట్ పిరమిడ్ ఆఫ్ గిజా... అక్కడి నుంచి బోలెడు కబుర్లు తెచ్చేశా.
ఈజిప్టులో గిజా అని ఓ నగరముంది. అక్కడ ఓ పేద్ద పిరమిడ్ ఉంది. అక్కడికే నేనెళ్లొచ్చా. ఇదీ ప్రపంచ వింతల్లో ఒకటి. దాంట్లోని ఒక్కో రాయీ నా కంటే ఎత్తుంది తెల్సా. దాన్ని చూస్తూనే నోరెళ్లబెట్టాన్నేను. ఈ కట్టడం ఎంత పాతదో! అయినా ఇప్పటికీ కొత్త వింతలాగే అనిపించేసింది నాకు.
-
ఇది నిజంగా స్వీట్ హోం!చాక్లెట్లంటే మనకు బోలెడంత ఇష్టం...ఒకటి,రెండు ఎవరైనా ఇస్తేనే తెగ సంతోషించేస్తాం..మరి ఏకంగా మనం ఉండే ఇల్లే చాక్లెట్‌తో కట్టేస్తే...ఆ ఊహే భలే తమాషాగా ఉంది కదూ! దాన్నే నిజం చేసి చూపాడో కళాకారుడు... ఆ కబుర్లే ఇవి! ఓ అందమైన బుల్లి కాటేజీ... అందులోకి వెళ్లగానే తియ్యని చాక్లెట్ వాసన... ఎటుచూసినా చాక్లెట్ రంగు నోరూరిస్తుంటుంది.. అసలు విషయం ఏంటంటే దాన్ని మొత్తాన్ని అచ్చంగా చాక్లెట్‌తోనే నిర్మించేశారు మరి. ఇదేదో బుల్లి బొమ్మ ఇల్లేమో అనుకోకండి.
-
చెత్తతో ప్రపంచ వింతలు!హాయ్ ఫ్రెండ్స్... నేను మీ చిన్నూని... తెలుసా? నేను ప్రపంచవింతల్ని అరగంటలో చుట్టి వచ్చా... తాజ్‌మహల్ దగ్గర్నించి స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ వరకు... చూసి వచ్చా... అవాక్కయ్యారా? ఆ వివరాలేంటో వింటే మీరూ వెళ్లి రావొచ్చు!
గిజా పిరమిడ్ ఎక్కడుంది? ఈజిప్టులో. మరి లీనింగ్ టవర్ ఆఫ్ పీసా? ఇటలీ దేశంలో. ఐఫిల్ టవర్ చూడాలంటే ఎక్కడికి వెళ్లాలి? ప్యారిస్‌కి. ఇంకా... కొలోసియం, క్రైస్ట్ ది రిడీమర్, స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ చూసి రావాలంటే?
-
మారథాన్ పరుగులు ఇక్కడివే!నగరం: ఏథెన్స్
దేశం: గ్రీసు. ఏథెన్స్... గ్రీసు దేశ రాజధాని. దాదాపు 3,400 సంవత్సరాల పురాతన నగరమిది. ప్రపంచంలోని పురాతనమైన నగరాల్లో ఇదీ ఒకటి. దేశ జనాభాలో 40 శాతం ప్రజలు ఈ నగరంలోనే ఉంటారు. ప్రజాస్వామ్య భావనకు పుట్టినిల్లు ఏథెన్స్. క్రీస్తుపూర్వం 500 సంవత్సరంలోనే ఈ విధానాలు, నిబంధనలు అభివృద్ధి చేశారిక్కడ.
-
ఇల్లే కిలోమీటరు!ఇల్లెంతుంటుంది...? ఏ రెండొందల గజాలో, మూడొందల గజాలో ఉంటుంది... అపార్ట్మెంట్ ఎంతుంటుంది... ఇంకాస్త పెద్ద స్థలంలో ఉంటుంది... మరి ఓ కిలోమీటరుపైనే ఉండే ఇల్లు ఎప్పుడైనా చూశారా?
ప్రపంచంలోనే ఒకే కప్పు కింద ఉన్న అతి పెద్ద నివాస సముదాయం ఏంటో తెలుసా? కార్ల్ మార్క్స్ హాఫ్. ఆస్ట్రియా రాజధాని వియన్నాలో ఉంది.
-
రాళ్లే చిహ్నమయ్యాయి!ఫ్రెండ్స్! నేనే చిన్నూని.. ఇక్కడో ఫొటో ఉంది చూశారూ? దాన్ని నేను బోలెడుసార్లు చూశా... డెస్క్‌టాప్ వాల్పేపర్లాగా పెట్టా... కానీ నాకప్పుడు ఇదేంటో తెలీదు... తెలుసుకుందామనే బయలుదేరా... ఇంగ్లండ్ వెళ్లి దీని కబుర్లన్నీ మోస్కొచ్చా... పేరు స్టోన్హెజ్... వివరాలు ఇవేనోచ్!
-
కదల్లేకపోతేనేం... కదిలే కాలం కథ చెప్పాడు!వ్యాధి రాకుండా ఉండి ఉంటే నేను ఇంత సాధించి ఉండేవాడిని కాదు.
‘నేను 1942 జనవరి 8న సరిగ్గా గెలీలియో మరణించిన 300 సంవత్సరాల తర్వాత జన్మించాను. ఆ రోజున ఎందరో పిల్లలు కూడా పుట్టి ఉంటారు. కానీ వారిలో ఎవరైనా ఖగోళ శాస్త్రంపై శ్రద్ధ చూపించారా? అన్న విషయం నాకు తెలియదు. నా తల్లిదండ్రులు లండన్‌లో నివసిస్తున్నా నేను ఆక్స్‌ఫర్డ్‌లో జన్మించాను.
-
వింతేగా... అంతేగా!ఊపిరితిత్తుల గొప్పలు తెలుసా? చర్మం సంగతులు విన్నారా? బ్యాక్టీరియాల నుంచి మనల్ని రక్షించేది ఎవరు? మెదడు తినే ఆహారం ఎంత? వీటికి జవాబులు కావాలా? ఆలస్యం దేనికి గబగబా చదివేయండి మరి!
పెద్దది!
మన శరీరంలో అతి పెద్ద అవయవం ఏదో తెలుసా? చర్మం. ఇది మన బరువులో 16 శాతం ఉంటుంది. గమ్మత్తయిన విషయం ఏమంటే నెలనెలా చర్మం పూర్తిగా కొత్తగా ఏర్పడుతుంది.
-
80 ద్వారాల మహా మైదానం!కట్టడం: కొలోసియం
ఎప్పుడు: క్రీస్తుశకం 72లో
హాయ్ ఫ్రెండ్స్... నేనే మీ చిన్నూని... ఈసారి ఎక్కడికి వెళ్లానో తెలుసా? ఒకప్పుడు అక్కడ భయంకరమైన పోటీలు జరిగాయి... జంతువులతో పోరాటాలు సాగాయి... అదొక ప్రపంచ వింతగా పేరొందింది... ప్రపంచంలోనే అతి పెద్ద క్రీడా ప్రదర్శనశాల... అదేంటో చెప్పేస్తున్నా... చెప్పేస్తున్నా... ‘కొలోసియం’... మరి దాని సంగతులేంటో మొదలెట్టనా?
-
మూడు నగరాలు ఒక్కటయ్యాయి !నగరం: బుడాపెస్ట్
దేశం: హంగేరి
జనాభా: 17 లక్షలకు పైమాటే
విస్తీర్ణం: 525 చదరపు కిలోమీటర్లు
* బుడాపెస్ట్... హంగేరి రాజధాని. ఈ దేశంలోనే అతి పెద్ద నగరం కూడా.
* 40 థియేటర్లు, 100 మ్యూజియాలు ఉన్నాయి.
* బుడా, పెస్ట్, ఒబుడా అనే మూడు నగరాలు కలిసి బుడాపెస్ట్గా మారింది. 1873లో ఈ మూడు నగరాలు ఒకే పెద్ద నగరంగా ఏర్పడ్డాయన్నమాట....
-
ఎన్నెన్నో వర్ణాల సరస్సు!అనగనగా ఓ సరస్సుంది... ఉప్పు మడులతో ఉంటుంది.... రంగులు మారుతుంటుంది... చిత్రం చేసేస్తుంటుంది... అలా ఎందుకబ్బా అంటే!
ఉప్పు నీటి సరస్సంటే ఉప్పు మడులతో తెల్లగా ఉంటుందనుకుంటాం. కానీ ఊసరవెల్లిలా రంగులు మారుస్తుందనుకుంటామా? అయితే అలాంటిదే ఒకటుంది. దానిలోని మడులు ఒక్కోసారి ఒక్కో రంగులో కనిపిస్తుంటాయి. ఓసారి పచ్చగా, ఇంకోసారి గులాబీ రంగులో, మరోసారి గోధుమ రంగులో... ఇలాగన్నమాట....
-
మాయా జలపాతాలు !రెండు జలపాతాలున్నాయి .. ఎప్పుడూ గడ్డ కట్టినట్టే ఉంటాయి ... కానీ చుట్టూ వేడి వాతావరణమే ... మరీ అవెందుకలా కనిపిస్తాయి ... అసలవి ఎక్కడున్నాయి ? ఏమా సంగతులు ?
చూస్తే పెద్ద జలపాతమేదో కిందికి దూకుతున్నట్లే ఉంటుంది. అక్కడ మాత్రం కొంచెం నీళ్లే కనిపిస్తుంటాయి. దూరం నుంచి చూస్తే గడ్డకట్టిన పెద్ద జలపాతంలా అనిపిస్తుంది. దగ్గరకెళితే రాయే పారే ప్రవాహంలా కనుమాయ చేసేస్తుంది. ఏంటో ఇదంతా.. గజిబిజిగా ఉందే అనిపిస్తోందా? నిజంగానే రెండు జలపాతాలు ఇలాంటి చిత్రమైన తీరుతో ఉన్నాయి....
-
ఫ్రాన్స్ బహుమతి!
నేస్తాలు! చిన్నూనొచ్చేశా... ఈసారి న్యూయార్క్‌లోని స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ చూసొచ్చా... దాన్ని దగ్గర నుంచి చూశాక ఎంత ఆశ్చర్యమేసేసిందో ... దాని వివరాలు తెలుసుకుని అంతే సంబరపడిపోయా... మరి అవన్నీ మీ చెవినేయకపోతే ఎలా? అందుకే ఇలా వచ్చేశా.
కట్టడం: స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ
ప్రదేశం: న్యూయార్క్ (అమెరికా)
స్థాపన: 1886..
-
జవానులకు ప్రణామం!హాయ్ ఫ్రెండ్స్... ఎప్పుడెప్పుడు నేను వస్తానా? ఏ కబుర్లు తెస్తానా? అని ఎదురు చూస్తున్నారు కదూ... మరేమో ఈసారి నేను వెళ్లిన చోటు ఓ వీరజవానుల జ్ఞాపకం... మనదేశంలో చూడదగ్గ ప్రదేశం... దేశం రాజధాని ఆకర్షణ... హా.. అదేనండీ ఇండియా గేట్!
-
ఈ నగరంలో ట్రాఫిక్ లైట్లే లేవ్!నగరం: థింపూ
దేశం: భూటాన్
విస్తీర్ణం: 26 చదరపు కిలోమీటర్లు
జనాభా: లక్షకు పైమాటే
* థింపూ మన పక్క దేశం భూటాన్‌లోని అతి పెద్ద నగరం. దేశ రాజధాని కూడా. వాంగ్ చూ నది వల్ల ఏర్పడ్డ లోయలో భలే అందంగా ఉంటుందీ నగరం.
* భూటాన్‌లో రాచరికపాలన ఉంటుందని వినే ఉంటారుగా. ఆ రాజవంశీయులు ఉండేది థింపూలోనే. నేషనల్ అసెంబ్లీ వంటి రాజకీయ భవనాలూ ఉండేది ఇక్కడే. రాజకీయ, ఆర్థిక వ్యవహారాల కేంద్రం ఇదే.
* ఈ రాజధాని నగరంలో విమానాశ్రయం ఉండదు. ఇక్కడి నుంచి 54 కిలోమీటర్ల దూరంలో పారో ఎయిర్‌పోర్టు ఉంటుంది....
-
పండగ కోసం కడితే ప్రపంచ వింతయ్యింది!నేస్తాలూ! నేను చిన్నూ! ఈసారేమో పారిస్ వెళ్లొచ్చా. ఈఫిల్ టవర్ చూసొచ్చా. దాని గొప్పేంటో తెలుసా? అది ప్రపంచంలోనే అతి ఎత్తయిన ఐరన్ టవర్. చూస్తుంటే అది ఆకాశానికి తగులుతున్నట్టే ఉంది తెల్సా. అక్కడికెళ్లాక దాని విశేషాలు ఇంకా బోలెడన్ని తెలిశాయి... అవన్నీ మీ చెవిలో పడేద్దామని ఇలా వచ్చేశా.
-
మనకిది చలి.. వారికిదే వేడి!మనం ఈ కాస్త చలికే వణికిపోతున్నాం...
ఇంతకంటే దారుణమైన చలిలో ఏడాదంతా ఉంటుందో నగరం...
అందుకే అది ప్రపంచంలోనే అత్యంత చలిగా ఉండే సిటీ అయ్యింది...
ఇంతకీ ఏంటది...?
ఎక్కడుంది...?
ఏమా విశేషాలు...?
ఏడాదికి 365 రోజులు.. అందులో 270 రోజులు ఓ నగరమంతా మంచుతో కప్పే ఉంటుంది. 120 రోజులు మంచు తుపానులు చెలరేగిపోతూనే ఉంటాయి.
అంటే సరాసరిన ప్రతి మూడు రోజుల్లో ఒకరోజు మంచు తుపానే....
-
పసుపుతో పలకరిస్తారు!నగరం: లీమా
దేశం: పెరూ
విస్తీర్ణం: 2672 చదరపు కిలోమీటర్లు
జనాభా: దాదాపు 90 లక్షలు
* లీమా... పెరూ దేశ రాజధాని. దక్షిణ అమెరికా ఖండంలోనే ఐదో అతిపెద్ద నగరం. దేశ వాణిజ్య కేంద్రం ఇదే.
* పసిఫిక్ సముద్ర తీరంలో భలే అందంగా ఉంటుందిది. ఈ నగరంలో దాదాపు 80 కిలోమీటర్ల సముద్ర తీరం ఉంటుంది.
* స్పానిష్ సాహస యాత్రికుడు ఫ్రాన్సిస్కో పిజారో 1535లో ఈ నగరంలో మొదటిసారిగా కాలు మోపాడు. ఈ నగరాన్ని ‘ది సిటీ ఆఫ్ కింగ్స్’ అని పిలిచాడు....
-
నగరమందు గ్రామముంది !నగరాల పక్కనున్న పల్లెటూళ్లను చూసుంటారు... కానీ నగరాల మధ్యలోనే ఉన్న గ్రామాల్ని చూశారా? అదేంటీ? అలాక్కూడా ఉంటాయా? అనుకోకండి. ఓ దేశంలో అలాంటివీ ఉన్నాయి మరి!
చుట్టూ ఎత్తయిన ఆకాశహర్మ్యాలుంటాయి. అవన్నీ ఓ నగరానివి. ఆ మధ్యలో ఓ చిన్న గ్రామం. ఇరుకిరుకు ఇళ్లు. అవి మాత్రం ఓ గ్రామంలోవి. మనందరికీ ఇలాంటివి తెలియకపోవచ్చు. కానీ చైనాలో చాలా నగరాల్లో మాత్రం ఇలాంటి గ్రామాలు కనిపిస్తాయి.....
-
వహ్ తాజ్!హాయ్ ఫ్రెండ్స్... నేను మీ చిన్నూని... ఈసారి ఎక్కడికి వెళ్లానో తెలుసా? ప్రపంచ వింతల్లో ఒకటి... మనదేశంలో అద్భుతమైన కట్టడం... అదేనండీ తాజ్‌మహల్ దగ్గరికి వెళ్లా... ఆ కబుర్లేంటో మొదలెట్టనా?
కట్టడం: తాజ్‌మహల్
ఎక్కడ: ఉత్తర్ ప్రదేశ్‌లోని ఆగ్రా
నిర్మాణం: 1632 - 1653పాలలా మెరిసి పోతున్న తాజ్‌మహల్ ప్రేమకి గుర్తని చెబుతుంటారు. అబ్బ! ఎంత అందంగా ఉందో చెప్పలేను. చూసిన వారు ఎవరైనా వహ్తాజ్ అనాల్సిందే.
-
సైకిళ్ల మీదే ఉద్యోగాలకు !నగరం: కోపెన్హాగన్
దేశం: డెన్మార్క్
జనాభా: ఏడున్నర లక్షలకు పైమాటే
విస్తీర్ణం: 178 చదరపు కిలోమీటర్లు.
డెన్మార్క్ దేశ రాజధాని నగరం కోపెన్హాగన్. పూర్వం ఇదో జాలర్ల గ్రామం. నౌకాశ్రయం ఉండటంతో సముద్రపు దొంగలు చాలాసార్లు ఈ ఊరు మీద పడి దోచేసేవారు. అలాంటి చోటే ఇప్పుడిలా మహానగరంగా మారిపోయింది.
* పర్యావరణాన్ని కాపాడుకోవడానికి ఇప్పుడీ నగరం చాలా జాగ్రత్తలు తీసుకుంటోంది. పవన, సౌర విద్యుత్తులనే వాడుతోంది. ఫలితంగా అంతకు ముందున్న ఉద్గారాలు మూడొంతులు తగ్గిపోయాయి.
* కొన్నేళ్ల నుంచి ఇక్కడ ఖాళీ స్థలాలన్నింటినీ ప్రభుత్వం పార్కులుగా మారుస్తూ వస్తోంది. ప్రజల్ని పచ్చదనానికి దగ్గర చెయ్యాలనే పాకెట్ పార్కుల పేరుతో చిన్న చిన్న పార్కుల్ని తయారు చేసేస్తోంది. అందుకే ఇక్కడ చెట్లు, మొక్కలు ఎక్కువగానే కనిపిస్తుంటాయి....
-
ఈ నగరానికి దారేది ?పెరూ దేశంలోని ఇక్విటుస్ సిటీలో ఇంచుమించు ఐదు లక్షల మంది జనాలు నివసిస్తుంటారు. మన దగ్గర ఉన్నట్లే స్కూళ్లు, ఆసుపత్రులు, షాపింగ్ కాంప్లెక్స్‌లు ఇలా బోలెడన్ని సౌకర్యాలూ ఉంటాయి. ఏ నగరమైనా ఇలాగే ఉంటుంది. అందులో ఏముంది ప్రత్యేకత అంటారా? ఆ.... అక్కడే ఉంది అసలు సంగతి. ఈ నగరంలోకి ఎవరైనా వెళ్లాలన్నా... అక్కడి ప్రజలు వేరే ప్రాంతాలకు ప్రయాణించాలన్నా... అయితే పడవల్లో వెళ్లాలి. లేదంటే హెలీకాఫ్టర్ లాంటి వాటిల్లో గగన విహారం చేయాలి. కారణం ఈ నగరానికి వేరే ఏ ప్రాంతాన్నీ కలుపుతూ రోడ్లు ఉండవు....
-
రెండు ఖండాల వారధి!ఇస్తాంబుల్... టర్కీ దేశంలోని అతి పెద్ద నగరం.ప్రపంచంలో ఏ నగరానికీ లేని ప్రత్యేకత దీని సొంతం. అదేంటంటే... ఇది ఐరోపా, ఆసియా రెండు ఖండాల మధ్య ఉంటుంది.రెండు ఖండాలనూ కలుపుతూ వంతెనలు ఉంటాయీ నగరంలో.....
-
కుతుబ్ మినార్...కబుర్లు విందామ్!హాయ్ ఫ్రెండ్స్... నేను మీ చిన్నూని... మొన్న మేమో చోటుకు వెళ్లొచ్చాం... ఎక్కడికో చెప్పనా? అది ప్రపంచంలోనే ఎత్తయిన ఇటుకల మినార్... గుర్తొచ్చిందా? ఆ... అదేనండీ కుతుబ్ మినార్... చూస్తుంటే భలే ఆనందమేసింది... ఆ సంగతులు మీతో చెప్పాలనే ఇలా వచ్చా!కుతుబ్ మినార్ గురించి పాఠాల్లో విన్నప్పుడు, ఫొన్లో బొమ్మలు చూసినప్పుడు తెలియలేదు కానీ నేరుగా
-
పైనో పట్నం... కిందో పట్నం మధ్యలో లిఫ్టు!ఆ ఎలివేటర్లో ఎక్కగానే జామ్మంటూ కిందకు దూసుకుపోతుంది. క్షణంలో దింపేస్తుంది. ఎక్కిన పరిసరాలేవీ కనిపించవు. కొత్త ప్రాంతానికి తీసుకువెళ్తుంది. అదేంటీ? అంటే? అదుండేది రెండు ప్రాంతాల్ని కలుపుతూ. అంతా గజిబిజిగా ఉందా? అయితే వివరాల్లోకి వెళ్లండి మరి.
-
ఈ పాప్‌కార్న్‌ని చూడగలం.. తినలేం !పాప్‌కార్న్ అంటే మనకు భలే ఇష్టం కదూ... ఓ దగ్గరేమో బీచ్ అంతా పాప్ కార్న్‌తో నిండిపోయింది... అబ్బ.. తినేద్దాం అనుకుంటే కార్న్‌లో కాలేసినట్లే... ఎందుకంటే అది తినలేనిది మరి... ఎందుకో? అదెక్కడో? ఏంటో? బీచ్ అంటే మనందరికీ ముందుగా...
-
శాంతి ఇచ్చేదక్కడే!నార్వే దేశ రాజధాని నగరం ఓస్లో. ఒక వ్యాపార కేంద్రాన్ని ఏర్పరిచేందుకు దీన్ని క్రీస్తు శకం 1000లోనే స్థాపించారు...
-
గూఢచారుల ఊరు!పోర్చుగల్ దేశ రాజధాని నగరం లిస్బన్. ఇక్కడ అతి పెద్ద నగరమూ ఇదే. పశ్చిమ ఐరోపాలో ప్రాచీన నగరంగా దీనికి ...
-
మహా నగరం పోర్చుగీసు అన్వేషకుడు వాస్కో డి గామా ఈ నగరంలో 1497లో మొదటిసారిగా క్రిస్మస్ పండుగ రోజున అడుగుపెట్టాడు. ‘రియో డె నటాల్’ అనే పేరుతో పిలిచాడు. నటాల్ అంటే పోర్చుగీసులో క్రిస్మస్ అని అర్థమట.1824లో ఈ ప్రాంతంలో బ్రిటిష్‌వాళ్లు కాలనీలు ఏర్పాటు చేసుకున్నారు. పోర్ట్ నటాల్ అని పేరు పెట్టారు. ఆ తర్వాత 1835లో ...
-
సరస్సులోని ఊరు!
సరస్సులో ఎక్కడైనా నీళ్లుంటాయిగానీ ఊళ్లుంటాయా? కానీ ఓ చోట నిజ్జంగానే ఊరుంది. ఎక్కడంటే ఆ సరస్సులో ఉన్న దీవుల్లో. అసలీ గందరగోళం ఏంటీ అంటే? ఈ సరస్సు ఉన్నది చైనాలో. అక్కడి జెజియాంగ్ ప్రావిన్సులోని చునాన్ కౌంటీలో...
-
మహా నగరం: ఆక్లండ్
నగరం: ఆక్లండ్
దేశం: న్యూజీలాండ్
విస్తీర్ణం: 1,102 చదరపు కిలోమీటర్లు
జనాభా: పదిహేను లక్షలకు పైమాటే
ఈ నగర పరిపాలనా వ్యవహారాలన్నింటినీ ఆక్లండ్ కౌన్సిల్ చూస్తుంది.
ఇక్కడ చాలా ఎక్కువ నేల, తక్కువ జనాభా. అందుకే ఇది గతంలో నివాసయోగ్యమైన మంచి నగరాల్లో ఒకటిగా స్థానం దక్కించుకుంది. 2006 నుంచీ టాప్ 20లో స్థానం సంపాదించుకుంటోంది.
నీలి రంగులో నిర్మలంగా ఉండే సముద్రపు నీరు ఈ నగరానికి అందాన్ని తెచ్చి పెడుతుంది...
-
డెనిమ్ జీన్స్ పుట్టిందిక్కడే!
మెక్సికో-అమెరికా యుద్ధం(1848) ముందు వరకు మెక్సికో దేశంలోని భాగం. అప్పట్లో దీని పేరు యెర్బా బ్యూనా. ఆ తర్వాతే ఇది పేరు మారి అమెరికాలో కలిసిపోయింది.
ఈ నగరం మొత్తం 50కిపైగా కొండలపై నిర్మితమైంది. రష్యన్, నాబ్, టెలిగ్రాఫ్, ట్విన్ కొండలు.. వాటిలో ప్రముఖమైనవి...
-
మహా నగరం
ప్రఖ్యాత నోబెల్ బహుమతిని స్థాపించిన ఆల్ఫ్రెడ్ నోబెల్‌ది ఈ నగరమే. ఈ బహుమతుల ప్రదానోత్సవం జరిగేది ఇక్కడే. భౌతిక, రసాయన, వైద్యశాస్త్రాల్లో, సాహిత్య విభాగాల్లో నోబెల్ బహుమతుల్ని ఏటా ఈ నగరంలోనే...
-
మేడంత మొక్క!
కొన్ని ఎడారి మొక్కలున్నాయి...వాటికి పండ్లు కాస్తాయి...వాటిని తింటార్ట కూడానూ...పైగా అన్నింటికీ మించినప్రత్యేకత ఇంకోటుంది...ఏంటో.. ఏమో..చదివేస్తే పోలా!
ఎడారి మొక్కంటే ముళ్లతో, దళసరి ఆకులతో, చిన్నగా ఉన్న వాటినే మనం చూస్తుంటాం. మరేమో ఓ రకం ఎడారి మొక్క చాలా చిత్రమైనది. వాటి జాతి ప్రపంచంలోనే అతి ఎత్తయిన ..
జిల్లాలు
-
-
ఎక్కువ మంది చదివినవి (Most Read)