ట్విటర్‌లో వీడియో పంచుకున్న మంత్రి
హైదరాబాద్: యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహ స్వామి ఆలయాన్ని ప్రపంచస్థాయిలో పునరుద్ధరించారని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. ఆలయానికి సంబంధించిన వీడియోను కేటీఆర్ తన ట్విట్టర్ ద్వారా పంచుకున్నారు. యాదాద్రి ఆలయం సీఎం కేసీఆర్ కలల ప్రాజెక్టు అని కేటీఆర్ తెలిపారు. ప్రతిష్ఠాత్మక కాళేశ్వరం, పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టులను చేపట్టిన కేసీఆర్.. యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహ స్వామి ఆలయాన్ని ఎంతో పట్టుదలతో పూర్తి చేసేలా చర్యలు తీసుకున్నారని పేర్కొన్నారు. ప్రపంచస్థాయి ఆధ్యాత్మిక నగరిగా యాదాద్రిని తీర్చిదిద్దుతున్నట్లు కేటీఆర్ చెప్పారు.
ఇవీ చదవండి..