సోమవారం, అక్టోబర్ 26, 2020

సందేహాలు-సమాధానాలు

Updated : 10/04/2019 00:28 IST
ఎన్నికల గుర్తులెందుకు?

చిన్నూ: తాతయ్యా! ఎన్నికల గుర్తుల గురించి చెప్పవా?
ఆర్వీరామారావ్‌ తాతయ్య: ఇప్పుడు ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది కదా! ఆ ప్రచార వాహనాల మీద, ప్రచారం చేసే వారి కండువాల మీద వారి ఎన్నికల గుర్తులు గమనిస్తున్నావుగా. అవే ఎన్నికల గుర్తులు.

చిన్నూ: అవును. చాలా గుర్తులు కనిపిస్తున్నాయి. వాటిలో తేడా ఏంటి?
తాతయ్య: మనం అనుసరిస్తున్న ఎన్నికల పద్ధతిలో ముఖ్యంగా రాజకీయ పార్టీలు పాల్గొంటాయి. అలాగని ఏ పార్టీకీ చెందని వారు పోటీ చేయకూడదని కాదు. ముందు గుర్తుల గురించి చెప్తా.

చిన్నూ: సరే తాతయ్య!
తాతయ్య: ఒక్కో రాజకీయ పార్టీకి ఒక్కో ఎన్నికల గుర్తు ఉంటుంది. ఆ పార్టీ అభ్యర్థులందరికీ అదే గుర్తు. ఒక అభ్యర్థి ఏ పార్టీ తరఫున పోటీ చేస్తున్నారో తెలుసుకోవడానికి ఈ గుర్తు ఉపయోగపడుతుంది.

చిన్నూ: అభ్యర్థుల పేర్లు బ్యాలెట్‌ పత్రం మీద ఉన్నప్పుడు మళ్లీ ఈ గుర్తులు ఎందుకు?
తాతయ్య: పేర్లు ఉంటాయి సరే. కానీ అందరికీ చదువు రాకపోవచ్చు. అందుకని ఎన్నికల గుర్తును బట్టి ఒక అభ్యర్థి ఏ పార్టీ తరఫున పోటీ చేస్తున్నారో తెలుసుకోవచ్చు. చదువు రాని వారి కోసం ఎన్నికల గుర్తులు ఉంటాయి. చదువు రాని వారు గుర్తును బట్టి తమకు నచ్చిన అభ్యర్థికి ఓటు వేయొచ్చు.

చిన్నూ: అందరికీ చదువు వస్తే ఈ గుర్తుల అవసరం ఉండదుగా!
తాతయ్య: ఉండదు. కానీ చదువు రాని వారి కోసమే ఆ పద్ధతి. దేశం మొత్తం మీద చూస్తే 74.04 శాతం మంది చదువు వచ్చిన వారు. మిగతా వారు చదవలేరు కాబట్టి ఎన్నికల గుర్తులు అవసరం.

చిన్నూలాగే ఎన్నికల గురించి మీకూ సందేహాలున్నాయా? అయితే మాకు మెయిల్‌ చేయండి hb.eenadu@gmail.com

మరిన్ని

జిల్లాలు

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని