నవ్వుల జల్లులు

Updated : 02/04/2021 01:13 IST
నవ్వుల్‌.. నవ్వుల్‌..

ఇడ్లీ వద్దు.. వడలే ముద్దు!

టింకు: ఏంటి బంటీ.. నీకు ఇడ్లీ అంటే ఇష్టం కదా..? నువ్వేంటి మీ మమ్మీని వడలు చేసివ్వు అని అడుగుతున్నావ్‌.
బంటి: ఏం లేదు టింకూ.. మా మమ్మీ.. మొన్న పక్కింటి ఆంటీతో.. ‘పిల్లలకు ఇష్టమైనవి ఇవ్వడం కాదు. మనకు ఇష్టమైనవే పిల్లలకు ఇవ్వాలి’ అంది.
టింకు: దానికీ దీనికీ సంబంధం ఏంటి?
బంటి: నేను ఇప్పుడు ఇడ్లీ అడిగాను అనుకో... మా అమ్మ వడలు తీసుకు వస్తుంది. అదే నేను వడలు అడిగితే.. ఇడ్లీ తీసుకు వస్తుందని!
టింకు: ఆఁ!!

చదువంటే ఎంత శ్రద్ధో!

నాన్న: చిన్నూ ఎక్కడికెళ్లావు?
చిన్ను: క్రికెట్‌ ఆడుకుందామని వెళ్లా.. నాన్నా..
నాన్న: మరి చేతిలో ఆ పుస్తకం ఏంటి?
చిన్ను:  అసలే ఎగ్జామ్స్‌ కదా.. ఫీల్డింగ్‌ చేస్తున్నప్పుడు చదువుకుందామని..!

మరిన్ని

జిల్లాలు

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని